రైతుకు ఏ కష్టం రాకూడదు

అదే సీఎం వైయస్‌ జగన్‌ ధ్యేయం

ధరల స్థిరీకరణ నిధి ద్వారా ప్రతి రైతును ఆదుకుంటాం

మార్కెట్‌లోకి రాని వేరుశనగకు గిట్టుబాటు ధర లేదంటూ బాబు వ్యాఖ్యలు

బట్టచాల్చి ఎదుటివ్యక్తిపై పడేయడం చంద్రబాబు నైజం

21వ తేదీన మత్స్యకారులందరికీ చెక్కుల పంపిణీ

పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ

సచివాలయం: రైతుకు ఏ కష్టం రాకూడదని ప్రతి నెలా వ్యవసాయ మిషన్‌ ద్వారా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నామని, రైతులకు మేలు చేసే ప్రతీ నిర్ణయం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్నారని పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. ప్రతి అంశంలో బట్టకాల్చి ఎదుటి వ్యక్తులపై పడేయడం చంద్రబాబు నాయుడు ఆనవాయితీ అని, బాబు నైజం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. మార్కెట్‌లోకి వేరుశనగ పంటకు గిట్టుబాటు ధర లేక రూ.3 వేల కోట్ల నష్టం జరిగిందని చంద్రబాబు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. మొక్కజొన్నకు సంబంధించి రూ. 600 కోట్ల నష్టం అని మాట్లాడుతున్నాడని, ప్రతి అంశంపై పొంతన లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నాడన్నారు.

సచివాలయంలో మంత్రి మోపిదేవి వెంకట రమణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రత్యేకించి వ్యవసాయం, రైతు కష్టసుఖాలు, రైతుపండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలని ప్రతి నెల వ్యవసాయ మిషన్‌ ద్వారా సమస్యలపై చర్చిస్తూ.. వాటిపై ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. రైతులు నష్టపోకూడదు.. ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో సీఎం వైయస్‌ జగన్‌ పాలన చేస్తున్నారు.

ఈ క్రమంలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి శనగ రైతులను ఆదుకోవాలని రూ.330 కోట్లు కేటాయించడం, దానిలో ఇప్పటికే 225 కోట్లు ఆర్థిక శాఖ రిలీజ్‌ చేయడం, రూ. 75కోట్లు రైతుల అకౌంట్లలో జమ అయ్యాయి. సుబాబుల్‌ రైతులకు సంబంధించి ఒక ప్రైవేట్‌ కంపెనీ కొనుగోలు చేసి రైతులను నష్టపరిస్తే.. ఆ నష్టాన్ని ధరల స్థిరీకరణ నిధి ద్వారా భర్తీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించి రూ. 5 కోట్లు అందించారు. వాటితో పాటుగా పల్సస్‌ కొనుగోలు సంబంధించి మార్క్‌ఫెడ్‌ ద్వారా రూ. 110 కోట్లు కేటాయించి వివిధ ప్రాంతాల్లో కొనుగోలు ప్రాంతాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయించాం. ఉల్లి ధరలు ఎక్కవగా ఉన్నప్పుడు వినియోగదారులపై భారం పడకూడదనే ఆలోచనతో మార్కెటింగ్‌ శాఖ ద్వారా ఇతర ప్రాంతాల నుంచి అధిక ధరలకు కొనుగోలు చేయించి తక్కువ ధరలకు సప్లయ్‌ చేయించాం. దళారీ వ్యవస్థను అరికట్టాం. రైతులను ఆదుకునేందుకు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని నిర్ణయాలు చేస్తుంటే.. తట్టుకోలేక చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు.

ధరల స్థిరీకరణ నిధి నుంచి ఐదు మాసాల్లో రూ. 475 కోట్లు వినియోగించాం. ఆధారాలతో చూపిస్తాం. చంద్రబాబు 2014 ఎన్నికల ముందు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ. 4000 కోట్లు కేటాయిస్తానని చెప్పాడు.. కనీసం రూ. 4 కోట్లు ఖర్చు చేయని దౌర్భాగ్య పరిస్థితి. రైతుకు ఇబ్బంది కలగకూడదని సీఎం వైయస్‌ జగన్‌ పాలన చేస్తున్నారు.
వ్యవసాయ అనుబంధ విభాగాలుగా ఉన్న ఫిషరీస్‌ డిపార్టుమెంట్‌కు సంబంధించి ఈ నెల 21వ తేదీన ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా వేట నిషేధ సమయంలో ఇచ్చే రూ.4 వేలను సీఎం వైయస్‌ జగన్‌ రూ.10 వేలకు పెంచారు. 1.36 లక్షల మంది ఫిషింగ్‌ సెక్టార్‌ పై ఆధారపడి గుర్తించబడిన మత్య్సకారులకు సీఎం వైయస్‌ జగన్‌ 21వ తేదీన చెక్కుల పంపిణీ చేయనున్నారు. డీజిల్‌ సబ్సిడీ లీటర్‌ రూ. 6 ఉంటే దాన్ని రూ. 9కి పెంచారు. మత్స్యకార్మికుడికి స్మార్ట్‌కార్డు ఇస్తాం. ఏ రోజు డీజిల్‌ కొట్టించుకుంటే ఆ రోజు ఆ కార్డులో సబ్సిడీ డబ్బు జమ అయ్యేలా చేస్తున్నామన్నారు. అదే విధంగా ముమ్మిడివరం నిర్వాసితులకు కూడా సీఎం వైయస్‌ జగన్‌ 21వ తేదీన పరిహారం అందజేయనున్నారని మంత్రి మోపిదేవి వెంకటరమణ చెప్పారు.

 

Read Also: చంద్రబాబువి పచ్చి అబద్ధాలు

 

Back to Top