రైతుల గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు

వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు

రైతు సంక్షేమ ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటున్నాం

సీఎం వైయస్‌ జగన్‌ రైతు పక్షపాతి 

ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటున్న లోకేష్‌ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు

పంట నష్టం జరిగిన వెంటనే ఇన్‌ఫుట్‌ సబ్సిడీ అందిస్తున్నాం

దేశంలో ఎక్కడాలేని విధంగా రైతు సంక్షేమ కార్యక్రమాలు

33 శాతం పంట నష్టపోతేనే పరిహారమంటూ బాబు హయాంలోనే జీవో వచ్చింది

అబద్ధాలు మానుకోకపోతే మంగళగిరి సీన్‌ రాష్ట్రమంతా రిపీట్‌ అవుతుంది

ఆర్‌బీకేలను పంట కొనుగోలు కేంద్రాలుగా చేశాం

తాడేపల్లి: రైతుల గురించి మాట్లాడే హక్కు, అర్హత టీడీపీకి లేదని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మండిపడ్డారు. ఐదేళ్లు వ్యవసాయాన్ని పట్టించుకోని చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ ఇప్పుడు నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ..వైయస్‌ఆర్‌సీ ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని ధ్వజమెత్తారు. 33 శాతం పంట నష్టపోతేనే పరిహారమంటూ బాబు హయాంలోనే జీవో వచ్చిందని గుర్తు చేశారు. శుక్రవారం తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో కన్నబాబు మీడియాతో మాట్లాడారు. సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిత్యం వ్యవసాయం, అనుబంధ రంగాలపై సమీక్ష చేస్తూ..దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుకు మేలు చేసే కార్యక్రమాలు చేపడుతున్నాం. భవిష్యత్‌లో ప్రతి గ్రామంలోనూ రైతుకు అవసరమైన ప్రతి మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ఈ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం, వైయస్‌ జగన్‌ రైతు పక్షపాత ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటున్నారు. భవిష్యత్‌లో రైతులు దూరమవుతారని టీడీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అబద్ధాలు, అసత్యాలతో నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ..దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ అధినేత తనయుడు లోకేష్‌ కొత్తగా మాటలు నేర్చుకున్నట్లుగా ఎక్కువగా మాట్లాడుతున్నారు. జగన్‌ రెడ్డి అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మొన్నటి దాకా మీ తండ్రి, మీ ప్రభుత్వం రైతులకు ఏం చేశారో అందరూ చూశారు. మళ్లీ రైతుల ఓట్లు సంపాదించాలని వైయస్‌ జగన్‌పై బురద జల్లితే కలిసి వస్తాయని భావిస్తున్నారు. పచ్చి అబద్ధాల కథనాలు నమ్మే స్థితిలో ప్రజలు లేరు.
ఇవాళ మీడియాలో చూస్తే..33 శాతం పంటలు నష్టపోతే పరిహారం ఇవ్వారా అని లోకేష్‌ మాట్లాడింది చూశాం. లోకేష్‌కు అంత సమాచారం తెలుసుకోవాలనే ఆలోచన లేదు. మీ తండ్రీ నంబర్‌ 15ను 4.12.2015లో జీవో విడుదల చేశారు. 33 శాతం పంటలు నష్టపోతేనే పంట నష్టపరిహారం ఇవ్వాలని చంద్రబాబే తేల్చి చెప్పారు. రూల్స్‌ ఇచ్చినప్పుడు చంద్రబాబుకు ఇవన్నీ అవగాహన లేవనుకుంటున్నాం. గతాన్ని మరిచి ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ గురించి పూర్తిగా అవగాహన పెంచుకుంటే బాగుంటుంది. 33 శాతం నష్టపోతేనే పరిహారం ఇవ్వాలని వైయస్‌ జగన్‌ తెచ్చిన నిబంధన కాదు. కేంద్రం ప్రకారమే మేం అమలు చేస్తున్నాం. కేవలం రైతుల్లో అపోహ మాత్రమే క్రియేట్‌ చేసేలా లోకేష్‌ మాట్లాడుతున్నారు. రైతుల గురించి మాట్లాడే హక్కు, అర్హత టీడీపీకి లేదు. 2014లో జరిగిన నష్టాలకు కూడా కాలపరిమితి పూర్తి అయ్యేదాకా ఇవ్వని ప్రభుత్వం ఇవాళ రైతుల గురించి మాట్లాడేందుకు నోరు ఎలా వస్తుంది. ఆరోజు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ గురించి అడిగితే పట్టించుకోలేదు. ఇవాళ వైయస్‌ జగన్‌ ఏ సీజన్‌కు సంబంధించిన పరిహారం అదే సీజన్‌లో ఇచ్చారు. ఈ నెలాఖరుకల్లా పరిహారాన్ని పూర్తిగా రైతులకు అందజేస్తాం. అబద్ధాలు మీరు చెబితే రాసే పత్రికలు ఉన్నాయని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదు. లోకేష్‌ మీ తండ్రి మాదిరిగా అబద్ధాలు మాట్లాడితే..మళ్లీ మంగళగిరి సీన్‌ రాష్ట్రమంతా రిపీట్‌ అవుతుంది.
 రాష్ట్రంలో రూ.3 వేల కోట్లతో ధరల స్థీరికరణ నిధి ఏర్పాటు చేశాం. నష్టపోయిన రైతులను ఆదుకుంటున్నాం. రూ.3200 కోట్లతో వరి మినహా ధాన్యాన్ని కొనుగోలు చేశాం. మార్క్‌ఫెడ్‌ ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేశాం. రైతులకు చేసిన సేవలపై మీ ప్రభుత్వాన్ని, మా ప్రభుత్వానికి ఏమైనా పొంతన ఉందా  లోకేష్‌?.. మా వద్ద రైతులకు ఏం చేశామో రికార్డులు స్పష్టంగా ఉన్నాయి.
2014లో 20,905 మంది రైతుల నుంచి 2,84,984 క్వింటాళ్ల ధాన్యాన్ని ప్రోక్యూర్‌మెంట్‌ చేస్తే..మా ప్రభుత్వం వచ్చిన తరువాత 2019–2020లో గమనిస్తే..2,93,008 మంది రైతులకు 8,84,058 మెట్రిక్‌ టన్నులు రూ.361 కోట్లతో మేం కొనుగోలు చేశాం. దానికి, దీనికి ఏమైనా పొంతన ఉందా లోకేష్‌?. రాష్ట్ర చరిత్రలో 8.84 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తులను కొనుగోలు చేశాం. మీ వద్ద ఉంటున్న కాకి లెక్కలు మీరే రాసుకుంటున్నారా? మీ ఇష్టం వచ్చినట్లు అంకెలు తారుమారు చేయడం సరికాదు. అబద్ధాలు చెబుతున్న టీడీపీ రైతులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. 2014–2015లో కేవలం 200 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. 2019–2020లో 1063 కేంద్రాలు ఉంటే, 2020–2021 నాటికి 5982 కొనుగోలు కేంద్రాలను ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అన్ని రైతు భరోసా కేంద్రాలను కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. రైతులు ఎవరూ కూడా బయటకు వెళ్లకుండా సొంతూళ్లోనే పంటలు అమ్ముకునే వీలు కలిగించాం. ప్రతి పంటకు మద్దతు ధర కల్పించామని, చంద్రబాబు హయాంలో ఏ ఒక్క పంటకైనా మద్దతు ధర కల్పించారా అని మంత్రి కన్నబాబు ప్రశ్నించారు. అబద్ధాలు, అవాస్తవాలు మానుకోకపోతే టీడీపీకి రైతులే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
 

Back to Top