సోము వీర్రాజు బీజేపీ అధ్యక్షుడా..? టీడీపీ బీ-టీమ్‌ అధ్యక్షుడా?

కేసినోలు ఎలా ఉంటాయో గోవా వెళితే సోము వీర్రాజుకు బీజేపీ వారే చూపిస్తారు 

గోవాలో కేసినో నిషేధించమని రాష్ట్ర బీజేపీ నేతలు ప్రధానిని అడగండి

గుడివాడలో మతకలహాలు రెచ్చగొట్టాలని చూస్తే ఎవ‌రూ ఊరుకోరు

ఫిల్మ్ సిటీలోనూ గోవా సంస్కృతి.. దానిపై ఉద్యమం చేసి ఆపించండి

 బాబు హయాంలో రాష్ట్రమంతా జూదశాలలు నడిపి వేల కోట్లు సంపాదించాడు

చంద్రగ్రిలో బాబు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జూదశాలలు, వేశ్య గృహాలను నడిపాడని నేను రుజువు చేస్తా

బాబు గురించి ఎక్కడ చర్చ పెట్టినా.. రావడానికి నేను సిద్ధం, మరి బాబు వస్తాడా.. ?

పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి కొడాలి నాని స‌వాల్‌

హైద‌రాబాద్‌: సోము వీర్రాజు వ్యవహార శైలి చూస్తుంటే.. ఆయన రాష్ట్ర బీజేపీకి అధ్యక్షుడో.. లేక టీడీపీ బీ టీమ్‌కు అధ్యక్షుడో అర్థం కావడం లేదని పౌరస‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. గుడివాడ ప్రజానీకానికి సంక్రాంతి సంబరాలు ఎలా చేసుకోవాలో తెలియదు, తాను నేర్పుతానని, గుడివాడ ప్రజలను అవమానించడానికి  సోము వీర్రాజు, ఆయన బృందంతో బయలుదేరాడని, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులను పక్కన పెట్టుకుని చంద్రబాబు ఎజెండాకు అనుకూలంగా పనిచేస్తున్నాడ‌న్నారు.    ఎలా ఉండాలో, పండుగలు ఎలా చేయాలో.. సోము వీర్రాజు దగ్గర  పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదన్నారు. గుడివాడ పుట్టినప్పటి నుంచి సంక్రాంతి పండుగ జరుగుతుంది. భూమి ఉన్నంతవరకూ కూడా జరుగుతుందన్నారు. తన ఒక్కడికే ప్రపంచం అంతా తెలుసు అనుకుంటే.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీకి జరిగి అవమానం మళ్ళీ మళ్ళీ జరుగుతుంద‌న్నారు.  

మంత్రి కొడాలి నాని ఇంకా ఏమన్నారంటే..

ఏ రాష్ట్రంలోనైనా పోలీసు వ్యవస్థ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తుంది. బీజేపీ అంటే మతతత్వ పార్టీ. గుడివాడ ప్రశాంతంగా ఉంటే.. అక్కడకు వెళ్లి వీళ్లు ఏ రాజకీయం చేద్దామనుకున్నారు..? మొన్న కర్నూలు జిల్లాకు వెళ్లి ఏం చేశారు.? కడప వెళ్లి కేంద్ర మంత్రి, బీజేపీ నేతలు ఏం మాట్లాడారు..? ఇస్లామిక్ టెర్రరిస్టులకు ఆర్థిక సాయం చేస్తున్నామని ముఖ్యమంత్రి గురించి మాట్లాడతారా..?. అంటే, ఆరిపోయినదానిలో వీళ్ళు వెళ్ళి పెట్రోలు పోసి, ప్రజలను రెచ్చగొడతారా..? అటువంటి చర్యలకు పోలీసులు ఎందుకు అనుమతిస్తారు..? అడ్డుకోకుండా ఉంటారా..? సోము వీర్రాజు హావభావాలు, గెటప్ బాగుంటుంది. ఆయన మెదడే కొంచెం ప్రాబ్లమేటిక్ గా ఉంది. దాన్ని బాగుచేసుకుంటే మంచిది. 

గోవా కల్చర్ గుడివాడకు వచ్చిందని సోము వీర్రాజు అంటున్నాడు. గోవా భారత దేశంలో లేదా..? అక్కడ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలో ప్రభుత్వం కూడా బీజేపీదే. మరి, ఎందుకు అటువంటి కేసినోలను బ్యాన్ చేయరని వెళ్ళి ప్రధానమంత్రిని అడగండి, అదిచేతగాక కేసినోలను, డ్యాన్సులను ఆరోపణలు చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. మీరు భారత సంస్కృతిని కాపాడాలనుకుంటే.. నేనే సొంత ఖర్చులతో ఫ్లైట్ టికెట్లు కొనిపిస్తాను, అక్కడకు వెళ్ళి ముందు గోవాలో జరుగుతున్న కేసినోలను అడ్డుకుని, వాటి గురించి మీరు ఇక్కడ మాట్లాడితే మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు. ఒక పక్కన మీ పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వంలోనే కేసినోలు పెట్టి, ప్రభుత్వం డబ్బులు సంపాదించుకుంటూ, ఆ డబ్బులతోనే ప్రభుత్వాలు నడుపుకుంటూ.. ఇక్కడకు వచ్చి సిగ్గు లేకుండా మాట్లాడితే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని విశ్వసించరు.

తెలుగుదేశం పార్టీ సోము వీర్రాజును తడికలా అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తుంది. చంద్రబాబు శిష్యులు కొంతమంది మీ పార్టీలో చేరితే, వారి మాటలు నమ్మి, గుడివాడ లాంటి ప్రశాంతమైన ప్రాంతంలో, సంక్రాంతి పండుగ అయిపోయి పది రోజులు అయిన తర్వాత, ఇప్పుడు వెళ్లి, వచ్చే సంక్రాంతి పండుగను ఎలా చేసుకోవాలో మీరు నేర్పుతారా..? మీరు మాట్లాడేదానికి అర్థమైనా ఉందా..? గుడివాడలో సంక్రాంతి ముగింపు సంబరాలు అంటూ.. అక్కడకు వెళ్ళి ప్రజల్లో మత కలహాలు రెచ్చగొట్టాలి.. ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టాలని చూస్తే.. ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం చూస్తూ ఊరుకోదు.

సోము వీర్రాజు సలహా ఇస్తున్నాను. ఇప్పటికైనా తెలుగుదేశం ట్రాప్ లో పడకుండా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా వ్యవహరించండి. విజయవాడలో ఒకరకంగా, హైదరాబాద్ లో మరోరకంగా.. గోవాలో ఇంకోరకంగా కాకుండా.. దేశమంతా ఒకేరకంగా ఉండే విధంగా చూడమని ప్రధానమంత్రిని కోరండి. హైదరాబాద్ లో ఫిల్మ్ సిటీలో కూడా గోవా సంస్కృతి ఉంది. మీరు ముందు అక్కడ ఉద్యమం చేసి,  బెల్లీ డ్యాన్సులు, క్యాబరే డ్యాన్సులు ఆపించండి. ఆ తర్వాత దేశమంతా  అన్ని చోట్లా ఆపాలని డిమాండ్ చేస్తున్నాను. 

సోము వీర్రాజుతోపాటే నేనూ రాజకీయాల్లో ఉన్నాను. బీజేపీ అంటే ఏమిటో చూపిస్తాను.. అని నా చిన్నప్పటి నుంచీ ఆయన చెబుతూనే ఉన్నాడు. రాష్ట్రంలో బీజేపీ అంటే ఏమిటో చూపించడానికి ఇంకో 50 ఏళ్ళో, 100 ఏళ్ళు కావాలో.. ఆయనే తేల్చాలి.  బీజేపీ అంటే ఏమిటో మాకు చూపించాల్సిన అవసరం లేదు. ముందు చంద్రబాబుకు బీజేపీ అంటే ఏమిటో చూపించండి. 2019 ఎన్నికలప్పటి నుంచి బీజేపీ అంటే ఏమిటో చంద్రబాబుకు చూపిస్తానని సోము వీర్రాజే చెప్పాడు. మరి, ఇప్పుడు రాజీపడిపోయి.. ఆయన్ను వదిలేశారా..? ఇటీవల జరిగిన రెండు ఉప ఎన్నికల్లో జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేస్తే రెండు చోట్లా డిపాజిట్లు కూడా కోల్పోయిన పరిస్థితి చూశాం. 

చంద్రబాబు ప్రచారం చేసే  తప్పుడు మాటలు విని, గుడివాడలో కేసినోలని, జూదాలని మాట్లాడటం బీజేపీకి భావ్యం కాదు. కేసినోలు అంటే ఎలా ఉంటాయో సోము వీర్రాజు  గోవా వెళ్ళి చూస్తే.. అక్కడ ఎటూ వాళ్ళ ప్రభుత్వమే ఉంది కాబట్టి, ఆయనకు రెడ్ కార్పెట్ వేసి చూపిస్తారు. అప్పుడు కేసినోలు ఎలా ఉంటాయో.. ఆయనకు బాగా తెలుస్తుంది.  గుడివాడలో ఎక్కడో, ఎవరో సంక్రాంతి సంబరాల్లో భాగంగా.. ఒక బోర్డు పెట్టి, గుండాట ఆడిస్తుంటే.. దాన్ని కేసినో అని దిక్కుమాలిన పార్టీకి చెందిన నాయకుడు చంద్రబాబు చెబితే.. అతని ట్రాప్ లో పడి సోము వీర్రాజు కూడా అదే చెబుతున్నాడు. 

టీడీపీతో కలిసి ఉండటం వల్ల మా పార్టీ సర్వనాశనం అయిందని గతంలో సోము వీర్రాజు చాలా సార్లు చెప్పాడు. అదే సోము వీర్రాజు నాయకత్వంలో, మళ్ళీ ఈరోజు తెలుగుదేశం నుంచి వచ్చిన వ్యక్తులను పక్కన పెట్టుకుని జనసేనతో కలిసి పోటీ చేసినా రెండు ఉప ఎన్నికల్లోనూ డిపాజిట్లు కోల్పోయారు.  టీడీపీ వల్ల నష్టపోయామని పైకి మాత్రం చెప్పి, అయినా సిగ్గులేకుండా టీడీపీకి మీ పార్టీని అద్దెకిచ్చేసి, టీడీపీకి బీ- టీముగా పెట్టి పనిచేసే పరిస్థితి నుంచి బయట పడితే, మీ పార్టీ, మీరు బాగుపడతారు. లేకపోతే బీజేపీని ఎవరూ రక్షించలేరు. 

చంద్రబాబు అబద్ధాల మీద, వెన్నుపోటు రాజకీయాల మీద, 420 పనుల మీద ఆధారపడి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. కాంగ్రెస్ లో తన రాజకీయ జీవితాన్ని మొదలు పెట్టి, అక్కడ మంత్రి అయి, ఆ తర్వాత, తనకు కుటుంబ విలువలు కంటే రాజకీయమే ముఖ్యమని పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ కు సవాల్ చేసి, ఎన్టీఆర్ పెట్టిన అభ్యర్థి మీద ఓడిపోయిన చిన్న మిడత చంద్రబాబు. మళ్ళీ ఓడిపోయిన 24 గంటల్లోనే.. ఎన్టీఆర్ ప్రమాణస్వీకారం చేయకముందే.. ఈ పార్టీలోకి వచ్చి, ఎన్టీఆర్ మూడుసార్లు బీ-ఫారాలు ఇస్తే ఎన్నికల్లో గెలిచాడు. ఆ తర్వాత లక్ష్మీ పార్వతి అనే మహిళను అడ్డు పెట్టుకుని, ఎన్టీఆర్ స్త్రీ లోలుడు అని  ప్రచారం చేసి, ఆయన పార్టీని, ఆయన ముఖ్యమంత్రి పదవిని దొంగిలించిన వ్యక్తి బాబు. ఎన్టీఆర్ మీదే క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు. ఆఖరికి, సైకిల్ గుర్తు కోసం ఆడవాళ్ళను అడ్డుపెట్టుకుని ఎటువంటి పనులు చేశాడో అందరికీ తెలుసు. 

ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి మీద రాజకీయంగా పై చేయి సాధించలేక, ఎక్కడో ఎవరో అన్న నాలుగు మాటలు పట్టుకుని, అసెంబ్లీలో శోకాలు పెట్టి, తన భార్యను కూడా అల్లరి అల్లరి చేసి, రాజకీయంగా లబ్ధి పొందాలని  ప్రయత్నం చేసిన నీచుడు. తన రాజకీయ అవసరాల కోసం మామను, మహిళల్ని, భార్యను అడ్డుపెట్టుకోవడమే కాకుండా, బామ్మర్థులను చవటలు, ఎందుకూ పనికిరారని, తన డబ్బా మీడియాను అడ్డు పెట్టుకుని అల్లరి చేసిన వ్యక్తి. అధికారం కోసం, రాజకీయ పదవుల కోసం ఏదైనా చేసే వ్యక్తి చంద్రబాబే.

చంద్రబాబు హయాంలో ప్రతి నియోజకవర్గానికి ఒక క్లబ్ పెట్టి రాష్ట్రమంతా జూదశాలలు ఏర్పాటు చేసి.. వేల కోట్ల డబ్బులు సంపాదించినటువంటి వ్యక్తి బాబు. అటువంటి వ్యక్తి.. గుడివాడలో నాకు చెందిన కే కన్వెన్షన్ లో కేసినోలు జరిగాయని, మహిళలను తీసుకొచ్చి డ్యాన్సులు వేయించానని, వారితో వ్యభిచారం చేయించానని  నా మీద అడ్డమైన ఆరోపణలు చేయించి, ఇంట్లో కూర్చుని ఆనందపడుతున్నాడు. నాకు చెందిన రెండు ఎకరాల స్థలంలోగానీ, నా కన్వెన్షన్ లోగానీ అటువంటివేవీ జరగలేదు, జరిగినట్టు నిరూపిస్తే, పెట్రోలు పోసుకుని చస్తానని చంద్రబాబుకు ఛాలెంజ్ విసిరితే.. పత్తా లేడు. ఈరోజు మళ్ళీ మాట మార్చి, కే కన్వెన్షన్ కాదు , దాని సమీపంలోనూ కాదు, గుడివాడలో జరిగాయని అడ్డగోలుగా మాట్లాడుతున్నారు, అసలు వీళ్ళ మాటలకు, చేష్టలకు విలువ ఉందా..?

చంద్రగిరిలో చంద్రబాబు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన జూద శాలలు, వేశ్య గృహాలను నడిపాడని నేను నిరూపిస్తాను. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు ఏం చెబితే.. మొరిగే కొంతమంది టీడీపీ నాయకులు నాపైన నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. వర్ల రామయ్య సీఐ, ఎస్ఐ గా ఉన్నప్పుడు నన్ను కొట్టాడని, నేను ఏదో ఆయిల్ దొంగతనం చేశానని బుద్ధా వెంకన్న చెబుతున్నాడు. నేను 1987-88 సంవత్సరంలో 9 - 10 తరగతి చదువుతున్నాను. స్కూల్ లో చదివే విద్యార్థిని అప్పుడు సీఐగానో, ఎస్ఐగానో ఉన్న వర్ల రామయ్య  కొట్టాడని కాల్ మనీ కేటుగాళ్ళు మాట్లాడుతున్నారు, ఒక స్కూల్ విద్యార్థినిని పోలీసులు కొట్టడం సాధ్యమవుతుందా..?. వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు, అసత్యాలే.  

టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నేను టీడీపీ శాసనసభ్యుడిగా ఉండగా,  2010లో నేను గుడివాడలో కే కన్వెన్షన్ కట్టాను. దానిని కూడా, మంత్రి అయ్యాక కట్టానని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మీ దగ్గర ఉన్నప్పుడు కన్వెన్షన్ హాలు కడితే.. నిజాయితీవంతుడు, నీతివంతుడు, కష్టపడి డబ్బులు సంపాదించి బిజినెస్ చేశాడు అని అంటారు. వేరే పార్టీలో ఉంటే.. మళ్ళీ మీరే ఇలా ఆరోపణలు చేస్తారా.. ?. 1991లోనే చంద్రబాబు లక్షలకు లక్షలు అద్దెలు కట్టాడని మాట్లాడుతున్నారు. మరి, అప్పుడు చంద్రబాబుకు హెరిటేజ్ వ్యాపారం కూడా లేదు. అంటే, టీడీపీ అధికారంలోకి వచ్చాక, కోటాది కోట్లు దండుకుని, జూదశాలలు, వ్యభిచార గృహాలు నడిపిన నీచాతి నీచమైన వ్యక్తి చంద్రబాబు.

చంద్రబాబు హయాంలో విజయవాడలో కాల్ మనీ కేటుగాళ్ళు.. హింసించిన మహిళలు ఒక్కొక్కరూ బయటకు వచ్చి  పోలీస్ స్టేషన్ లలో కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. పది, ఇరవై రూపాయల వడ్డీకి డబ్బులిచ్చి,  మహిళల జీవితాలతో ఆట్లాడుకున్న మీకు వారి చేతుల్లోనే బడిత పూజ జరుగుతుంది. నేను కొవిడ్ తో ఆసుపత్రిలో ఉంటే.. నా కన్వెన్షన్ లో వ్యభిచారం చేశానని తప్పుడు ఆరోపణలు చేస్తారా.. ?  చంద్రబాబు జీవితం ఏంటో.. అతను ఏం చేసి ఎదిగాడో..  గంట గంటకూ కూడా నేను చెప్పటానికి సిద్ధంగా ఉన్నాను. మీరు నా గురించి మాడితే.. నేను చంద్రబాబు గురించి, గంట గంటకూ వచ్చి, చంద్రబాబు గురించి ఎన్టీఆర్ మాట్లాడిన వీడియోలతో సహా అన్నీ రాష్ట్ర ప్రజల ముందు పెడతాను. నా కన్వెన్షన్ మీద ఆరోపణలు చేసినప్పుడే.. నేను చంద్రబాబు ఇంటి గురించి మాట్లాడాను. 

రాజకీయంగా మాట్లాడతాను తప్పితే.. చంద్రబాబును టచ్ చేయాల్సిన అవసరం మాకేంటి..?. ఎన్టీఆర్, కేసిఆర్, వైయ‌స్ జగన్ అనేక మందికి రాజకీయ భిక్ష పెట్టారు. అంటే అర్థం ఉంటుంది. అసలు తెలుగుదేశం పార్టీ ఎవరిది, చంద్రబాబుదా.. అతనే ఎన్టీఆర్ దగ్గర బిచ్చగాడు, ఎన్టీఆర్ కాళ్ళు పట్టుకుని టీడీపీలో చేరాడు, అటువంటి చంద్రబాబు నాకు బిక్షపెడతాడా..?. మా కుటుంబం గతంలో మొదటి నుంచీ తెలుగుదేశం పార్టీకి సానుభూతిపరులం. 

చంద్రబాబు గురించి ఎక్కడ చర్చ పెట్టినా.. నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. మరి చంద్రబాబు వస్తాడా.. ?. గవర్నర్నే కాదు.. రాష్ట్రపతిని కూడా కలవమనండి. కోడి పందేలు జరిగితే.. ఏ కేసులు పెట్టాలో ఆ కేసులు పెడతారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ కు,  అంతర్జాతీయ సంస్థలకు కూడా టీడీపీ కంప్లైంట్ పెట్టవచ్చు, అది వారి ఇష్టం. ఏది నిజమో, ఏది కాదో.. ఆరోపణలు చేసే ముందే నిజ నిర్దారణ చేసి, కమిటీ వేయాలి, అలాకాకుండా, తప్పుడు ఆరోపణలతో నా కన్వెన్షన్ లో నిజ నిర్దారణ చేయాల్సిన అవసరం ఏముంది.?

నన్ను చంపుతానంటే..  నా శవాన్ని పంపిస్తాననడం.. చంద్రబాబును వెన్నుపోటుదారుడు అని, 420 అని తిట్టడం ఒకటేనా.. ? అరిచే కుక్క ఎప్పటికీ కరవదు. దాంతో న్యూసెన్స్ ఎక్కువ ఉంటుందని, పిచ్చి కుక్క అని మూతికి పెట్టి కొడతారు. అలాంటిదే.. టీడీపీ నాయకులు నోటికొచ్చినట్లు అరుస్తున్నారు. చంద్రబాబు ఇంట్లో పడుకుని.. వీళ్ళను రెచ్చగొట్టి నా మీదకు ఉసిగొల్పుతున్నాడు. ఇలాంటి చంద్రబాబు బుద్ధులు చిన్నప్పటి నుంచే చూశాం. 

సకల, నీచాతి నీచమైన అలవాట్లు ఉన్న, ఆఖరికి ఎన్టీఆర్ హయాంలో.. చంద్రబాబు మిత్ర బృందం అంతా కలిసి 1989-90 సమయంలో, ఖైరతాబాద్ లో, టీడీఎల్పీ ఆఫీసులో పేకాటలు ఆడినటువంటి చరిత్ర చంద్రబాబుది. అప్పుడు, ఎన్టీఆర్ పిలిచి చంద్రబాబుని చెప్పుతో కొట్టారని, గట్టిగా బుద్ధి చెప్పారని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులే చెప్పారు.

Back to Top