చంద్రబాబూ..నీవు మనిషివా?.. దున్నపోతువా?

విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటన దురదృష్టకరం

ప్రజల భద్రతే మాకు ముఖ్యం

బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది

దేశంలో ఇంత పెద్ద ఆర్థిక సాయం చేసిన సీఎం వైయస్‌ జగన్‌ మాత్రమే

సీఎం వైయస్‌ జగన్‌ది మాట మీద నిలబడే వ్యక్తిత్వం

ఐఏఎస్‌లతో వేసిన కమిటీని చంద్రబాబు తప్పుబడుతున్నారు

బాబు వేసిన నిపుణుల కమిటీ జోకర్ల కమిటీ

హిందుస్థాన్‌ పాలిమర్స్‌ను ఎల్‌జీ పాలిమర్స్‌గా మార్చింది చంద్రబాబే

1998లో బాబు సీఎంగా ఉన్నప్పుడు అదే కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది

2017లో కూడా కంపెనీ విస్తరణకు బాబే పర్మిషన్‌ ఇచ్చారు

గోదావరి పుష్కరాల్లో చనిపోయిన వారు బతికి వస్తారని రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చారా?

ఆఖరి దశలోనైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకో..

మంత్రి కొడాలి నాని

తాడేపల్లి: గ్యాస్‌ లీకేజీ ఘటన దురదృష్టకరమని, ఇలాంటి సమయంలో చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు సీఎం వైయస్‌ జగన్‌ పెద్ద మనసుతో కోటి రూపాయల సాయం చేస్తే..ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు కనీసం మానవత్వం లేదని, ఆయన మనిషేనా? దున్నపోతా అని నిలదీశారు. ఎల్‌జీ పాలిమర్స్‌కు అన్ని అనుమతులు ఇచ్చింది చంద్రబాబేనని, ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగిందని, అప్పడేందుకు మూత వేయలేదని ప్రశ్నించారు. గోదావరి పుష్కరాల్లో చనిపోయిన కుటుంబాలకు రూ.3 లక్షల పరిహారం ఇచ్చారని, వారు బతికి వస్తారని ఆ సాయం చేశారా అని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పేర్నినానితో కలిసి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. కొడాలి నాని ఏమన్నారంటే..ఆయన మాటల్లోనే..

విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో విష వాయువులు లీక్‌ కావడం దురదృష్టకరం. ఈ ఘటనలో 12 మంది మృతి చెందడం, కొంత మంది తీవ్ర అస్వస్థతకు గురై వెంటిలేటర్‌పై ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్నారు. రకరకాలుగా ఇబ్బందులు పడుతున్న ప్రజానీకానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలని సీఎం వైయస్‌ జగన్‌. జరిగిన ఘటన దురదృష్టకరం. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి, ఆ గ్రామాల ప్రజలను ఆదుకునేందుకు ఆర్థికసాయం చేస్తామని, మెడికల్‌కు సంబంధించి హెల్త్‌ కార్డులు ఇచ్చి ప్రభుత్వం తోడుగా ఉంటుంది. ఈ సంఘటనపై ఐదుగురు ఐఏఎస్‌ అధికారులతో కమిటీ వేసి, ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? ఆ కమిటీ వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో గుర్తించాలని కమిటీకి సీఎం ఆదేశించారు. ఘటన జరిగిన వెంటనే సీఎం విశాఖకు వెళ్లారు. ఆసుపత్రిలో ఉన్న వ్యక్తులను పరామర్శించారు. ప్రతి ఒక్కరి యోగక్షేమాలు తెలుసుకున్నారు. చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయాలు ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నామని, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వారికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తూ, వారికి అయ్యే వైద్యం ఖర్చు అంతా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఆసుపత్రుల్లో చేరిన ప్రతి ఒక్కరికి లక్ష రూపాయాలు ఆర్థికసాయం చేస్తున్నామని మనసుçన్న ముఖ్యమంత్రిగా ఆ ప్రాంతాన్ని చూసి చలించి ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేసిన వ్యక్తి ౖÐð యస్‌ జగన్‌. ఐదుగురుమంత్రులను తీసుకెళ్లి, వారు వెంటనే గ్రామాలకు వెళ్లే పరిస్థితి ఉండదు కాబట్టి..గ్రామస్తులకు భోజనం, వసతి కల్పించాలని, తక్షణమే ఆ ప్రాంతంలో స్వచ్ఛమైన గాలులు వీచేలా చూడాలని అక్కడే సీఎస్‌ను, మంత్రులను ఉంచిన వ్యక్తి సీఎం వైయస్‌ జగన్‌. ఈ రోజు చనిపోయిన 12 మంది వ్యక్తుల కుటుంబ సభ్యులు పరిశ్రమ ఇక్కడే ఉంటే మాకు భద్రత ఉండదని ఆందోళన చేపట్టారు. మంత్రులు వెళ్లి బాధిత కుటుంబాలతో మాట్లాడారు. ఈ ఘటనపై, పరిశ్రమపై కమిటీ విచారణ చేస్తుందని, తప్పకుండా ఆ పరిశ్రమపై చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. మాజీ సీఎం చంద్రబాబు మొన్న, నిన్న ఇంట్లో దాక్కున్నారు. ఇవాళ పేపర్‌ పులి అయ్యారు. కేంద్రానికి, సీఎంకు లేఖలు రాశారు. ఈ ఘటనపై టీడీపీకి చెందిన ముగ్గురు వ్యక్తులతో చంద్రబాబు   కమిటీ వేశారు. ఆ కమిటీలో అచ్చెన్నాయుడు, డ్రామా నాయుడు అంటే పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు ఆయన ఏ రకంగా డ్రామా రక్తికటిస్తారో అందరికి తెలుసు. చిన్న రాజప్ప..ఈయన బ్రోకర్‌లాంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తులతో కమిటీ వేశారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఐఏఎస్‌లతో వేసిన కమిటీ పనికి రాదంటా?. కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ కూడా వాళ్ల దృష్టిలో పనికి రాదంటా? . చంద్రబాబు వేసిన ముగ్గురు చవట దద్దమ్మల కమిటీ బ్రహ్మండమైందంటా?. వాళ్లు అధ్యాయనం చేసి రిపోర్టు ఇస్తారట. అచ్చెన్నాయుడు పశువుల డాక్టర్‌ను పంపించమని మాకు లేఖ రాశారు. అచ్చెన్నాయుడికి వైయస్‌ జగన్‌పై అనుమానం వచ్చిందట?. చంద్రబాబులా తప్పుడు విధానాలతో నడివే వ్యక్తి కాదు వైయస్‌ జగన్‌. ఆస్తులు పోయినా, ఆయన జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చినా..కష్టాలు అనుభవించినా..ఇచ్చిన మాట కోసం మాట మీద, ప్రజల తరఫున నిలబడిన మగాడు వైయస్‌ జగన్‌. చంద్రబాబు మాదిరిగా అటు ఇటు కానోడు కాదు. అటు వెళ్తే వాళ్ల మాట..ఇటు వెళ్తే వీళ్ల మాటలు చెప్పి, అవసరం కోసం గోతులు తీసే రకం కాదు. వెన్నుపోటు పొడవడం వైయస్‌ జగన్, వైయస్‌ రాజశేఖరరెడ్డి రక్తంలో లేదు. ఈ రోజు నీతులు చెప్పే చంద్రబాబు..ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా 1998లో అదే కంపెనీలో ఫైర్‌ యాక్సిడెంట్‌ జరిగింది. ఆ రోజు చంద్రబాబు ఏం చేశారు. అనేక మంది గాయాలపాలై ఈ రోజు కూడా జీవచ్ఛవంలా మారారు. ఆరోజు చంద్రబాబు బ్రోకర్‌ పనులు చేశారు. హిందుస్థాన్‌ పాలిమర్స్‌ కంపెనీని కొరియన్‌కు చెందిన ఎల్‌జీ పాలిమర్స్‌గా చేసింది చంద్రబాబు కాదా?. ఆ రోజు జనం తçక్కువగా ఉన్నారంటూ నీతులు చెబుతున్నారు. అక్కడి కంపెనీని పెద్ద స్థాయిలో పెంచుకోమని 2017లో చంద్రబాబే అనుమతులు ఇచ్చారు.2019లో చంద్రబాబు దిగేపోయే సమయంలో ఆ కంపెనీ విస్తరణకు మరో ఐదేళ్ల గడువు పెంచింది ఈ దద్దమ్మ, మాటలు చెప్పే సన్యాసినే. ఆ రోజు చంద్రబాబు ఏ రకంగా అనుమతులు ఇచ్చారు.
కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇస్తే మనుషులు బతికి వస్తారా అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. ఇదే చంద్రబాబు గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే ఒక్కొక్కరికి రూ.3 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇచ్చారు. అంటే వాళ్లు బతికి వస్తారని ఎక్స్‌గ్రేషియా ఇచ్చారా?.ఆ రోజు పుష్కరాల్లో సినిమా షూటింగ్‌ పెట్టి, డైరెక్టర్‌ బోయపాటితో చంద్రబాబు, ఆయన భార్య, కుమారుడు కలిసి గోదావరిలో స్నానం చేసే సమయంలో షూటింగ్‌ పెడితే ..ఆ తొక్కిసలాటలో 29 మంది చనిపోయారు. 2014లో పైప్‌ లీక్‌ అయి 18 మంది చనిపోతే..గేల్‌ కంపెనీ వాళ్లు రూ.20 లక్షలు ఇస్తే..ఈ సన్యాసి ముష్టి రూ.3 లక్షలు ఇచ్చారు. ఆ ఘటన జరిగినప్పుడే వైయస్‌ జగన్‌ చెప్పారు..ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కంపెనీలకు భయం ఉండాలంటే బాధిత కుటుంబాలకు కోటిæ రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండు చేశారు. మాట తప్పని వ్యక్తి వైయస్‌ జగన్‌ కాబట్టి..ఆ కంపెనీ ఎంత ఇచ్చినా కూడా మేం మాత్రం కోటి రూపాయలు పరిహారం ఇస్తున్నామని పెద్ద మనసు చాటుకున్నారు. విశాఖ ఘటనను ఎల్లో మీడియా, చంద్రబాబు మనుషులు వింతగా మాట్లాడుతున్నారు. ఆ ప్రాంత ప్రజలకు వైయస్‌ జగన్‌ తోడుగా ఉంటే..వీళ్లు పుల్లలు పెట్టడం, పెట్రోలు పోయడం చంద్రబాబు దిక్కుమాలిన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడేనా? నిజంగా నీవు మనిషివా? దున్నపోతువా? . హైదరాబాద్‌కు వెళ్లి 50 రోజులుగా ఉంటున్నావ్‌. ఆ రోజు మోదీని ఏపీలో కాలు పెట్టనివ్వమన్నావు. ఇవాళ అదే మోదీని ఏపీకి వచ్చేందుకు బతిమాలుకుంటున్నావు. సిగ్గుశరం లేకుండా లేఖలు రాస్తున్నారు. చంద్రబాబు వైజాగ్‌ వస్తే ఎవరూ ఆపుతారు. అక్కడికి వెళ్తే 70 ఏళ్ల వయసులో కరోనా అంటుకుంటుందేమో అంటూ డ్రామా కమిటీ వేశారు. అద్దాల మేడ నుంచి బయటకు రాడు. జూమ్‌ మీడియాలో మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్నారు. చంద్రబాబూ..వయసు పెరిగినంత మాత్రనా ఫలితం ఉండదు. బుద్ధి పెంచుకో..ఇలాగే వ్యవహరిస్తే నీకు ఉన్న ప్రతిపక్ష నేత హోదా కూడా పోతుంది. చంద్రబాబు సీఎం వైయస్‌ జగన్‌పై, ప్రభుత్వంపై విమర్శలు చేస్తే జనాలు నవ్వుతున్నారన్నది గుర్తు చేసుకో..సోషల్‌ మీడియాలో నాడు–నేడు అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. సిగ్గు తెచ్చుకో..
కరోనా బా«ధితులను రక్షించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. కరోనా కేసులు దాయాల్సిన అవసరం లేదు. దేశంలోనే అత్యధిక టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఏపీనే. క్వారంటైన్‌లో అన్ని రకాల ఏర్పాటు చేశాం. పెద్దలు, చిన్నపిల్లలు ఇళ్లలోనే ఉండాలని సీఎం వైయస్‌ జగన్‌ చెబితే చంద్రబాబు ఎగతాలి చేశారు. కరోనా వైరస్‌ వచ్చినా కూడా భయపడాల్సిన అవసరం లేదని ప్రజలకు వైయస్‌ జగన్‌ భరోసా కల్పిస్తుంటే..చంద్రబాబు కరోనా సోకితే పైకి పోతారని అద్దాల రూమ్‌లో ఉంటూ ఆక్సిజన్‌ పెట్టుకొని జీవిస్తున్నారు. ఇంకా చంద్రబాబు ఐదేళ్లు, పదేళ్లు ఉంటారో తెలియదు. ఆఖరి దశలోనైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల మన్ననలు పొందాలని, చనిపోయే సమయానికైనా మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకో వెన్నుపోటుదారుడా? కుట్రదారుడా? ఉత్తర కుమార ప్రగల్భాలు పలికి మోదీని అదిచేస్తా..ఇది చేస్తానని చెప్పి..ఇవాల ఆయన చంక నాకడానికి  ప్రయత్నిస్తున్నారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకుంటావన్న నీ నక్క బుద్ధి మోదీకి కూడా తెలుసు అని కొడాని నాని చంద్రబాబుకు చురకలంటించారు.

 

Back to Top