చంద్రబాబువి దొంగ దీక్షలు

మంత్రి కొడాలి నాని
 

విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబు నిన్న విజయవాడలో చేసింది దొంగ దీక్ష అని మంత్రి కొడాలి నాని విమర్శించారు.గతంలో టీడీపీ నేతలు పంచభూతాలను దోచుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు అండ్‌ కో వేల కోట్ల ఇసుకను దోచేశారని విమర్శించారు. సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. ఆరోపణలపై ఆధారాలు చూపించమంటే చంద్రబాబు పారిపోయారన్నారు. చంద్రబాబుకు దీక్ష చేసే అర్హత లేదని స్పష్టం చేశారు.ఇసుక దోపిడీని అడ్డుకున్న అధికారులపై టీడీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారని నాని గుర్తు చేశారు. లోకేష్‌ కనుసన్నల్లోనే బ్లూఫ్రాగ్‌ ద్వారా కృత్రిమ  ఇసుక కొరత సృష్టించారని పేర్కొన్నారు. దేవినేని ఉమా పెద్ద ఇసుక మాఫియా కింగ్‌ అని విమర్శించారు.

Read Also: బీసీలపై బాబు కపట ప్రేమ

తాజా ఫోటోలు

Back to Top