నిమ్మగడ్డ నిర్ణయం అవివేకం

కోవిడ్‌ తీవ్రత దృష్ట్యా స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా లేదు

పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

కృష్ణా: రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. చంద్రబాబు లేఖలకు స్పందిస్తూ ఎన్నికలు నిర్వహించాలనుకోవడం సిగ్గుచేటని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. కోవిడ్‌ తీవ్రత దృష్ట్యా ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఉద్యోగులు కూడా సిద్ధంగా లేరన్నారు. గుడివాడలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు రాజ్యాంగ వ్యవస్థలపై, రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదని దుయ్యబట్టారు. కోవిడ్‌ కేసులు తీవ్రత ఉన్నా ఎన్నికలు నిర్వహిస్తామనడం అవివేకమన్నారు. హైదరాబాద్‌లో కూర్చునే అజ్ఞాతవాసి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. జూమ్‌ బాబుతో చేతులు కలిపి ప్రజలకు నష్టం కలిగించేలా ఎన్నికలు నిర్వహిస్తామంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు.  
 

Back to Top