చంద్రబాబు, పవన్‌ ఇద్దరివీ దొంగ నాటకాలే..

సీఎం వైయస్‌ జగన్‌ సంకల్పాన్ని ఇంచు కూడా కదపలేరు

టీడీపీ బంద్‌కు పిలుపునిస్తే బడ్డీ కొట్టు కూడా మూయలేదు

చంద్రబాబు ఎంత పెద్ద వెదవో మోడీకి, అమిత్‌షాకి తెలుసు

ఎన్టీఆర్‌ కుటుంబాన్ని రాజకీయాలకు దూరం చేసిన నిష్ట దరిద్రుడు బాబు 

సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోం

చంద్రబాబు, టీడీపీ నేతలకు మంత్రి కొడాలి నాని హెచ్చరిక

తాడేపల్లి: ఇచ్చిన మాట కోసం నీతిగా, నిజాయితీగా ప్రజల బాగు కోసం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారని, సీఎంపై తప్పుడు ప్రచారాలు చేసినా, అసభ్యంగా మాట్లాడినా చూస్తూ ఊరుకోమని, చంద్రబాబు, టీడీపీ నేతల తాట తీసి సీఎంకు చెప్పులు కుట్టిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. 420 చంద్రబాబు విసిరే ఎంగిలిమెతుకులకు ఆశపడి పట్టాభి లాంటి పదిమంది పనికిమాలిన వెదవలు మొరుగుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు లాంటి నీచులు, పట్టాభి లాంటి ఊరపందులు ఎన్ని వచ్చినా సీఎం వైయస్‌ జగన్‌ సంకల్పాన్ని, ప్రజల్లో గుండెల్లో ఉన్న ఆయన స్థానాన్ని ఒక ఇంచు కూడా తగ్గించలేరన్నారు. చంద్రబాబు బంద్‌కు పిలుపునిస్తే.. రాష్ట్రంలో ఒక్క బడ్డీ కొట్టు కూడా మూసేయలేదని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొడాలి నాని విలేకరుల సమావేశం నిర్వహించారు. 

మంత్రి కొడాలి నాని ఇంకా ఏం మాట్లాడారంటే..
‘‘రాజకీయంగా దిగజారిపోయిన తెలుగుదేశం పార్టీని, పనికిమాలిన కొడుకు లోకేష్‌ను కాపాడుకోవాలనే దురుద్దేశంతో చంద్రబాబు గత పది రోజులుగా చంద్రబాబు విషప్రచారం చేస్తున్నాడు. చంద్రబాబు సారథ్యంలోని కొంతమంది వెదవలు ప్రెస్‌మీట్లు పెట్టి పిచ్చివాగుడు వాగుతున్నారు. ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఇవ్వమని పోలీసులు నోటిసులు ఇస్తే.. చంద్రబాబు కుట్రలో భాగంగా వైయస్‌ఆర్‌ సీపీ శ్రేణులను రెచ్చగొట్టాలని, శాంతిభద్రతలు లోపించాయనే కుట్ర చేసి పబ్లిసిటీ తెచ్చుకోవాలని చంద్రబాబు ప్లాన్‌ చేసి పెయిడ్‌ ఆర్టిస్టులతో ముఖ్యమంత్రి, మంత్రులపై దూషణలకు ప్రేరేపించాడు.  

ముఖ్యమంత్రిని నోటికి ఇష్టమొచ్చినట్టు మాట్లాడినందుకు వాళ్ల ఆఫీసుల మీద దాడి జరిగితే నిన్న రాత్రి నుంచి చంద్రబాబు నాటకం స్టార్ట్‌ చేశాడు. చంద్రబాబు జీవితం..  ఛీటర్, 420, వెన్నుపోటుదారుడు. రాజకీయాల్లోకి కుళ్లు, కుతంత్రాలతో అందితే కాళ్లు, లేకపోతే జుట్టుపట్టుకోవడంలో సిద్ధహస్తుడు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని హస్తగతం చేసుకొని, ఆయన ముఖ్యమంత్రి పదవినే దొంగలించి.. వైశ్రాయ్‌ హోటల్‌ దగ్గర చెప్పులతో కొట్టించి ఎన్టీఆర్‌ చావుకు కారణమయ్యాడు. మీడియాలో ఉన్న తన అనుచరులను అడ్డంపెట్టుకొని ఎన్టీఆర్‌పై దుష్ప్రచారం చేయించి.. వారి కుటుంబ సభ్యులను అసమర్థులని, తాగుబోతులని చెప్పి.. పట్టాభి లాంటి వెదవలను పదిమందిని పెట్టుకొని దుష్ప్రచారం చేయించి ఎన్టీఆర్‌ కుటుంబాన్ని రాజకీయాలకు దూరం చేశాడు. నిష్ట దరిద్రుడు చంద్రబాబు. 

విజన్‌ 2020 అంటూ 420 చంద్రబాబు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిని అనేక రకాల ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నం చేశాడు. రెండు సార్లు వైయస్‌ఆర్‌ చేతిలో ఓడిపోయాడు. వైయస్‌ఆర్‌ చనిపోయిన తరువాత వైయస్‌ జగన్‌కు భయపడి అనేక రకాల ఆరోపణలు చేశాడు. చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజల హృదయాల్లో సీఎం వైయస్‌ జగన్‌ స్థానం సంపాదించుకున్నారు. 151 సీట్లతో ముఖ్యమంత్రిగా గెలిచి.. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. పంచాయతీ నుంచి పార్లమెంట్‌ వరకు ఏ ఎన్నికలు జరిగినా అత్యధిక మెజార్టీతో వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థులే విజయం సాధిస్తున్నారు. అది జీర్ణించుకోలేక ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని భ్రష్టుపట్టించాలనే కుట్రతో పనికిమాలిన వెదవలతో ప్రెస్మీట్లు పెట్టించి.. ముఖ్యమంత్రిని బూతులు తిట్టిస్తున్నాడు. ముసలి గుంట నక్క నిరాహార దీక్షలు చేస్తున్నాడు. అమిత్‌షా తిరుపతికి వస్తే టీడీపీ గూండాలతో దాడి చేయించి లోఫర్‌ చంద్రబాబు. 

చంద్రబాబు ఎంత పెద్ద వెదవో ఢిల్లీలో ఉన్న మోడీకి, అమిత్‌షాకి తెలుసు. మోడీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడని నల్లబట్టలు వేసుకొని దొంగ మాటలు చెప్పి ఢిల్లీలో చంద్రబాబు దీక్షలు చేశాడు. ఏ మొహం పెట్టుకొని మోడీ, అమిత్‌షాను కలుస్తాడు. ఇటువంటి చంద్రబాబు లాంటి ఎంత మంది వచ్చినా.. పట్టాభి లాంటి ఊరపందులు ఎన్ని వచ్చినా సీఎం వైయస్‌ జగన్‌ సంకల్పాన్ని, ప్రజల్లో గుండెల్లో ఉన్న స్థానాన్ని ఒక ఇంచు కూడా చంద్రబాబు తగ్గించలేడు. 

ముసలి నక్క చంద్రబాబు అన్నం తింటున్నాడో.. గడ్డి తింటున్నాడో తెలియదు.  పనికిరాని వ్యక్తులను పదిమందిని పెట్టుకొని సీఎం వైయస్‌ జగన్‌ను, మంత్రులను తిట్టించడం చంద్రబాబుకు ఆనవాయితీ అయిపోయింది. చంద్రబాబులా దొంగలను పెట్టించి తిట్టించే కర్మ మాకు లేదు. కాబట్టే మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడుతున్నాం. చంద్రబాబు అవినీతి చక్రవర్తి, ఔరంగజేబు, వెన్నుపోటుదారుడు, చంద్రబాబంత నీచుడు, నికృష్టుడు లేడని ఎన్టీఆర్‌ చెప్పారు. 

ఇచ్చిన మాట కోసం నీతిగా, నిజాయితీగా ప్రజల కోసం సీఎం వైయస్‌ జగన్‌ పనిచేస్తున్నాడు. సీఎం వైయస్‌ జగన్‌ గురించి ఎక్కువ మాట్లాడితే.. చూస్తూ ఊరుకోం. పదిమంది పోలీసుల సెక్యూరిటీతోనే బతుకుతూ వాళ్లనే తిడుతున్నాడు. చంద్రబాబు లాంటి వెదవలను ప్రజలు గమనించాలి. చంద్రబాబు పీడ వచ్చే ఎన్నికల్లోనైనా విరగడ చేయాలి. చంద్రబాబు బందుకు పిలుపునిస్తే బడ్డీ కొట్టు కూడా మూయలేదు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నాడు. 420 స్థాయి ఏంటో ఇవాళ అయినా అర్థమైందా..? 

పోసాని కృష్ణమురళీ మాట్లాడితే వారి ఇంటిపై దాడి చేశారు.. అప్పుడు ప్రజాస్వామ్యం ఖూనీ అవ్వలేదా..? టీడీపీ ఆఫీసులో కుర్చీలు, బల్లాలు పగిలితే ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందా..? పోసాని ఇంటిపై పవన్‌ అభిమానులు దాడి చేస్తే ఖండించకుండా ఫాంహౌస్‌లో పడుకున్న అజ్ఞాతవాసి.. చంద్రబాబు ఆఫీస్‌లో కుర్చీలు, బల్లాలు పగిలితే మీడియా ముందుకు వచ్చాడు. చంద్రబాబు, పవన్‌ ఇద్దరూ కలిసే నాటకాలు, డ్రామాలు రక్తికట్టిస్తున్నారు. ఇటువంటి పవన్, చంద్రబాబు లాంటి వాళ్లు వెయ్యి మంది వచ్చినా సీఎం వైయస్‌ జగన్‌ సంకల్పాన్ని ఆపలేరు. 

టీడీపీ పెయిడ్‌ ఆర్టిస్టులు ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలి. సీఎంపై అవాకులు, చవాకులు పేలితే ఎవరినీ వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. మా అభిమాన నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌. ఆయన మాకు ఏ ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదు.. ఆయన వద్దన్నా.. చంద్రబాబు, టీడీపీ నేతల తాట తీసి సీఎంకు చెప్పులు కుట్టిస్తాం.. ఒళ్లు దగ్గరపెట్టుకొని బతకండి’’ అని మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top