నీ బాబుది కులవాదం.. సీఎం వైయస్‌ జగన్‌ది ప్రజాస్వామ్యవాదం

లోకేష్‌పై మంత్రి మేరుగు నాగార్జున ఫైర్‌

మంగళగిరిలో ఓడిపోయిన సన్నాసి.. ఛాలెంజ్‌లు విసరడం విడ్డూరం 

ఎస్సీ సబ్‌ప్లాన్‌ గురించి చంద్రబాబుకే తెలియదు.. మాలోకం లోకేష్‌కు తెలుసా..?

ద‌ళితుల గురించి మాట్లాడే క‌నీస అర్హ‌త టీడీపీకి లేదు

సబ్‌ప్లాన్, నోడల్‌ ఏజెన్సీ కంటే మిన్నగా దళితులకు సంక్షేమ సాయం

అమరావతి: దళిత గురించి మాట్లాడే కనీస అర్హత కూడా తెలుగుదేశం పార్టీకి లేదని, ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా.. అని దళిత జాతిని అవమానించేలా చంద్రబాబు మాట్లాడినప్పుడు లోకేష్‌ ఎక్కడ దాక్కున్నాడని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ప్రశ్నించారు. మంగళగిరిలో ఓడిపోయిన సన్నాసి చేస్తున్న పాదయాత్ర జనం లేక వెలవెలబోతుందన్నారు. సరిగ్గా తెలుగు కూడా మాట్లాడటం రాని బచ్చా లోకేష్‌.. ఛాలెంజ్‌లు విసురుతున్నాడన్నారు. చంద్రబాబుదంతా సొంత కులవాదం... సీఎం వైయస్‌ జగన్‌ది అంబేద్కర్‌ వాదం, ప్రజాస్వామ్యవాదం, దళితవాదం, బలహీనవర్గాల వాదం, మైనార్టీ వర్గాల వాదం అని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. సచివాలయంలో మంత్రి మేరుగు నాగార్జున విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మేరుగు నాగార్జున ఏం మాట్లాడారంటే..

మూడున్నరేళ్ల వైయస్‌ఆర్‌ సీపీ పాలనలో ఎస్సీల సంక్షేమం, దళితులకు ఇంకా ఎలాంటి సహాయలు చేయాలనే దానిపై నిన్న వైయస్‌ఆర్‌ సీపీ సమావేశం జరిగింది. చంద్రబాబు ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని నీచంగా మాట్లాడి ఈరోజుకూ అంబేడ్కర్‌ వద్ద క్షమాపణ చెప్పలేదు. అలాంటి వ్యక్తి కొడుకుగా లోకేష్‌ వచ్చి మాట్లాడుతున్నాడు. దళితుల గురించి మాట్లాడే అర్హత నీకు, నీ బాబుకు లేదు లోకేష్‌. మంగళగిరిలో ఓడిపోయిన సన్నాసి ఛాలెంజ్‌లు విసురుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. 

దళితులపై దాడులు చేస్తే కేసులు పెట్టరా అని బు్రరలేని లోకేష్‌ మాట్లాడుతున్నాడు. అలా అయితే ఫస్ట్‌ చంద్రబాబు మీదనే పెట్టాలి. దళితులను హేళనంగా మాట్లాడినప్పుడు చంద్రబాబు మీద సుమోటోగా కేసు నమోదు చేసి జైల్లో పెట్టాలి. నాపై కేసు పెట్టారని లోకేష్‌ మాట్లాడుతున్నాడు.. తప్పు చేస్తే ఎవరిపైనైనా కేసులు పెడతాం. 

ఎస్సీ సబ్‌ప్లాన్‌ గురించి చంద్రబాబుకే తెలియదు.. మాలోకం లోకేష్‌కు తెలుసా..? సబ్‌ప్లాన్‌ను చంద్రబాబు నాశనం చేశాడు. దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి సబ్‌ప్లాన్‌ లేనప్పుడే నోడల్‌ ఏజెన్సీతో ఈ రాష్ట్రంలోని దళితులకు భరోసా ఇచ్చారు. సబ్‌ప్లాన్‌ కంటే మిన్నగా సాయం చేశాడు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితులకు రాజ్యాంగ బద్ధంగా రావాల్సిన డబ్బులు దేనికి ఖర్చు చేశాడో లెక్కలతో సహా చెబుతా. 

2018–19 సబ్‌ప్లాన్‌లో ఐటమ్‌ నంబర్‌ 9లో పొలంబడికి నిధులు మళ్లించాడు. ఐటమ్‌ నంబర్‌ 12, 13లో చంద్రన్న రైతు క్షేత్రాలకు ఖర్చు చేశాడు. డ్వాక్రా మహిళలకు ఇచ్చే శానిటరీ న్యాప్‌కిన్స్, సామాజిక పెన్షన్లు, ఎన్టీఆర్‌ సృజల స్రవంతి, చంద్రన్న పెళ్లి కానుక, ఎన్టీఆర్‌ ఉద్యోగ నిధి, మా ఇంటి మహాలక్ష్మి ఇవన్నింటికీ సబ్‌ప్లాన్‌ నిధులే ఖర్చు చేశాడు. 

సబ్‌ప్లాన్‌ను ప్లానింగ్‌ కమిషన్‌వారు ఎత్తేస్తే ఎస్సీ కాంపోనెంట్‌ ప్లాన్‌ను తీసుకొచ్చి మా ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. మీ బాబులా డబ్బులన్నీ ఇష్టం వచ్చినవారికి ఇచ్చుకొని కోట్లు దండుకోవడం లేదు. ప్రతీపైసా.. సబ్‌ప్లాన్, నోడల్‌ ఏజెన్సీ అన్నింటికంటే మిన్నగా దళితులకు డబ్బు డైరెక్ట్‌గా పైసా అవినీతి లేకుండా అందజేస్తున్నాం. 

పేద ప్రజలను గుండెల్లో పెట్టుకున్న కుటుంబం, దళిత పక్షపాత కుటుంబం, దళితులతో వియ్యం అందుకున్న కుటుంబం వైయస్‌ఆర్‌ది. అలాంటి కుటుంబం గురించి మాట్లాడే అర్హత లోకేష్‌కు లేదు. పేదవాడి పిల్లల కోసం ఇంగ్లిష్‌ మీడియం పెడుతుంటే నీ బాబు కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నాడు. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే.. నీ బాబు సామాజిక సమత్యులత వస్తుందని మాట్లాడాడు. ఇవన్నీ లోకేష్‌కు గుర్తుకులేవా..? ఉంటే నీ బాబును నిలదీయ్‌. 

విజయవాడ నడిబొడ్డన అంబేడ్కర్‌ విగ్రహం పెడుతుంటే అబ్బాకొడుకులు జీర్ణించుకోలేకపోతున్నారు. చదువుతోనే సామాజిక అసమానతలు తొలగుతాయన్న అంబేడ్కర్‌ ఆలోచనలను సీఎం వైయస్‌ జగన్‌ పాటిస్తుంటే.. చదువు మీద, ఇళ్ల స్థలాల మీద కోర్టులకు వెళ్తున్నారు. ఇదేనా మీ ఓట్ల రాజకీయం. ద‌ళిత సంక్షేమానికి మా ప్ర‌భుత్వం కృషిచేస్తోంది. పేద‌ల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఉన్న‌త చ‌దువులు చ‌దివిస్తున్నారు. బుర్ర‌లేని లోకేష్‌.. పాదయాత్రలో పల్లెల్లోకి వెళ్లి సీఎం వైయస్‌ జగన్‌ అభివృద్ధి చేసిన పాఠశాలలు చూడు. గ్రామాల్లో మా పిల్లలు మాట్లాడే ఇంగ్లిష్‌ను నీ ఇంగ్లిష్‌తో బేరీజు వేసుకో.. అప్పుడు తెలుస్తోంది వైయస్‌ జగన్‌ పరిపాలన ఎలా ఉందోనని’’అని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు.  
 

తాజా వీడియోలు

Back to Top