పవన్‌ సినిమాలు వదిలినా.. యాక్టింగ్‌ వదల్లేదు

సీఎం వైయస్‌ జగన్‌ను చూసి సంస్కారం నేర్చుకో

రెండు చోట్ల నిలబడిన నిన్ను ప్రజలే తరిమికొట్టారు

ఒక్కచోట గెలవకపోయినా.. భూమి మీద నిలబడలేకపోతున్నాడు

టీడీపీ అజెండా అమలు చేస్తున్న పవన్‌ బాబుకు దత్తపుత్రుడే

కారు డిక్కీలో కూర్చొని టీ, మట్టిపిడతల్లో పెరుగన్నం పబ్లిసిటీ స్టంట్లు

ఎంపీ విజయసాయిరెడ్డి చదువేంటీ.. నీ చదువేంటీ పవన్‌..?

కనీస విషయ పరిజ్ఞానం పెంచుకొని మాట్లాడితే మంచిది

ఇసుకపై గుంటనక్కలా తెలుగుదేశం పార్టీ రాజకీయం

వరదలు తగ్గగానే ఇసుక సమస్య పరిష్కరిస్తాం

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

కాకినాడ: పవన్‌ కల్యాణ్‌ సినిమాలు వదిలినా.. యాక్టింగ్‌ వదల్లేదని, పవన్‌ డ్రామాలు చూసి ప్రజలంతా నవ్వుకుంటున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్‌ యాక్టింగ్‌ పండడం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు దత్తపుత్రుడు అంటే పవన్‌కు కోపంతో లాంగ్‌ మార్చ్‌ చేశాడు కానీ, భవన నిర్మాణ కార్మికులపై చిత్తశుద్ధితో కాదని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. కార్మికుల సంక్షేమ నిధిని కాజేసిన అచ్చెన్నాయుడిని పక్కనబెట్టుకొని మాట్లాడిన పవన్‌కు కార్మికుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. మాట్లాడితే నీ బతుకు నాకు తెలుసని అంటున్నాడని, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మన బతుకులు కాదు ప్రజల బతుకుల గురించి ఆలోచించాలనే కనీసం జ్ఞానం కూడా పవన్‌కు లేదా అని ప్రశ్నించారు. రాజకీయాల్లోకి తీసుకువచ్చిన చిరంజీవిని ఇప్పటికీ మర్చిపోలేదని, కానీ పవన్‌ కల్యాణ్‌ రాజకీయాల్లోకి వచ్చాక చిరంజీవి పేరు ఎక్కడైనా ప్రస్తావించాడా..? సినిమాల్లోకి వచ్చినప్పుడు చిరంజీవి తమ్ముడని చెప్పుకున్న పవన్‌ ఇప్పుడు కానిస్టేబుల్‌ కొడుకుని, పోస్టుమెన్‌ మనవడిని అని కొత్తగా బ్రాండింగ్‌ చేసుకుంటున్నాడన్నారు.

కాకినాడలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ‘40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అని ప్రచారం చేసుకున్న నాయకులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. నాలుగు ఐదు నెలల్లోనే సీఎం వైయస్‌ జగన్‌కు ఇంత పేరు వస్తే మనకు, మన పార్టీకి పుట్టగతులు ఉండవని భయం పట్టుకొని ఏదో ఒకటి చేయాలని ఇసుకను చంద్రబాబు, పవన్‌ ఒక ఆయుధంగా చేసుకున్నారు. ఇసుక దాచేసినట్లుగా.. ప్రభుత్వం తప్పు చేస్తున్నట్లుగా గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారు. పెద్ద ఎత్తున వరదలతో అన్ని ప్రాజెక్టులు నిండాయి. నదులు పొంగిపొర్లుతున్నాయి. ఇసుక తీసే పరిస్థితి లేదు. ఇసుకలో తెలుగుదేశం పార్టీ నాయకుల అవినీతి అరికట్టాలని పాలసీ తీసుకువచ్చారు. పాలసీ అమలు చేస్తున్న తరుణంలో డిమాండ్‌కు సప్లయ్‌కి అంతరం పెరిగింది. దీన్ని పరిష్కరించడం కోసం సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాలు కూడా ఇచ్చారు. వాగుల్లో, వంకల్లోని ఇసుక ఎమ్మార్వో అనుమతితో తీసుకోవచ్చని ఆదేశాలు కూడా ఇచ్చాం. వరదలు తగ్గగానే ఇసుక తీస్తాం. కానీ వచ్చే పరిణామాలను రాజకీయంగా అందిపుచ్చుకోవాలని గుంటనక్కలాగా తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తుంది.

తెలుగుదేశం పార్టీని కష్టాల్లో ఆదుకునే నాయకుడు పవన్‌. కష్టాల్లోంచి పైకిలాగాలని తాపత్రయంతో కిందకు లాగేస్తున్నాడు. ఇసుకను పవన్‌ భుజాల పెట్టారు. విశాఖలో పవన్‌ రెండున్నర కిలోమీటర్ల లాంగ్‌ మార్చ్‌ కారు మీద నిలబడి చేశారు. పవన్‌కు సమస్య మీద కనీస అవగాహన ఉందా..? భవన నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడే అర్హత పవన్‌కు లేదు. అచ్చెన్నాయుడు గతంలో కార్మిక శాఖ మంత్రిగా ఉండి భవన కార్మికుల నిధులను పక్కదారి పట్టించాడు. అచ్చెన్నాయుడి భుజం మీద చేయి వేసి మాట్లాడిన పవన్‌కు ఇసుక గురించి, కార్మికుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.
అయ్యన్నపాత్రుడి కుమారుడు చిరంజీవి గురించి అసభ్యంగా మాట్లాడారు. ఆ వీడియో పవన్‌ విన్నారా..? లేదా మమ్మల్ని పంపించమంటారా..? అలాంటి వారినే పక్కనబెట్టుకొని పవన్‌మాట్లాడాడు.

పవన్‌ను దత్తపుత్రుడు అంటే కోపం వచ్చింది కానీ, భవన నిర్మాణ కార్మికుల మీద ప్రేమతో కాదు. చంద్రబాబు ఎజెండాను అమలు చేసే వారిని దత్తపుత్రులు అనకపోతే మరేమంటారు. మైక్‌ పట్టుకొని ఇస్టీరియా వచ్చినట్లుగా ఊగిపోతున్నాడు. సినిమాలు వదిలేసినా.. యాక్టింగ్‌ వదల్లేదు. పవన్‌ కల్యాణ్‌ డ్రామాలతో ప్రజలు నమ్ముకుంటున్నారు.

మట్టిపిడతల్లో పెరుగన్నం తినడం. కారు డిక్కీలో కూర్చొని టీ తాగడం, రైల్లో టాయిలెట్‌ పక్కన కూర్చొని పుస్తకాలు చదువుతుంటాడు. రైల్లో టాయిలెట్‌ పక్కన రెండు నిమిషాలు ఉండేందుకే మనం జంకుతాం. మట్టిపిడతలు ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతున్నాయా..? గిరిజన ప్రాంతాల్లోకి వెళ్లినా ప్లేట్లు ఇస్తున్నారు. మట్టిపిడతల్లో తింటూ ఫొటోలకు ఫోజులు ఇస్తున్నాడు. ఆవులకు అరటిపళ్లు పెడుతూ ఫొటో షూట్‌.. ఈ రాష్ట్రంలో గోమాతలను పూజించేవారు అనేక మంది ఉన్నారు. ప్రతిరోజు అరటిపండ్లు పెడుతూనే ఉంటారు.. వారు సోషల్‌మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారా..?

చంద్రబాబు తప్ప వేరే నాయకుడు ఉన్నాడని పవన్‌ కల్యాణ్‌ అనుకోడేమో. అందుకే చంద్రబాబు స్క్రీప్టు రెడీ చేయగానే యాక్టింగ్‌ చేయడానికి వస్తుంటాడు. చంద్రబాబు డైరెక్షన్‌ అయితే ఆ యాక్టింగ్‌లు మనేయండి పవన్‌ సీన్‌ పండడం లేదు. సీఎం వైయస్‌ జగన్‌ అంటే పవన్‌కు జెలస్‌.. సీఎం వైయస్‌ జగన్‌తో పవన్‌కు పోలిక ఏంటీ..? ఒక్కచోట గెలవని నువ్వే భూమి మీద నిలబడడం లేదు. రాజకీయం అంటే వైయస్‌ జగన్‌ను చూసి నేర్చుకో.. ఎదిగే కొద్ది ఒదగమనే సూత్రానికి నిదర్శనం వైయస్‌ జగన్‌. వైయస్‌ జగన్‌ను చూసి సంస్కారం నేర్చుకో.. పవన్‌.

తూర్పుగోదావరి జిల్లా కరపకు పోలింగ్‌కు మూడ్రోజుల ముందు వచ్చి అరగంట నన్ను తిట్టాడు. తరిమికొట్టమని ప్రజలకు పిలుపునిచ్చాడు. కానీ రెండు చోట్ల నిలబడిన పవన్‌ను ప్రజలు తరిమికొట్టారు. నీ బతుకు గురించి తెలుసు అని మాట్లాడుతున్నాడు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజల బతుకుల గురించి ఆలోచించాలనే జ్ఞానం పవన్‌కు ఉండాలి. ఇవాల్టికి చిరంజీవి వల్లే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకుంటా.. కానీ పవన్‌ రాజకీయాల్లోకి వచ్చాక చిరంజీవి పేరు ఎప్పుడైనా చెప్పాడా..? కానిస్టేబుల్‌ కొడుకుని, పోస్టుమెన్‌ మనవడిని అని కొత్త బ్రాండింగ్‌ చేసుకునే ఆలోచన. ఎంపీ విజయసాయిరెడ్డిని కూడా అవమానించే రీతిలో మాట్లాడుతున్నాడు.. ఆయన ఏం చదివాడు.. నువ్వు ఏం చదివావు పవన్‌. రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రం కోసం పనిచేస్తున్నారు’. పవన్‌ కల్యాణ్‌ అవగాహన పెంచుకొని మాట్లాడాలని మంత్రి కన్నబాబు చురకలు అంటించారు.  

Read Also: ప్రతి జిల్లాలో యువజనోత్సవాలు

Back to Top