బాబు దోచుకుంటే.. వైయ‌స్ జగన్ పేదలకు పంచుతున్నారు

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి  మేరుగు నాగార్జున 

ప్రజల సొమ్ము బాబుకు పరమాన్నం..!

స్పెషల్ ఫ్లైట్లు, విలాసాలకు వందల కోట్లు ప్రజాధనం దుబారా చేసిన బాబు

విదేశీ ప్రయాణాలకు రూ.100 కోట్లు.. నవ నిర్మాణదీక్షలకు రూ.80 కోట్లు

ప్రజల సొమ్మును మంచినీళ్లలా ఖర్చుచేసి నీతులా..?

వైయ‌స్‌ జగన్‌గారు ప్రజల సొమ్మును పైసా కూడా వృథా చేయలేదు

 మంత్రి శ్రీ మేరుగు నాగార్జున

 ప్రజాసంపదను దోచుకున్న బాబును అరెస్టు చేయాల్సిందే..!

 ముడుపుల కేసులో ఐటీకి అడ్డంగా దొరికిన గజదొంగ బాబు

 తప్పు చేశాడు కనుకే అరెస్టుపై పిరికిపందలా బాబు వణికిపోతున్నాడు

 పవన్ ఎక్కడ నిద్రపోతున్నాడు.? బీజేపీ, కమ్యూనిస్టులు నోళ్ళు ఎందుకు పెగలట్లేదు?

 మంత్రి మేరుగు నాగార్జున

తాడేప‌ల్లి:  చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉండి దోచుకుంటే.. వైయ‌స్ జగన్ పేదలకు పంచుతున్నార‌ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ మేరుగు నాగార్జున పేర్కొన్నారు. ప్రజా సంపదను దోచుకున్న చంద్రబాబును అరెస్ట్‌ చేయాల్సిందేనని మంత్రి మేరుగ నాగార్జున డిమాండ్‌ చేశారు. విదేశీ ప్రయాణాలకు రూ. 100 కోట్లు, నవ నిర్మాణ దీక్షలకు రూ. 80 కోట్లు ఖర్చు చేశాడన్నారు. ప్రజల సొమ్మును మంచి నీళ్లలా ఖర్చు చేసి బాబు నీతులు చెబుతుండటంపై మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. శుక్రవారం తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. 

ప్రజల సొమ్మును మంచినీళ్లలా ఖర్చుచేసి నీతులా..?
 గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లండన్‌ పర్యటన గురించి చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. నీ మాదిరిగా వందల కోట్ల ప్రజల సొమ్ముతో సోకులు పోయి, విలాసాలు, దుబారా చేయలేదని తెలుసుకో చంద్రబాబు.  నీకు ప్రజాధనమంటే పరమాన్నం లెక్క. అధికారంలో ఉన్నప్పుడు, నీ విదేశీ ప్రయాణాలకు, రాష్ట్రంలో తిరగడానికి బుల్లెట్‌ప్రూఫ్‌ బస్సు పెట్టుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేశావు. ఓటుకు కోట్లు కేసులో పారిపోయి వచ్చేముందు సీఎం కార్యాలయం పేరుతో.. లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌ మరమ్మత్తులకు రూ.10 కోట్లు.. సీఎం కార్యాలయానికి మరో రూ.10 కోట్లు ఖర్చుచేశావు. నీ విదేశీ ప్రయాణాలకు స్పెషల్ ఫ్లైట్లు వాడి, మొత్తంగా రూ.100 కోట్లు ఖర్చు చేశావు. అలాగే ఆనాడు బీజేపీకి వ్యతిరేకంగా నువ్వు చేసిన ధర్మపోరాట దీక్షకు, నవనిర్మాణ దీక్షలకు.. రూ.80 కోట్లు రాష్ట్ర ప్రజల సొమ్మును వెచ్చించావు. ఇవన్నీ ప్రజాధనం కాదా చంద్రబాబు..? అని అడుగుతున్నాను.  ప్రజల డబ్బును నీ స్వార్థ రాజకీయాల కోసం, నీ శ్రేయస్సు కోసం,  నీ ఆరోగ్యం కోసం ఖర్చుపెట్టిన నీచుడివి నువ్వు. అలాంటి నువ్వా మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడేది..? అని చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను.

బాబు దోచుకుంటే.. జగన్ గారు పంచారుః
ప్రజల సొమ్ముతో చంద్రబాబు కులికితే... జగన్ గారు ప్రజలకు డీబీటీ ద్వారా నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేసి, పేదలకు పంచారు.  నీకులా మా జగన్‌ గారు ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ఒక్క పైసా ప్రజాధనం వృథా చేయలేదు. ప్రభుత్వ సంక్షేమం పేరిట రూ.2.31 లక్షల కోట్లు డీబీటీ ద్వారా బటన్‌ నొక్కి ప్రజల ఖాతాల్లో నేరుగా లబ్ధిని చేకూర్చిన మహోన్నత ముఖ్యమంత్రి మా జగన్‌గారు. మరి, నువ్వెందుకు ప్రజలకు మేలు చేసే అలాంటి బటన్‌ నొక్కలేకపోయావని అడుగుతున్నాను. నువ్వెప్పటికీ, అలాంటి బటన్‌ నొక్కలేవు. ఎందుకంటే, ప్రజల సంపదను దోచుకునే నువ్వొక పందికొక్కువు.  "మంచి అన్నది మాల అయితే మాల నేనగుదున్" అని గురజాడ గారు చెప్పినట్టు.. మాల మంచైతే,  నేను పెద్దమాలను అన్న నాయకుడు మా జగన్‌ గారైతే.. దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా..? అని ఎస్సీ, ఎస్టీలను అవమానించిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తుచేస్తున్నాను. 

బాబును ఖచ్చితంగా అరెస్టు చేయాల్సిందే..
ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు నేను రెండు చేతులు జోడించి ఒక విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాను. చంద్రబాబు పెద్ద అవినీతిపరుడని తేలిపోయింది. ఇప్పటికైనా మీరంతా ఆయన నిజస్వరూపాన్ని, కుయుక్తులను తెలుసుకోవాలని మనవి చేస్తున్నాను. అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి షాపూర్జీ పల్లంజీ, ఎల్‌అండ్‌టీ కంపెనీల నుంచి రూ.118 కోట్లు ముడుపులు కొట్టేసింది చంద్రబాబు కాదా..? అని అడుగుతున్నాను. ఆ సొమ్ముకు సంబంధించిన లెక్కలు చెప్పాలని ఐటీశాఖ నోటీసులు జారీచేస్తే.. మేము వాటిపై నిలదీస్తుంటే.. నన్ను అరెస్టు చేయడానికి చూస్తున్నారంటూ చంద్రబాబు మాట్లాడుతున్నాడు. అరెస్టంటే చంద్రబాబులో అంత భయం ఎందుకు..? తప్పేమీ లేనప్పుడు దమ్మూ,ధైర్యంగా ఐటీశాఖ నోటీసులుకు సమాధానం చెప్పొచ్చుకదా..? అలా చెప్పలేడు. ఎందుకంటే, తన దొంగతనం బట్టబయలైంది కనుక. మరి, ఈ సందర్భంగా చంద్రబాబును ఒక ప్రశ్న అడుగుతున్నాను. నిన్నెందుకు అరెస్టు చేయకూడదని.. నువ్వైమైనా చట్టానికి అతీతుడివా..? అడుగుతున్నాను. ప్రజల సొమ్మును దోచుకున్న చంద్రబాబును ఖచ్చితంగా అరెస్టు చేయాల్సిందే. జైల్లో పెట్టాల్సిందే. చట్టబద్ధమైన విచారణ చేయాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నాను. 

పవన్ ఎక్కడ నిద్రపోతున్నావ్.?
అమరావతి రాజధాని పేరుతో, రెండు చిన్న కాంట్రాక్టుల్లోనే చంద్రబాబు అప్పనంగా రూ.118 కోట్లు దోచేశాడు. లేనిపోని సొల్లుకబుర్లతో ఛాలెంజ్‌లు విసిరే చంద్రబాబు- ఈరోజు ఐటీశాఖ నోటీసులపై ఉలుకూపలుకు లేకుండా ఉన్నాడు. స్పందించే అవసరమే లేనట్లు ప్రజలకు బిల్డప్‌ లు ఇస్తున్నాడు. చంద్రబాబు, లోకేశ్‌ మీద ఈగ వాలనీయకుండా, చీమ చిటుక్కుమంటే గంగవెర్రులెత్తి మాట్లాడే దత్తపుత్రుడు ఏమయ్యాడు..? ఐటీశాఖ నోటీసులపై జాతీయ మీడియా సైతం పెద్ద  ఎత్తున కథనాలు రాస్తుంటే, ప్రశ్నిస్తానన్న పెద్దమనిషి పవన్‌కళ్యాణ్‌ ఎక్కడ నిద్రపోతున్నాడు..? సీపీఐ నారాయణ, రామకృష్ణ నోరుమెదపకుండా ఏం చేస్తున్నట్లు..? ఈనాడు రామోజీరావు, ఏబీఎన్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉలుకుపలుకూ లేకుండా ఉండటానికి కారణమేంటి..? అని అడుగుతున్నాను. ఆయన దోచుకున్న ముడుపుల్లో మీకూ వాటాలందాయా..? అని ప్రశ్నిస్తున్నాను. 

పిరికిపందలా వణుకిపోతున్న బాబుః
చంద్రబాబు ఒక మోసకారి. అవినీతిపరుడు. ప్రజల సొమ్మును, పేదల సొమ్మును దోచుకున్న వ్యక్తి.  బాబు స్కాములు చాలా ఉన్నాయి. ఫైబర్‌గ్రిడ్, స్కిల్‌డెవలప్‌మెంట్, అసైన్డ్‌భూముల విషయంలో, రింగురోడ్డు పనుల్లో, రాజధాని నిర్మాణాలు, ఈఎస్‌ఐ కుంభకోణాల్లో చంద్రబాబు వందల, వేల కోట్లను దోచుకున్నాడు. వీటిపై కూడా సత్వరమే విచారణ చేసి చంద్రబాబును అరెస్టు చేయించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి అవినీతిపరుడు తప్పించుకుంటే.. రాష్ట్రానికి తీరని నష్టం.  నిన్నటిదాకా చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్‌ కలిసి మమ్మల్ని ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నారుగా.. మరి, ఇప్పుడెం దుకు నన్ను అరెస్టు చేస్తారని పిరికిపందల్లా భయపడుతున్నారు..? నువ్వు దొంగలా దొరికావు కాబట్టే.. అప్పన్నంగా ప్రజల సొమ్మును ముడుపుల రూపంలో కాజేశావు కనుకే ఈరోజు నువ్వు వణికిపోతున్నావని  చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను. మీ అబ్బాకొడుకులు రాజధాని ప్రాంతం పేరుతో ప్రజాధనాన్ని దోచుకుంటుంటే మేం చూస్తూ ఉండాలా..? ఈ ప్రభుత్వంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మీ మాదిరిగా, వ్యవస్థల్ని మేనేజ్‌ చేస్తామంటే కుదరదు. ప్రజల సొమ్మును పందికొక్కుల్లా తిన్న మీ తండ్రీ-కొడుకులు చట్టం ముందు దోషులుగా నిలబడాల్సిందేనని గుర్తుచేస్తున్నాను. 

తాజా వీడియోలు

Back to Top