ప్రజా సంక్షేమానికి 18 నెలల పాలనే నిదర్శనం

ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్‌ జగన్‌ నెరవేరుస్తున్నారు

మేనిఫెస్టోలోని అంశాలను 90 శాంపైగా అమలు చేశారు

పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

నెల్లూరు: ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఎన్నికల మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను 18 నెలల పాలనలోనే సీఎం వైయస్‌ జగన్‌.. ఏ విధంగా అమలు చేశారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ ప్రజారంజక పాలనకు ఈ 18 నెలల పాలనే నిదర్శనమన్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో రూ.100 కోట్లతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్, మేకపాటి గౌతమ్‌రెడ్డి హాజరయ్యారు. శంకుస్థాపనల అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఏ విధంగా చెప్పింది చేస్తారో.. ఈ 18 నెలల పాలనలో ప్రజలంతా చూశారన్నారు. గ్రామ సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ ద్వారా యువతకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు గుమ్మం ముందుకే పరిపాలన తీసుకువచ్చారన్నారు. గతంలో చంద్రబాబు నూరు పేజీల మేనిఫెస్టోలో 650 హామీలు ఇచ్చి అందులో ఒక్క హామీ కూడా సంపూర్ణంగా నెరవేర్చిన పాపానపోలేదన్నారు. డ్వాక్రా మహిళల రుణాలు దాదాపు రూ.14,200 కోట్లు, రైతుల రుణాలు రూ. 87 వేల కోట్లు మాఫీ చేస్తానని చెప్పి మోసం చేశాడని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ.. ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్నారన్నారు. 
 

Back to Top