చంద్రబాబు జైలుకెళ్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయ్‌

ఇంద్రకీలాద్రిపై క్షుద్రపూజలు చేయించిన నీచుడు బాబు

దుర్గమ్మ దీవెనలతో వైయస్‌ జగన్‌ సీఎం అయ్యారు

అభివృద్ధి వికేంద్రీకరణకు వైయస్‌ఆర్‌ సీపీ కట్టుబడి ఉంది 

అమరావతిలో శాసన రాజధాని ఉంటుంది

దమ్ముంటే టీడీపీ ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేసి ఎన్నికల్లో గెలవాలి

రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు ఓటమి ఖాయం

గ్రామీణ మహిళల డబ్బు పందికొక్కులా తిన్నది చంద్రబాబే

హెరిటేజ్‌ కోసం సహకార వ్యవస్థను నాశనం చేశాడు

మద్యపాన గురుంచి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు

ఫేక్‌ నాయకుడిని నమ్మి అమరావతి రైతులు మోసపోవద్దు

టీడీపీ జాతీయ పార్టీ అని నిరూపిస్తే రాజకీయాల్లోంచి తప్పుకుంటా..

చంద్రబాబుకు మంత్రి కొడాలి నాని సవాల్‌

తాడేపల్లి: తెలుగుదేవం పార్టీకి చంద్రబాబు నాయుడు ఫేక్‌ అధ్యక్షుడు అని, టీడీపీ ఫేక్‌ జాతీయ పార్టీ అని, ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పార్టీని కాజేసిన చిల్లర దొంగ చంద్రబాబు అని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. అమరావతి ఉద్యమం 365 రోజుల కార్యక్రమం పేరుతో చంద్రబాబు, ఆయనకు సంబంధించిన తోకపార్టీలు.. ప్రభుత్వాన్ని, సీఎం వైయస్‌ జగన్‌ను తిట్టడానికి మీటింగ్‌ పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. గజ్జికుక్కలా అవతారమేసుకొని.. పిచ్చికుక్కలా చంద్రబాబు వాగుతున్నాడన్నారు. ఎవరిది ఫేక్‌ పార్టీ చంద్రబాబూ..? నీది జాతీయ పార్టీనా..? అని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం టీడీపీ జాతీయ పార్టీ అని సర్టిఫై చేసిందా..? తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అని నిరూపిస్తే రాజకీయాల్లోంచి తప్పుకుంటా.. టీడీపీ ఒక ఫేక్‌ పార్టీ, చంద్రబాబు ఫేజ్‌ అధ్యక్షుడని మండిపడ్డారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొడాలి నాని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ దగ్గర పార్టీ కొట్టేసిన చిల్లర దొంగ చంద్రబాబు అని ధ్వజమెత్తారు. 1983లో కాంగ్రెస్‌లో పోటీ చేసి ఓడిపోయి ఎన్టీఆర్‌ కాళ్ల దగ్గర పడుకొని కన్నీరు పెట్టుకున్నాడని, అల్లుడు కాళ్లు పట్టుకున్నాడని ఎన్టీఆర్‌ కనికరిస్తే.. ఆదరించి ఆశ్రయం ఇచ్చిన ఎన్టీఆర్‌కే  వెన్నుపోటు పొడిచిన నీచ సంస్కృతి చంద్రబాబుదని మండిపడ్డారు. ఒక పేపర్‌ మీద ఫేక్‌ అమరావతిని సృష్టించి గ్రాఫిక్స్‌ రిలీజ్‌ చేసి అమాయకరైతులను మోసం చేసి.. 33 వేల ఎకరాలు దోచుకొని తన బినామీలకు, తాబేదారులకు కట్టబెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాలిమాటలు చెప్పి నిజమైన రైతులను రోడ్డుమీద పడేసిన గుంటనక్క చంద్రబాబు అని ఫైరయ్యారు. 

మంత్రి కొడాలి నాని ఇంకా ఏం మాట్లాడారంటే..

సీఎం వైయస్‌ జగన్‌ పార్టీ పెట్టి ప్రజల దగ్గరకు వెళ్లి ఐదేళ్లు పోరాటం చేసి 67 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్షనేత అయ్యారు. 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి వాళ్ల సమస్యలను దగ్గర నుంచి చూసి 151 సీట్లతో ముఖ్యమంత్రి అయ్యారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్న నిజాయితీ గల ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌. 

చంద్రబాబు బతుకంతా ఫేకే. కొట్టుకొచ్చిన పార్టీకి అడ్డదారిలో అధ్యక్షుడివి అయ్యావు. నోటికి అడ్డూఅదుపు లేకుండా గజ్జికుక్క అవతారం వేసుకొని పిచ్చికుక్కలాగా చంద్రబాబు వాగుతున్నాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కనకదుర్గమ్మకు నవరాత్రి ఉత్సవాలకు పట్టువస్త్రాలు సమర్పించావా..? ఈరోజున రోడ్డు మీద పడేసరికి ఇవాళ దుర్గమ్మ గుర్తుకువచ్చిందా..? 

కనకదుర్గమ్మ గుడిలో క్షుద్రపూజలు చేయించింది చంద్రబాబు. కొండపైన దుర్గమ్మ ఉంటే.. కొండ కింద అక్రమ కట్టడంలో నివాసం ఉంటున్నావ్‌. కొండపై నుంచి అమ్మవారు.. చంద్రబాబు అక్రమాలు, దొంగతనాలు చూసింది కాబట్టే 23 సీట్లకు పరిమితం చేసి.. రోడ్డుపాలు చేసింది. దుర్గమ్మ చల్లనిదీవెనలతో వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యారు.. రెండుసార్లు పట్టువస్త్రాలు సమర్పించారు. రూ.70 కోట్లతో గుడి అభివృద్ధి పనులకు కేటాయించారు. దుర్గమ్మ ఆశీస్సులు సీఎం వైయస్‌ జగన్‌కు పుష్కలంగా ఉంటాయి. 

బ్రహ్మోత్సవాలకు పట్టువస్త్రాలు పట్టుకొని వెళ్తే అలిపిరిలోనే ఆ వెంకటేశ్వరస్వామి బాంబ్‌ బ్లాస్ట్‌ చేసి పక్కనపడేశాడు. వెంకన్న శాపంతో పదేళ్లు చంద్రబాబు దిక్కుమాలిన బతుకుబతికాడు. దుర్గమ్మ, వెంకన్న నావైపే ఉన్నారని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. నీలాంటి పాపాత్ముల వెంట దేవుళ్లు ఎందుకు ఉంటారు..? అధికారంలో ఉండగా 100 ఆలయాలను కూల్చినందుకు నీ వెంట ఉంటారా..? బూట్లు వేసుకొని దేవాలయాల్లో పూజలు చేస్తున్నందుకు నీతో ఉంటారా..? నీలాంటి నీచుడ్ని, నికృష్టుడిని అంతం చేయడానికే దేవుళ్లు ఉంటారు చంద్రబాబూ..

జూమ్‌ యాప్‌లో కూర్చొని గంట సొల్లు కబుర్లు చెబితే రాజకీయాల్లో ఉన్నట్లా..? 23 సీట్లకు వచ్చావ్‌.. చంద్రబాబు రాజకీయాల నుంచి ఎట్టి పరిస్థితుల్లో తప్పుకోవద్దని కోరుతున్నా.. నీలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే.. సీఎం వైయస్‌ జగన్‌కు ఈసారి 170 సీట్లు వస్తాయి. మొన్న నీ కొడుకును మంగళగిరిలో ఓడించారు.. ఈసారి నిన్ను కుప్పంలో ఓడించి నీకు రాజకీయ సమాధి సీఎం వైయస్‌ జగనే కడతారు. 

గత అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబును గ్యాలరీలు ఎక్కించాడు.. మొన్న శాసనసభలో కింద కూర్చోబెట్టాడు.. ఇవాళ అమరావతిలో రోడ్ల మీద పడుకోబెట్టాడు.. ఇంకా చాలా చిత్రాలు చూపిస్తాడు.. నువ్వు చేసింది మామూలు పాపాలు కాదు చంద్రబాబూ.. 

ఎన్టీఆర్‌ మద్యపాన నిషేధం తీసుకువస్తే.. చంద్రం బుడ్డి తీసుకువచ్చింది ఎవరూ..? మద్యం గురించి, బుడ్డీల గురించి, మద్యపాన నిషేధం గురించి మాట్లాడేందుకు అర్హత లేని వ్యక్తి చంద్రం బుడ్డి. 

హైదరాబాద్‌లో అభ్యర్థులను పోటీకి పెట్టి ఓటేయండి అని ట్విట్టర్‌లో పోస్టు పెట్టాడు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టి ఓటేయండి అని ట్విట్టర్‌లో పెడతారా..? ఫేక్‌ పార్టీని నడుపుతూ.. తండ్రీకొడుకులు ఇంట్లో తినితొంగుంటున్నారు. హైదరాబాద్‌ను చంద్రబాబు ప్రపంచ పటంలో పెడితే.. చంద్రబాబును హైదరాబాద్‌ ప్రజలు డ్రైనేజీ కాల్వలో పెట్టారు. 

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ది రాజారెడ్డి రాజ్యాంగం అయితే నువ్వు ఏ రాజ్యాంగం నడిపావు.. మీ నాన్న ఖర్జూర నాయుడు రాజ్యాంగమా..? తాత కిస్మిస్‌ నాయుడు రాజ్యాంగమా..? లవంగం నాయుడు రాజ్యాంగం నడిపావా..? సిగ్గు, శరం లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నాడు. 

అమూల్‌ ప్రాజెక్టును తీసుకువచ్చి అక్కచెల్లెమ్మలకు ఆర్థికంగా చేయూతను అందిస్తామని సీఎం వైయస్‌ జగన్‌ చెబితే.. చంద్రబాబు గగ్గోలు పెడుతున్నాడు. హెరిటేజ్‌ కోసం సహకార వ్యవస్థను సర్వనాశనం చేశాడు. హెరిటేజ్‌కు అన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయి..? గ్రామీణ ప్రాంతంలో పేద మహిళల డబ్బులు దోచుకున్న పందికొక్కు చంద్రబాబు. 

అమరావతిలో చేసిన అన్యాయంపై కేసు పెడితే.. ఆదివారం సాయంత్రం 5 గంటలకు కోర్టుకు సెలవు అయితే జడ్జి గారి ఇంటికి వెళ్లి మోషన్‌ మూవ్‌ చేసి 9 గంటలకు గ్యాగ్‌ ఆర్డర్‌ తెచ్చుకున్నావ్‌. మేనేజ్‌మెంట్‌తో కేసు విచారణను అడ్డుకున్నావ్‌.. నువ్వు తెచ్చుకున్న స్టేలు తొలగిపోతాయ్‌.. నిన్ను జైలుకు పంపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయ్‌. ఈ రాష్ట్రాన్ని దోచుకున్న నీకు తగిన శాస్తి సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం చేస్తుంది.. ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల్లోంచి చంద్రబాబు తప్పుకోవద్దు. 

అమరావతి రాజధానిగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారనే నమ్మకం చంద్రబాబుకు ఉంటే.. డ్రామాలు, యాక్షన్‌ లేకుండా నీ శాసనసభ్యులతో రాజీనామా చేయించి ఎన్నికల్లో పోటీ చేసి గెలువు.. రాజధాని ఇక్కడే ఉంటుంది. అమరావతి రైతులపై ప్రేమ ఉంటే.. అమరావతిలో రాజధాని ఉంచాలనే కోరిక ఉంటే.. ఉత్తరాంధ్ర ప్రజలు, రాయలసీమ ప్రజలు రాజధాని వద్దనుకుంటున్నారని భావిస్తే.. నీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లు చంద్రబాబు. మాకు డిపాజిట్లు రాకుండా గెలిస్తే తప్పకుండా రాజధాని ఇక్కడే ఉంటుంది. 

అభివృద్ధి వికేంద్రీకరణకు వైయస్‌ఆర్‌ సీపీ కట్టుబడి ఉంది. వెనుకబడిన ఉత్తరాంధ్రకు కార్యనిర్వాహణ రాజధాని, కర్నూలుకు న్యాయ రాజధాని తీసుకెళ్తాం.. అమరావతిలో శాసన రాజధాని ఉంటుంది. చంద్రబాబు రాజధాని తీసేశారని తప్పుదోవ పట్టించే పరిస్థితి సృష్టిస్తున్నాడు. ఫేక్‌ చందరబాబు మాటలు విని అమరావతిలోని నిజమైన రైతులు మోసపోవద్దు’ అని కొడాలి నాని కోరారు. 
 

Back to Top