భారీ మెజార్టీతో విక్రమ్‌రెడ్డి గెలుపు ఖాయం

ఇంధనం, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నికలో వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని ఇంధనం, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆత్మకూరులోని శ్రీధర్‌ గార్డెన్స్‌లో డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ముఖ్యనేతలతో కలిసి మంత్రి పెద్దిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. మూడేళ్ల పాలనలోనే మేనిఫెస్టోలోని 95 శాతం హామీలు అమలు చేసిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌దేనన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ మరేరాష్ట్రంలో లేనివిధంగా సంక్షేమ పథకాల క్యాలెండర్‌ విడుదల చేసి క్రమం తప్పకుండా సంక్షేమ పథకాలను సీఎం వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్నారన్నారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కుటుంబంపై ఉండే అభిమానం, సీఎం వైయస్‌ జగన్‌పై ప్రజలకు ఉన్న ప్రేమ ఈ రెండూ తప్పనిసరిగా ఆత్మకూరు ఉప ఎన్నికలో వైయస్‌ఆర్‌ సీపీకి అత్యధిక మెజార్టీ ఇస్తాయ‌ని భావిస్తున్నామన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top