ఐటీ దాడులు ఎల్లోమీడియాకు కనిపించడం లేదా..?

పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
 

 

తిరుపతి: ఎల్లో మీడియాకు ఐటీ దాడులు కనిపించడం లేదా..? అని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మాజీ పీఎస్‌ ఇంట్లో గత ఐదు రోజులుగా జరుగుతున్న ఐటీ సోదాల్లో రూ.2 వేల కోట్ల అక్రమ ఆస్తులు బయటపడినా పచ్చమీడియా కళ్లకు గంతలు కట్టినట్లుగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. తన పీఎస్‌ దగ్గర రూ.2 వేల కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నాయని ఐటీ శాఖ ప్రెస్‌నోట్‌ విడుదల చేసినా చంద్రబాబు ఒక్క మాట మాట్లాడడం లేదన్నారు. వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన వ్యక్తి దగ్గర రూ. 2 వేల కోట్ల నల్లధనం దొరికితే చంద్రబాబు, ఆయన సహచరులు, బినామీల దగ్గర ఎంత దొరుకుతుందోనని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టిసారించాలని కోరారు. ఐటీ దాడులపై పవన్, కాంగ్రెస్‌ నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

Back to Top