చంద్రబాబు.. రాజకీయాలకు సిగ్గుచేటు

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  
 

 అమరావతి: చంద్రబాబు.. రాజకీయాలకు సిగ్గుచేటని.. వ్యవస్థలను, కుల వ్యక్తులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చే​స్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఆయనకు చేతనైతే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని పెద్దిరెడ్డి  సవాల్‌ విసిరారు.స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన 11మంది వైయస్సార్‌ కాంగ్రెస్ పార్టీ సభ్యులు బుధవారం ఏపీ మండలి ఛైర్మన్‌ ఆఫీస్‌లో ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. శాసనమండలిలో సీఎం వైయస్ జగన్‌ అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలతో ప్రజలకు మేలు చేస్తున్నారని తెలిపారు.

టీడీపీ నేతలు ఇళ్ల రుణమాఫీ పథకంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గతంలో చంద్రబాబు.. సీఎంగా ఉన్నప్పుడు డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో మహిళలను మోసం చేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు.. శాసన మండలిలో గ్యాలరీ ఎక్కి మరీ బెదిరించారని పెద్దిరెడ్డి గుర్తుచేశారు.

తాజా వీడియోలు

Back to Top