కొడుకు మీద నమ్మకం లేని బాబు దత్తపుత్రుడిని దువ్వుతున్నాడు

మంత్రి  కొడాలి వెంకటేశ్వరరావు (నాని)

బాబు మానసిక స్థితి బాగోలేదు

అందుకే పిచ్చి పిచ్చి ప్రసంగాలు. అర్ధం లేని విమర్శలు

సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ దెబ్బకు చంద్రబాబు అన్ని విధాల కకావికలం

వరసగా అన్ని ఎన్నికల్లో ఘోర పరాజయం

ఇప్పుడు బద్వేల్‌ ఉప ఎన్నిక నుంచి కూడా పరార్‌
 
డ్రగ్స్‌ మాఫియాతో చంద్రబాబుకే సంబంధాలు

ఉత్తరాంధ్ర నుంచి దేశమంతా గంజాయి సరఫరా

ఇప్పుడు వైయ‌స్‌ జగన్‌గారిపై నిరాధార ఆరోపణలు

డ్వాక్రా సంఘాలపైనా చంద్రబాబు అసత్యాలు

ఆ సంఘాల మహిళలను మోసం చేసిన చంద్రబాబు

 

తాడేపల్లి:  సొంత‌ కొడుకు మీద నమ్మకం లేని చంద్ర‌బాబు దత్తపుత్రుడిని దువ్వుతున్నాడ‌ని మంత్రి  కొడాలి వెంకటేశ్వరరావు (నాని) పేర్కొన్నారు.     గత మూడు, నాలుగు రోజుల నుంచి రాష్ట్రంలో ఒక వ్యక్తి మానసిక పరిస్థితి కోల్పోయి పిచ్చెక్కినటు వంటి ప్రసంగాలు చూస్తున్నార‌న‌ని విమ‌ర్శించారు. సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డిగారి దెబ్బకు పిచ్చెక్కిపోయిన వ్యక్తి మన రాష్ట్రాన్ని 14 ఏళ్లు సీఎంగా పని చేసిన వెన్నుపోటుదారుడు. అవినీతి చక్రవర్తి. రాష్ట్ర విభజనకు కారకుడు. రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశాడు. అతడు నీచాతినీచమైన లక్షణాలు, గుణాలు ఉన్నటువంటి వ్యక్తి. ఇవన్నీ నేను చెబుతున్నవి కావు. మహానుభావుడు ఎన్టీరామారావుగారు ఈ చంద్రబాబు గురించి అన్న మాటలని మంత్రి కొడాలి నాని గుర్తు చేశారు. తాడేప‌ల్లిలోని వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి  కొడాలి వెంకటేశ్వరరావు (నాని) ఆదివారం మీడియాతో మాట్లాడారు.

అన్ని ఎన్నికల్లో ఓటమి:
    సీఎం వైయ‌స్ జగన్‌గారి దెబ్బకు చిన్న మెదడు చిట్లిపోయి, అన్ని ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయాడు. పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల ఎన్నికలు. అన్నింటిలో చిత్తుచిత్తుగా ఓడిపోయి ఇప్పుడు బద్వేల్‌ ఉప ఎన్నిక నుంచి కూడా పారిపోయాడు. అందరూ దూరం కాగా, పార్టీకి చెందిన పనికిమాలిన ఒక 100, 200 మందిని రూమ్‌లో పెట్టుకుని ఉపన్యాసాలు చెబుతూ, జగన్‌గారి మీద విషం కక్కుతున్నాడు.

అసలు నమ్మకం ఉందా?:
    చంద్రబాబునాయుడుగారిని నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను నమ్మాలంటే నీ మీద నీకు నమ్మకం ఉందా. నీ కొడుకు మీద నీకు నమ్మకం ఉందా. నీ కొడుకు పనికిరానటువంటి చవట. దద్దమ్మ. సన్నాసి. ఈ పార్టీని గట్టెక్కించలేడు. వీడు ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. ఇలాంటి వాడు నా కడుపున పుట్టాడు. ఇటువంటి వ్యక్తిని నమ్ముకుంటే పార్టీ సర్వనాశనం అవుతుందని చెప్పి భావించే కదా, నీ దత్తపుత్రుడిని మళ్లీ లైన్‌ చేసుకుంటున్నావు. రా రా మళ్లీ కలిసి పోటీ చేద్దామంటున్నావు. నీ కొడుకు మీద నమ్మకం లేదు. లక్షల మంది టీడీపీ కార్యకర్తలకూ నమ్మకం లేదు.

కమ్మ వారికి అండగానా!:
    దత్తపుత్రుడి ఇటీవలి ప్రసంగాలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఎవరైనా పార్టీ పెడితే అణగారిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అగ్రవర్ణాల్లోని పేదలకు అండగా ఉంటారు. కానీ జనసేన పవన్‌కళ్యాణ్‌ మాత్రం కమ్మ వారికి అండగా ఉంటాడంట. అంటే  మా కమ్మవాడు చంద్రబాబునాయుడు సన్నాసి అని చెప్పి పవన్‌కళ్యాణ్‌ డిసైడ్‌ అయినట్లు ఉన్నాడు. మా రామోజీరావుగారు, మా రాధాకృష్ణగారు, మా బీఆర్‌ నాయుడుగారు.. మా కమ్మ వాళ్లను ఉద్ధరించడానికి ఈ రాష్ట్రంలో అనేక మంది మేధావులు, పేపర్లలో, టీవీల్లో పుంఖానుపుంఖాలుగా ప్రసారం చేయడానికి, కమ్మవారిని ఉద్ధరించడానికి రాష్ట్రంలో చాలా బలంగా పని చేస్తున్నారు. 
    అయితే వీరంతా అసమర్థులు. పనికిరాని వ్యక్తులు. వీరి వల్ల కావడం లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి, కమ్మ వారిని దేశంలో ఉన్నతమైన స్థానంలోకి తీసుకురావాలని పవన్‌కళ్యాణ్‌గారు నిర్ణయం తీసుకున్నారంటే ఆయనను, జనసేన పార్టీని ఈ రాష్ట్ర ప్రజలు ఎలా అర్ధం చేసుకుంటారో తెలియదు.

పార్టీని కలిపేయండి:
    చంద్రబాబునాయుడు ఏది చెబితే దానికి గంగిరెద్దులా తలూపుతూ, ఆయన నేర్పే మాటలు వింటూ, వాటినే చెబుతూ.. ఈరోజు తెలుగుదేశం పార్టీని చంద్రబాబునాయుడు వల్ల, ఆయన పుత్రుడు లోకేష్‌ వల్ల, ఆ పార్టీని నడుపుతున్న రెండు మూడు ఛానళ్ల అధిపతుల వల్ల కావడం లేదని అర్ధమైంది కాబట్టి, జనసేన పార్టీలో టీడీపీని విలీనం చేయాలి. అలా చేస్తే కమ్మవారికి, తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న కొంత మంది వ్యక్తులకు పవన్‌కళ్యాణ్‌వల్ల మేలు జరుగుతుందేమో.. అందుకని దయచేసి టీడీపీని జనసేనలో విలీనం చేయండి. దాంతో దరిద్రం వదులుతుంది.

మీకే డ్రగ్స్‌తో సంబంధాలు:
    చంద్రబాబునాయుడుగారు కొత్తగా డ్రగ్స్‌ గురించి చెబుతున్నాడు . ఆ డ్రగ్స్‌కు ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి ఇక్కడ తాడేపల్లికి డైరెక్ట్‌ లింక్స్‌ ఉన్నాయంట. ఈ విషయం ఆయనకు ఎవరు చెప్పారు. నిజానికి కేంద్ర దర్యాప్తు సంస్థలతో పాటు, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు కూడా డ్రగ్స్‌ ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఎవరు తెస్తున్నారన్న దానిపై పని చేస్తున్నాయి. హైదరాబాద్, గుజరాత్‌లో కొందరు ప్రముఖులు, కొన్ని సంస్థలపై దాడులు కూడా చేస్తున్నారు. ఆ విధంగా డ్రగ్స్‌ రాకెట్‌ ఛేదించే పనిలో దర్యాప్తు సంస్థలు నిమగ్నమై ఉన్నాయి.
    అయితే ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి ఇక్కడి తాడేపల్లిలోని జగన్‌గారి ఇంటికి డ్రగ్స్‌ సరఫరా అవుతున్నాయని చంద్రబాబునాయుడుగారికి, ఆయన మనుషులైన ఈ వెధవలు, సన్నాసులకు తెలిసిందట. అంటే అంతకు ముందు ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్లతో చంద్రబాబునాయుడు సంబంధాలు పెట్టుకుని హెరిటేజ్‌ మాల్స్‌లో ఈ డ్రగ్స్‌ అమ్మి ఉంటాడు. 

అవినీతి చక్రవర్తి:
    నీతిగా, నిజాయితీగా ఉండడం చంద్రబాబు రక్తంలోనే లేదు. నాడు ఎన్టీఆర్‌ స్వయంగా చెప్పారు ఇతను ఒక అవినీతి చక్రవర్తి అని. కేవలం 2 ఎకరాల పొలం నుంచి 2 లక్షల కోట్లకు పడగలెత్తిన అవినీతి చక్రవర్తి. పేరుకు హెరిటేజ్‌ సంస్థ. పాలు, పెరుగు, పేడ అమ్ముతామంటారు. కానీ చేసేది ఎర్రచందనం అక్రమ రవాణా. ఉత్తరాంధ్ర నుంచి గంజాయిని దేశవ్యాప్తంగా సరఫరా చేశారు. అవినీతి ద్వారా సంపాదించిన సొమ్మును హెరిటేజ్‌లో పెట్టి, వ్యవసాయ ఉత్పత్తులు అని చెప్పి ఆదాయపన్ను ఎగ్గొట్టి కోటానుకోట్లకు పడగలెత్తాడు. చంద్రబాబునాయుడు అవినీతి చక్రవర్తి అని, మోసగాడు అని, అతను ఒక నీచమైన వ్యక్తి అని నాడు మహానుభావుడు ఎన్టీ రామారావు స్వయంగా సర్టిఫికెట్‌ ఇచ్చాడు.

బాబు ఎక్కడ?:
    ఈ డ్రగ్స్‌ కానీ, మాఫియా కానీ అవన్నీ చంద్రబాబు నాయుడు చేసినవే. డ్రగ్స్‌ తీసుకుంటే కొన్ని మార్పులు ఉంటాయి. అయితే ఆ డ్రగ్స్‌ను ఇక్కడ జగన్‌గారు, తెలంగాణలో కేసీఆర్‌గారు, కేంద్రంలో మోదీగారు కట్టడి చేస్తున్నారు. ఈ మాఫియా వెనక ఎవరున్నా అరెస్టు చేసి లోపల పెడుతున్నారు. కాబట్టి ఈ మాదకద్రవ్యాలు దొరక్క అనుకుంటా, నక్కలాగా ఎండిపోయాడు మన బాబు. మానసిక స్థితి కూడా కోల్పోయాడు. ఈ మూడు నెలలుగా అడ్రస్‌ లేదు. ఎక్కడ పడి ఉన్నాడో కూడా తెలియడం లేదు.
    డ్రగ్స్‌ బిజినెస్‌ చేసింది నీ కుటుంబ సభ్యులు. డ్రగ్స్‌ తీసుకుంది నీ కుటుంబ సభ్యులు. ఉత్తరాంధ్ర నుంచి దేశవ్యాప్తంగా గంజాయి సప్లై చేసింది నువ్వు. కాబట్టి మాదకద్రవ్యాల సరఫరాకు నీవే సూత్ర«ధారిని. నీవు ఔరంగజేబు వంటి వాడవని నాడు ఎన్టీఆర్‌ చెప్పారు. 

మోసం చేసి.. అసత్యాలు:
    ఈ మధ్య డ్వాక్రా సం«ఘాల గురించి చెబుతున్నాడు. వాటిని తానే మొదలుపెట్టానని చెబుతున్నాడు. కానీ 1982–83లోనే దేశంలో డ్వాక్రా సం«ఘాలను మొదలుపెట్టారు. దేశవ్యాప్తంగా డ్వాక్రా ఉద్యమం కొనసాగింది. అలాంటి డ్వాక్రా సం«ఘాలకు పావలా వడ్డీకే రుణాలు వచ్చేలా చేశారు వైయస్సార్‌గారు. ఆ సం«ఘాలకు పెద్ద ఎత్తున రుణాలు వచ్చేలా ఆయన కృషి చేశారు.
    కానీ నువ్వేం చేశావు. 2014 ఎన్నికల్లో గెలుపు కోసం నరేంద్రమోదీ కాళ్లు పట్టుకున్నావు. పవన్‌కళ్యాణ్‌ను బతిమిలాడుకున్నావు. డ్వాక్రా సం«ఘాల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి, దాదాపు 90 లక్షల మహిళలను మోసం చేశావు. డ్వాక్రా సంఘాల చరిత్రలో ఒక మోసగాడిగా చరిత్రలో నిల్చిన నీవు, ఆ సంఘాలను తానే మొదలు పెట్టానని, అవి తన మాసనపుత్రికలు అని సిగ్గు లేకుండా చెబుతున్నావు.

జగన్‌గారు మాట నిలుపుకున్నారు:
    కానీ జగన్‌గారు, ఎన్నికల నాటికి డ్వాక్రా సంఘాలకు ఉన్న రుణాలను నాలుగు విడతల్లో ఇస్తానని చెప్పి, ఇప్పటికే రెండు విడతల్లో మొత్తం చెల్లించాడు. దేశంలో ఆ విధంగా ఎవ్వరూ చేయలేదు. డ్వాక్రా సం«ఘాలను దోచుకుని, మోసం చేసిన వ్యక్తి చంద్రబాబునాయుడు. అయినా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. అసలు మనిషి జన్మ ఎత్తాడా అనిపిస్తుంది.

ఎవరు కుక్కలు?:
    ఇంకా చంద్రబాబు ఇంకో మాట చెబుతున్నాడు. 2 లక్షల కోట్ల రాష్ట్ర సంపదను జగన్‌గారు నాశనం చేశారని అన్నాడు. ఇక్కడ ఎకరం 20 కోట్లు విలువ చేసే విధంగా రైతులకు మేలు చేయాలని చూస్తే, జగన్‌గారు ప్రభుత్వ ఆస్తులను నాశనం చేస్తూ, అప్పులు చేసి నిరుపేదలకు పంచుతూ, ఈ రాష్ట్ర సంపదను కుక్కలపాల్జేశారని చంద్రబాబు విమర్శించారు. 
    అసలు ఎవరు నీ దృష్టిలో కుక్కలు. జగన్‌గారు ఇచ్చిన ఆసరాలో సహాయం పొందిన కుటుంబాలా. లేకపోతే జగన్‌గారు ఇచ్చిన పెన్షన్లు తీసుకున్న కుటుంబాలా. జగన్‌గారు ఇచ్చిన అమ్మ ఒడి సహాయం తీసుకున్న తల్లులా. లేకపోతే నవరత్నాలులో 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు తీసుకున్న నిరుపేదలా.. అసలు నీ దృష్టిలో ఎవరు కుక్కలు. ఈ రాష్ట్ర సంపదను కుక్కలపాలు చేయడమంటే ఏమిటి.
    రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు, కరోనా సమయంలో ఆయా కుటుంబాలను ఆదుకోవాలని లక్షల కోట్లు ఇస్తే, వారిని కుక్కలు అంటే, చంద్రబాబుకు ఏం శిక్ష వేయాలి.
    కేవలం 11 లక్షల రైతులకు రూ.5 లక్షల కోట్లు దోచి పెట్టాలని నీవు అనుకుంటే, రాష్ట్రంలోని కోటిన్నర నిరుపేద కుటుంబాలకు జగన్‌గారు దాదాపు రూ.2 లక్షల కోట్లు వివిధ పథకాల ద్వారా ఆదుకుంటే, వారిని కుక్కలు అంటున్నావు. 
    జగన్‌గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు. పేదలను ఆదుకుంటారు. ఆయన బతికి ఉన్నంత వరకు రాష్ట్రానికి ఆయనే సీఎంగా ఉంటారు. నీవు ఎన్ని కుట్రలు చేసినా, ఆయనను ఏం చేయలేవు.

పల్లెకారులపై నిందలా:
    డ్రగ్స్‌ను మత్స్యకారులు పడవల్లో సరఫరా చేస్తున్నారని నీ పార్టీ వారు ఆరోపించారు. అంటే 940 కిమీ తీరం ఉన్న రాష్ట్రంలో ఆ ప్రాంతాల్లోని  పల్లెకారులు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నారా. అసలు నీకు సిగ్గుందా. నీ కులానికి చెందిన పట్టాభిని కాకినాడకు పంపించి మాట్లాడించావు. మత్స్యకారులను మాదకద్రవ్యాలు సరఫరా చేసే వ్యక్తులుగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తే, వారు తిరగబడ్డారు. దాంతో పారిపోయి వచ్చాడు.

ఎన్ని కుట్రలు చేసినా..:
    మీరు, జనసేన ఎన్ని నాటకాలు ఆడినా, ఎన్ని కుట్రలు చేసినా ఏమీ చేయలేరు. ఇక్కడ ఉన్నది యువ సింహం వైయస్‌ జగన్‌గారు. ఆయన పంజా దెబ్బలు నీవు, పవన్‌కళ్యాణ్‌ చాలా తిన్నారు. ఆయన మిమ్మల్ని చీల్చి చెండాడుతారు.

బీజేపీ ఆలోచించాలి:
    పవన్‌కళ్యాణ్‌గారు కమ్మ వారికి అండగా ఉంటానని చెప్పడం సిగ్గుచేటు. ఏ పార్టీ అయినా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు అండగా ఉంటామని చెబుతుంది. కానీ పవన్‌కళ్యాణ్‌ సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటానని చెప్పడం దారుణం.
ఇప్పటికైనా బీజేపీ ఆ పార్టీతో ఎలా కలిసి పని చేస్తుందో.. ఒక్కసారి ఆలోచించాలి.

ఫిర్యాదు చేసిందెవరు?:
    కమ్మవారికి మద్దతుగా ఉంటా. వారిని కంటికి రెప్పలా కాపాడతానని పవన్‌కళ్యాణ్‌ చెప్పాడు. అసలు ఏ కమ్మ వ్యక్తి పోయి తమకు రక్షణ లేదని పవన్‌కళ్యాణ్‌కు ఫిర్యాదు చేశారో చెప్పండి. బహుషా పవన్‌కళ్యాణ్‌కు చంద్రబాబు ఫిర్యాదు చేసి ఉంటాడు, జగన్‌గారు మా కమ్మరాజ్యం కూల్చేశాడని. తాను అధికారంలో ఉంటే, అన్ని ముఖ్య పదవులు కమ్మవారికి ఇచ్చి ఉండేవాడినని చెప్పుకుని ఉంటాడు. లేకపోతే రాధాకృష్ణ, రామోజీరావు, బీఆర్‌ నాయుడు ఫిర్యాదు చేసి ఉంటారు. అసలు వీరేనా కమ్మ వారు.
    ఆ నలుగురు జగన్‌గారిని ఎలాగైనా అధికారం నుంచి దింపేయాలని విపరీతంగా కష్టపడుతున్నారు. రాష్ట్రంలో ఆ నలుగురు మాత్రమే కమ్మవారున్నారని పవన్‌కళ్యాణ్‌ అనుకుంటున్నాడేమో. నిజానికి జగన్‌గారి ప్రభుత్వంలో మాకు అన్నీ అందుతున్నాయి. ఏదీ ఆగడం లేదు. ప్రభుత్వ పథకాలు అందడం లేదని ఏ ఒక్క కమ్మ కూడా ఫిర్యాదు చేసి ఉండడు.
కేవలం ఆ నలుగురు మాత్రమే పవన్‌కళ్యాణ్‌కు ఫిర్యాదు చేసి ఉంటారు. 

గౌరవంగా బతుకుతున్నాం:
    ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో ఎక్కడ, ఏ వ్యాపారం చేసుకుంటున్న కమ్మవారికి కూడా ఏ ఇబ్బంది లేదు. అందరూ బాగా తమ పని చేసుకుంటున్నారు. జగన్‌గారు కులం, మతం చూడరు. ఆయనకు కల్లా కపటం లేదు. అందరినీ ఆదరిస్తారు. అలాంటి ఆయన గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్న వారు అన్నం తింటున్నారో గడ్డి తింటున్నారో.
    మన మీద నమ్మకం ఉంటే, ఎవరైనా సరే అండగా నిలబడతారు. అయితే చంద్రబాబునాయుడు, పవన్‌కళ్యాణ్‌ ఇద్దరూ విశ్వసనీయత లేని నాయకులు. అందుకే వారి వెనక ఎవరూ నిలబడడం లేదు. చివరికి వారు బద్వేల్‌ ఉప ఎన్నికలో కూడా పారిపోయారు. ఎప్పుడు జెండా పీకేస్తారో, ఎప్పుడు పారిపోతారో తెలియదు. అలాంటి వారిని నమ్ముకుని ఎవరు ముందుకు వస్తారు.. అంటూ మంత్రి  కొడాలి నాని వ్యాఖ్యానించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top