ప్ర‌జా సంక్షేమం, రాష్ట్ర‌ అభివృద్ధి దిశగా ప్రభుత్వం పనిచేస్తోంది

బద్వేల్‌ ఉప ఎన్నిక పార్టీ ఇన్‌చార్జ్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

వైయస్‌ఆర్‌ జిల్లా: అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే మేనిఫెస్టోలోని హామీలను 90 శాతానికి పైగా హామీలు అమలు చేసిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదని బద్వేల్‌ ఉప ఎన్నిక వైయస్‌ఆర్‌ సీపీ ఇన్‌చార్జ్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. బద్వేల్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌ సీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ఉప ఎన్నికలో వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి డాక్టర్‌ సుధను భారీ మెజార్టీతో గెలిపించాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పాలనను ప్రతి గడపకూ తీసుకెళ్లాలన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ బద్వేలు ప్రజలకు అండగా ఉన్నారని మరోసారి నిరూపించాలన్నారు. సంక్షేమం, అభివృద్ధి దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top