పోడియంలో బైఠాయిస్తే ఢీ అంటే ఢీ అంటారా..? 

మీడియా హెడ్డింగ్‌లను అట్రాక్ట్‌ చేయడమే బాబు ఆలోచన

మేనిఫెస్టోను ఆన్‌లైన్‌లోంచి, వెబ్‌సైట్‌లోంచి తొలగించే పార్టీ మాది కాదు

ఎన్నికల ప్రణాళికను పవిత్ర గ్రంధంగా భావిస్తున్నాం

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

అసెంబ్లీ: మీడియా హెడ్డింగ్‌లను అట్రాక్ట్‌ చేయాలనే ఆలోచనతోనే చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని, తనను తాను మార్కెట్‌ చేసుకోవడానికి చట్ట సభను వాడుకుంటున్నాడని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. చంద్రబాబు రాసిన ‘మనసులో మాట’ పుస్తకంలో 143 పేజీలో ‘మన బలహీనతలు మనకు తెలిస్తే వాటిని తొలగించుకునే వ్యూహాలను నిర్మించుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే మనల్ని మనం మార్కెట్‌ చేసుకోవాలి.. ఇది నిరంతరంగా జరగాలి’ చంద్రబాబు నమ్మిన సిద్ధాంతాలు ఇవేనని ఎద్దేవా చేశారు. 

అసెంబ్లీలో మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. గత మూడు రోజులుగా చూస్తే సభలో ఏదో విధంగా డ్రామా క్రియేట్‌ చేసి సస్పెండ్‌ వరకు తెచ్చుకొని బయటకు వెళ్లిపోవాలి. మీడియా హెడ్డింగ్‌లను అట్రాక్ట్‌ చేయాలనేది చంద్రబాబు ఆలోచన. చంద్రబాబు తనను తాను మార్కెట్‌ చేసుకునే వ్యూహానికి చట్టసభను వాడుకుంటున్నారు. మూడు రోజులుగా మీడియాలో సీఎంతో చంద్రబాబు ఢీ అంటే ఢీ అని రాస్తున్నారు. ఒక్క రోజు అయినా చంద్రబాబు నిర్మాణాత్మక విమర్శ చేసి.. తప్పును ఎత్తి చూస్తే ఢీ అంటే ఢీ అంటారు. 40 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి పోడియంలో బైఠాయిస్తే ఢీ అంటే ఢీ అంటారా..? 

నిన్న సభలో చంద్రబాబు లేనందుకు బాధపడుతున్నాం.. పోలవరంపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చాలా విపులంగా వివరించారు. బాబు ఉండి ఉంటే ఆయనకు ప్రాజెక్టుపై పూర్తి అవగాహన వచ్చేది. మేనిఫెస్టోను పవిత్ర గ్రంధంగా మా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్, మేము భావిస్తున్నాం. 1వ తేదీన తలుపుకొట్టి పెన్షన్‌ ఇస్తున్నాం. మేనిఫెస్టోలోని అంశాలతో పాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నాం. గెలిచిన వెంటనే మేనిఫెస్టోను ఆన్‌లైన్‌లోంచి, వెబ్‌సైట్‌లోంచి మేనిఫెస్టోను తొలగించే పార్టీ మాది కాదు’ అని మంత్రి కన్నబాబు అన్నారు. 

 

Back to Top