తాడేపల్లి: సీఎం వైయస్ జగన్ ముందుచూపు వల్లే వరదల్లో ఒక్క ప్రాణనష్టం జరగకుండా చూశామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు అదనంగా బోట్లు, హెలికాఫ్టర్లు సిద్ధం చేస్తున్నామని అన్నారు. గోదావరికి ఎన్నడూ లేనంతగా ఉధృతంగా వరదలు వచ్చాయని.. ముందుగానే ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి వరదలపై అధికారులను అలర్ట్ చేశారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎక్కడికక్కడ క్యాంపులు పెట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అనేక చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. గతంలో జిల్లాకు ఒక కలెక్టర్, ఒక జేసీ ఉండేవారు. ఇప్పుడు జిల్లాల విభజన వల్ల అధికారుల సంఖ్య పెరిగింది. వలంటీర్లు, గ్రామ సెక్రటేరియట్ ఉద్యోగులు, మంత్రులు సమన్వయంతో పని చేశారు. జిల్లాకు రెండు కోట్లు, నాలుగు కోట్లు చొప్పున కేటాయించారు. నిత్యావసర వస్తువులు, బిస్కెట్లు, పాలు, కిరోసిన్ అందించాం. సీఎం ఏరియల్ సర్వే నిర్వహించారు. అధికారులతో రెగ్యులర్‌గా మానిటరింగ్ చేశారని’’ మంత్రి అన్నారు. గతంలో చంద్రబాబు ఏరియల్ సర్వే విహార యాత్రలా చేసేవారని మంత్రి దుయ్యబట్టారు. టీడీపీ కార్యకర్తలు, అభిమానులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఈనాడు పత్రికలో పిల్లలకు పాలు లేవు, పెద్దలకు తిండి లేదంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబును జాకీలు పెట్టి ఎల్లో మీడియా లేపుతోందని మండిపడ్డారు. ఎల్లో పత్రికల్లో రాసినవి.. చంద్రబాబు ప్రెస్ మీట్లు, పవన్ ట్వీట్లు పెడుతున్నారు. రామోజీ దిగజారి చీప్‌గా ప్రవర్తిస్తున్నారని మంత్రి కారుమూరి నిప్పలు చెరిగారు. చంద్రబాబు పాలనలో వర్షాలు కూడా పడలేదు. సీఎం వైయస్ జగన్ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. నా రాజకీయ జీవితంలో వైయస్ఆర్‌సీపీ ప్లీనరీకి వచ్చిన జనాల్ని ఎప్పుడూ చూడలేదు. చంద్రబాబు చేసేవన్నీ చీప్ పాలిటిక్స్ అంటూ మంత్రి నాగేశ్వరరావు మండిపడ్డారు.