భార్యను అడ్డు పెట్టుకుని బాబు నీచ రాజకీయం

పౌర సరఫరాల శాఖ మంత్రి  కొడాలి శ్రీ వెంకటేశ్వరరవు(నాని) 

  బాబు భార్య గురించి ఎవరన్నారు, ఏమన్నారో చెప్పాలి 
 
భార్యను ఏమన్నా అంటే అక్కడే చొక్కా పట్టుకోవాలి కదా...? 

 చంద్రబాబు రాజకీయ వ్యభిచారి 

 కెమెరాలు ముందు బాబు యాక్షన్.. కెమెరా.. స్ట్రాట్.. 

 రాజకీయాల కోసం భార్యను అడ్డుపెట్టుకున్నవాడిలా బాబు చరిత్రలో మిగిలిపోతాడు 

 చంద్రబాబు ఏడవటం దొంగ నాటకం 
 
చిల్లర రాజకీయాలు చేసే చిల్లర వ్యక్తి బాబు 

 అమ‌రావ‌తి:  భార్య‌ను అడ్డుపెట్టుకొని ప్రతిప‌క్ష నేత చంద్ర‌బాబు నీచ రాజ‌కీయాలు చేస్తున్నార‌ని పౌర సరఫరాల శాఖ మంత్రి  కొడాలి శ్రీ వెంకటేశ్వరరవు(నాని) విమ‌ర్శించారు.  అసెంబ్లీలో బహిష్కరిస్తున్నానని చెప్పినప్పుడుగానీ, ఆ తర్వాత జరిగిన టీడీఎల్పీ మీటింగ్ లో గానీ, కారు ఎక్కి పార్టీ కార్యాలయానికి వెళ్ళేటప్పుడుగానీ.. ఎక్కడా ఏడవని చంద్రబాబు.. పార్టీ ఆఫీసుకు వెళ్ళి మీడియా కెమెరాలు కనిపించే సరికి, యాక్షన్.. కెమెరా.. స్ట్రాట్.. అంటూ చేతులు అడ్డుపెట్టుకుని కన్నీళ్ళు రాకుండా ఏడుస్తున్నాడు,  డ్రామా రక్తికట్టించాడు. రాజకీయాల్లో ఒక డ్రామా ఆర్టిస్టు చంద్రబాబు.  తనకు మించిన నటుడు అని ఆరోజుల్లోనే చంద్రబాబు గురించి ఎన్టీఆర్ చెప్పారు. నాడు 72 ఏళ్ళ వయసులో ఎన్టీఆర్ గారి నుంచి ముఖ్యమంత్రి పదవిని దొంగిలించిన వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్ ను సస్పెండ్ చేసి, పార్టీ నుంచి మెడబట్టి బయటకు గెంటాడని ఆరోజుల్లో ఎన్టీఆర్ నిత్యం ఏడ్చాడు. చంద్రబాబులా ఎన్టీఆర్ బహిరంగంగా ఏడవకపోయినా.. గదిలో వెక్కి వెక్కి ఎంతగానో  ఏడ్చి మానసిక క్షోభ అనుభవించి, చివరికి గుండె ఆగి చనిపోయాడు. ఇప్పుడు ఆరోజులు గుర్తుకు వస్తున్నాయి అని కొడాలి నాని పేర్కొన్నారు. స‌చివాల‌యంలోని మీడియా పాయింట్ వ‌ద్ద ఆయ‌న మాట్లాడారు.

సీఎం వైయ‌స్‌ జగన్ గారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు, మనం ఏం చేసినా పైన  దేవుడు చూస్తూ ఉంటాడని, ప్రజలు ఆశీస్సులుండాలని. చంద్రబాబు పరిస్థితి చూస్తే.. 2019 జనరల్ ఎన్నికల నుంచి కుప్పం మున్సిపాలిటీ వరకు అన్ని ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి, రాజకీయంగా ఏరకంగానూ జగన్ మోహన్ రెడ్డిగారిని ఎదుర్కోలేక, సొంత మామ నుంచి బామ్మర్థులు, చివరికి భార్యను కూడా అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాడు. అనని మాటలను కూడా నా భార్యను అన్నారని చంద్రబాబు ఈరోజు మాట్లాడుతున్నారు. భార్యను కూడా రాజకీయాలకు వాడేసుకున్న చంద్రబాబు నైతికంగా మనిషిగా చచ్చిపోయాడు అనుకోవాలి. ఇటువంటి చంద్రబాబు డ్రామాలు, న్యూసెన్స్ కార్యక్రమాల్ని రాష్ట్ర ప్రజలు పట్టించుకోరు. 

 దేవుడు, ప్రజల ఆశీస్సులతో జగన్ గారిని ముఖ్యమమంత్రిని చేశారు. ప్రతిరోజూ చిల్లర రాజకీయాలు చేసే చిల్లర వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు ఏడవడం ఒక దొంగ నాటకం, ఈరోజు ఆయన నాటకాన్ని బాగా రక్తి కట్టించారు. అసలు చంద్రబాబు భార్య గురించి ఎవరు ఏమన్నారు, ఎవరన్నారు అని చంద్రబాబుగానీ, ఆయన పార్టీ వాళ్ళుగానీ ఎవరన్నా చెప్పారా...? లేదు. భార్యను అంటే ఎవరన్నా శాసనసభ నుంచి  నవ్వుకుంటూ వెళతారా.. చంద్రబాబు ఎందుకు వెళ్ళాడు. భార్యను అంటే అక్కడే చొక్కా పట్టుకోవాలి కదా.. అసెంబ్లీలో అయినా ఏడవాలి కదా.. అందర్నీ సలహాలు అడిగి, కెమెరాలు పెట్టిన తర్వాత ఏడ్చే వారిని ఏమంటారు..? రాజకీయ అవసరాల కోసం భార్యను ఈ స్థాయిలో వాడుకున్న వ్యక్తిగా చంద్రబాబు చరిత్రలో మిగిలిపోతారు. 

 చంద్రబాబు భార్య గురించి అసెంబ్లీలో ఎవరూ మాట్లాడలేదు. బాబాయ్, గొడ్డలి, తల్లి, చెల్లి.. అంటూ చంద్రబాబే పదే పదే హేళనగా,  రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు. చంద్రబాబు భార్య గురించి మాట్లాడటం ఎవరైనా చూశారా..? సభలో ఏం జరిగిందో టీడీపీకి చెందిన కొంతమంది సెల్ ఫోన్లలో కూడా రికార్డులు చేశారు. అటువంటిది ఎక్కడైనా ఉందా..? చంద్రబాబు భార్య గురించి అసెంబ్లీలో ఫలానా సభ్యుడు మాట్లాడాడని ఒక్క వీడియో చూపించండి.  ముఖ్యమంత్రి పదవి కోసం, అసెంబ్లీకి రానని ప్రతిజ్ఞ చేయడం కోసం, ఆఖరికి భార్య శీలాన్ని అడ్డుపెట్టుకునే నీచుడు దేశంలోనే ఎవరూ ఉండరు. 

 రాజకీయ వ్యభిచారి చంద్రబాబు. ఇటువంటి నీచమైన మనస్తత్వం కలిగిన వ్యక్తిని ఆయన భార్య కూడా ప్రశ్నించాలి. ఇంత నీచమైన పని ఎవరైనా చేస్తారా.. రాజకీయంగా బతకడం కోసం, ఒక్క ఎమ్మెల్యే గెలిపించుకోలేకపోయినందుకు, కుప్పంలో గెలవలేకపోయినందు ఇటువంటి నీచ రాజకీయం ఎవరైనా చేస్తారా..? 

 గతంలో ఇదే శాసనసభలో తన  పార్టీ సభ్యులకు మైకులు ఇచ్చి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిగారిని, ఆయన కుటుంబ సభ్యులను ఏవిధంగా చంద్రబాబు తిట్టించాడో రాష్ట్ర  ప్రజలంతా చూశారు. దేవుడు ఉన్నాడు కాబట్టే, ఆరోజు వాటిని ప్రోత్సహించినందుకు నాడు స్పీకర్ గా ఉన్న  కోడెల ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఎన్టీఆర్ ను అవమానించిన చంద్రబాబుకు దేవుడు ఈరోజు సరైన శిక్ష వేశాడు. ఇక చంద్రబాబును జీవితంలో ప్రజలు అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వర‌ని పౌర సరఫరాల శాఖ మంత్రి శ్ర కొడాలి శ్రీ వెంకటేశ్వరరవు(నాని) వ్యాఖ్యానించారు.
 

Back to Top