క్రాప్‌ ప్లానింగ్, ప్రత్యామ్నాయ పంట‌ల‌పై జేసీలు దృష్టిపెట్టాలి

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆదేశం

విజయవాడ: క్రాప్‌ ప్లానింగ్, ప్రత్యామ్నాయ పంటలపై జాయింట్‌ కలెక్టర్లు దృష్టిసారించాలని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి కన్నబాబు సమీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఖరీఫ్‌ సన్నద్ధతపై జిల్లాల వారీగా సమీక్షించారు. వైయస్‌ఆర్‌ పొలంబడి, విత్తనాలు, ఎరువుల సరఫరాపై ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. వైయస్‌ఆర్‌ రైతు భరోసా కేంద్రాల్లో మౌలిక సదుపాయల కల్పనపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. జూలై 8 దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్నామని, అదే రోజున కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు, హబ్‌లు ప్రారంభిస్తామన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top