ప్రతి జిల్లాలో యువజనోత్సవాలు

యువత నైపుణ్యం పెంపుదలకు ప్రాధాన్యత

వ్యక్తిత్వ వికాసంపై యువతకు శిక్షణా కార్యక్రమాలు

మంత్రి అవంతి శ్రీనివాస్‌

సచివాలయం: ప్రతి జిల్లాలో యువజనోత్సవాలు నిర్వహిస్తామని పర్యాటక, క్రీడల శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. యువత నైపుణ్యం పెంపుదలకు ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. వ్యక్తిత్వ వికాసంపై యువతకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.  వరల్డ్‌ హార్ట్‌ డే, నేషనల్‌ సైన్స్‌, గాంధీ జయంతి వంటి వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. స్త్రీల పట్ల గౌరవం పెంపొందించే కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందన్నారు. మత్తు, మద్యం వల్ల కలిగే అనార్థాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. మానవ సంబంధాలు బాగా దెబ్బతింటున్నాయని చెప్పారు. సోషల్‌ మీడియాపై కూడా దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. సంస్కృతి, సాంప్రదాయలను గుర్తించే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.  ప్రభుత్వ కాలేజీలు, యూనివర్సిటీల్లో అవగాహన సదస్సులు నిర్వహించాల్సి ఉందన్నారు. 

Read Also: ఒప్పందాల ప్రకారం మరింత బొగ్గు సరఫరా చేయాలి

Back to Top