రైతులకు అండగా వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం 

మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి
 

అమ‌రావ‌తి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటోందని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. రెండో రోజు అసెంబ్లీ స‌మావేశాల్లో మంత్రి మాట్లాడారు.  నేలలను పునర్జీవింప చేస్తూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం. నిష్ణాతులైన ప్రకృతి వ్యవసాయ కార్యకర్తల ద్వారా నిబద్ధతతో అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నాం. పెద్ద ఎత్తున శిక్షణా కార్యక్రమాలు, వీడియోలు, నమూనాలు, రైతుభరోసా కేంద్రాలతో అనుసంధానం చేసి రైతులకు అండగా ఉంటున్నాం. విత్తనాలు, కిచన్ గార్డెన్స్, ప్రకృతి వ్యవసాయానికి ఇన్పుట్ ల సామూహిక తయారీ, ఉపకరణాలు, నిధులు అందుబాటులో ఉంచడం, స్వయం సహాయక సంఘాలను ఇందులో భాగస్వాములను చేయడం చేస్తున్నాం. దాదాపుగా 658 గ్రామీణ మండలాల్లో 3,009 ఆర్బీకేల్లో 3,730గ్రామ పంచాయితీల్లో ప్రకృతి వ్యవసాయాన్ని అమలు చేస్తున్నాం. 
2లక్షల నిరుపేద కుటుంబాలు ఈ కమ్యూనిటీ బేస్డ్ నేచురల్ ఫార్మింగ్ పద్ధతిలో పెరటి తోటల్ని, ప్రకృతి వ్యవసాయ విధానాల్లో పెంచుతున్నారు. 
టీటీడీతో అవగాహనా ఒప్పందం కుదర్చుకుని ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను శ్రీవారి నైవేద్యంలో వినియోగిస్తున్నారు. 175కోట్లతో 12 రకాల ప్రకృతి ఉత్పత్తులను టీటీడీకి సరఫరా చేస్తున్నాం. 
స్వయం మహిళా సంఘాల ద్వారా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ ప్రోత్సహిస్తున్నాం.
రైతులు వ్యాపారుల మధ్య మార్కెటింగ్ ఒప్పందాలు కుదర్చడమే కాక, రైతుబజార్లలో స్టాల్స్ ఏర్పాటు, వాటికి విలువలు జోడించడం, బ్రాండింగ్, మార్కెటింగ్ చేస్తున్నాం. అన్ని రకాల ఎగుమతులకు సంబంధించి ఫార్మర్ ప్రోడ్యూస్ ఆర్గనైజేషన్స్, రైతు ఉత్పత్తి సంఘాలకు మద్దతు ఇస్తున్నాం. 
పార్టిసిపేటరీ గ్యారెంటీ సిస్టం (PGC) కింద 1183మంది ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు సర్టిఫికేషన్ సులభతరం చేసాం.
ROSS ఉత్పత్తులను టీటీడీకి సరఫరా చేసేందుకు 25వేల మంది ప్రకృతి వ్యవసాయ రైతులకు సర్టిఫికేషన్ అందించాం. 
వీటి వల్ల రైతులకు నికర ఆదాయం గణనీయంగా పెరుగుతోంది, నేల నాణ్యత మెరుగుపడుతోంది, నీటి అవసరం తగ్గుతుంది, సహజ వ్యవసాయం వల్ల వరదలు, తెగుళ్లు, చీడపీడలను తట్టుకునే శక్తి పెరుగుతుంది. ఆరోగ్య ప్రయోజనాలు, పర్యావరణ ప్రయోజనాలు పెంచుతున్నాం. అంతర్ పంటలను కూడా పెంచుతున్నాం. దిగుబడులు ఖర్చలు పై అధ్యయనం చేసి రైతులకు సాయం అందిస్తున్నామ‌ని మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి తెలిపారు.

Back to Top