రూ.200 కోట్ల‌తో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్

రైతుకు వెన్నుద‌న్నుగా ఉండాల‌న్న‌దే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆశ‌యం

వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు

తూర్పుగోదావ‌రి: రైతుల సంక్షేమానికి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తున్నారని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు అన్నారు. తూర్పుగోదావ‌రి జిల్లాలో మంత్రి క‌న్న‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. రైతు ప్ర‌మాద‌వ‌శాత్తు చ‌నిపోతే రూ.7 ల‌క్ష‌లు ఇచ్చి వారి కుటుంబాల‌కు ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌న్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఉన్న‌ 10,641 రైతు భ‌రోసా కేంద్రాల ద్వారా రైతుల‌కు స‌హ‌కారం అందిస్తున్నామ‌న్నారు. వ‌చ్చే ఐదేళ్ల‌లో రైతు భ‌రోసా కేంద్రాల‌ను మార్కెటింగ్ కేంద్రాలుగా మార్చబోతున్నామ‌ని వివ‌రించారు. త్వ‌ర‌గా పాడ‌య్యే పంట‌ల‌కు సైతం గిట్టుబాటు ధ‌ర క‌ల్పించిన ఏకైక సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అని గుర్తుచేశారు. రాష్ట్రంలో రూ.200 కోట్ల‌తో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ ఏర్పాటుకాబోతున్న‌ట్లు చెప్పారు. ప్ర‌తి రైతు భ‌రోసా కేంద్రంలో రూ. 15 ల‌క్ష‌ల విలువైన వ్య‌వ‌సాయ యంత్రాలను అందుబాటులో ఉంచుతున్నామ‌న్నారు. ప్ర‌తి అంశంలో రైతుకు వెన్నుద‌న్నుగా ఉండాల‌న్న‌దే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆశ‌యమ‌ని మంత్రి క‌న్న‌బాబు వివ‌రించారు.

Back to Top