బోడిలింగం ఎవరో భీమవరం, గాజువాక ప్రజలకు తెలుసు

కాసేపు మెడ, తొడ రుద్దుకుంటే ప్రజలు నిన్ను నమ్ముతారా..? 

రాజకీయ పార్టీ పెట్టి వ్యాపారం చేస్తున్న వ్యక్తి పవన్‌ కల్యాణ్‌

పవన్‌ తాపత్రయం అంతా చంద్రబాబును సేవ్‌ చేయడానికే 

ప్యాకేజీ తీసుకొని మాట్లాడుతున్నాడని రాష్ట్రం మొత్తం తెలుసు

బాబు, పాల్, పవన్‌ కలిసి ‘తెలుగు శాంతి సేన’ పార్టీ పెట్టుకోండి

పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

గుడివాడ: శివలింగం ఎవరో, బోడిలింగాలు ఎవరో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు అని, భీమవరం, గాజువాక వెళ్లి అడిగితే బోడిలింగం ఎవరో చెప్తారని, మహాశివలింగం ఎవరంటే.. సీఎం వైయస్‌ జగన్‌ అని ప్రజలంతా ముక్తకంఠంతో చెబుతారని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. పవన్‌ కల్యాణ్‌ తనను తాను.. వకీల్‌ సాబ్‌ అనుకుంటున్నాడని, కానీ రాష్ట్ర ప్రజలంతా షకీలా సాబ్‌గా గుర్తించారని ఎద్దేవా చేశారు. ప్యాకేజీ తీసుకొని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకునేది లేదని, నోరు అదుపులో పెట్టుకోవాలని పవన్‌కు సూచించారు. ఒక రాజకీయ పార్టీ పెట్టి వ్యాపారం చేస్తున్న వ్యక్తి పవన్‌ కల్యాణ్‌ అని ఎద్దేవా చేశారు. భయం లేదు.. భయం లేదు అంటూనే.. భయపడుతున్నాడని, అసలు పవన్‌ కల్యాణ్‌ను ఎవరు భయపడమన్నారని ప్రశ్నించారు. పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలకు మంత్రి కొడాలి నాని కౌంటర్‌ ఇచ్చారు. గుడివాడలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. 

‘మంత్రిగా రాష్ట్ర ప్రజలకు, ఎమ్మెల్యేగా గుడివాడ ప్రజలకు సమాధానం చెప్పే బాధ్యత నాపై ఉంది. ఎవరెవరో వచ్చి ఏదేదో మాట్లాడితే.. అన్నింటికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కాకపోతే పేకాట క్లబ్‌లు అని పవన్‌ కల్యాణ్‌ ఏదేదో మాట్లాడుతున్నాడు. వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చాక సీఎం వైయస్‌ జగన్‌ పేకాట క్లబ్‌లు మూయించారు. గతంలో విజయవాడలో చంద్రబాబు ఆయన పాట్నర్‌లు కలిసి పేకాటను విచ్చలవిడిగా ఆడిస్తే.. ఆరోజు పేకాట క్లబ్‌లు నీ కంటికి కనిపించలేదా..?’ అని పవన్‌ కల్యాణ్‌ను నిలదీశారు. 
 
‘నేను ఎవరి దగ్గర నేను ఎవరి దగ్గర ప్యాకేజీలు తీసుకొని నోటికి వచ్చినట్లుగా మాట్లాడడం లేదు. కొడాలి నాని పేకాట క్లబ్‌లు మూయించారా..? ఆడించారా..? అనేది గుడివాడ ప్రజలను అడిగితే చెప్తారు.  పవన్‌ కల్యాణ్‌ నోరు అదుపులో పెట్టుకోవాలి. సినిమాలు మానేయాలని పవన్‌కు చెప్పింది ఎవరూ.. రాజకీయాల్లోకి వచ్చాను సినిమాలు మానేశానని చెప్పింది నువ్వే కదా..? సీఎం వైయస్‌ జగన్‌ బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని పాలిస్తే సినిమాలు చేసుకుంటానని చెప్పావ్‌.. అన్నట్లుగానే చేసుకుంటున్నావు. పవన్‌ కల్యాణ్‌ను నటుడిగానే ఇంకా మేము గుర్తిస్తున్నాం. 

చంద్రబాబు దత్తపుత్రుడు, సొంత పుత్రుడిని రోడ్డు మీదకు పంపించారు. నిన్న వారిద్దరి కార్యక్రమం జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్లుంది. శివలింగాలను బోడిలింగాలు అంటూ పవన్‌ కల్యాణ్‌ దేవుడిని అవమానిస్తున్నారు. బోడిలింగం ఎవరో భీమవరం, గాజువాక వెళ్లి అడిగితే చెబుతారు. మహాశివలింగం ఎవరో రాష్ట్ర ప్రజలను అడిగితే చెబుతారు. 

చంద్రబాబు, కే.ఏ.పాల్, పవన్‌ అందరూ ఒక్కటే. వీరి పార్టీ పేరు ‘తెలుగు శాంతి సేన’ పార్టీగా మారిస్తే బాగుంటుంది. అంతర్జాతీయ అధ్యక్షుడిగా కే.ఏ.పాల్, జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు, రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఈ యాక్టర్‌ ఉంటాడు. చంద్రబాబును విమర్శిస్తే ఆయన్ను రక్షించడానికి యుద్ధ విమానంలో వచ్చినట్లుగా పవన్‌ వచ్చాడు. కాసేపు మెడ, తొడ రుద్దుకోగానే నిన్ను ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నావా..? ప్యాకేజీ తీసుకొని వచ్చి చంద్రబాబు కోసం మాట్లాడుతున్నావని ప్రజలకు తెలియదని అనుకుంటున్నావా..?  తిరుపతిలో బీజేపీ పోటీ చేస్తే టీడీపీ మూడవ స్థానానికి వెళ్లిపోతుందని, చంద్రబాబును రక్షించాలని తానే పోటీ చేస్తానని పవన్‌ ఆత్రుతపడుతున్నాడు. ఒక అభ్యర్థిని పెట్టి గాలికొదిలేసి టీడీపీని సేవ్‌ చేయడానికి పవన్‌ తాపత్రయం’ అని మంత్రి కొడాలి నాని విమర్శించారు.  

 

Back to Top