విజయవాడ: రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో దేవాలయాల నిర్మాణానికి రూ.10 లక్షల నిధులు ఇస్తున్నామని, వీటిలో రూ.8 లక్షలు దేవాలయాల నిర్మాణానికి, రూ.2 లక్షలు విగ్రహాలకు ఖర్చు చేస్తామన్నారు. సీఎం ఆదేశాల మేరకు ఏడాది కాలంలో 1060 దేవాలయాలను పూర్తి చేసేందుకు ఆదేశాలు ఇచ్చాం. వీటిని సూపర్‌వైజర్ చేయడానికి ఏఈ స్థాయి అధికారులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించనున్నాం. ప్రభుత్వం ఇచ్చే రూ.10 లక్షలకు తోడు ఆయా గ్రామాల్లో దాతలు ముందుకు వస్తే క్వాలీటి నిర్మాణాలు చేపడుతాం. ఎన్‌జీవో సంస్థలు, భక్తులు ఇచ్చే విరాళాలు కూడా స్వీకరిస్తాం. దేవాలయాలకు సంబంధించి కొన్ని వార్తలు వచ్చాయి. వాటికి సంబంధించిన ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్లను వివరణ కోరుతాం..పత్రికా రూపంలో తెలియజేస్తారు. ఎక్కడా కూడా నిర్లక్ష్యం లేదు. ఎక్కడైనా పొరపాటు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.