రైతే అసలైన శాస్త్రవేత్త అని నమ్మిన వ్యక్తి సీఎం వైయ‌స్ జగన్

మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి
 

గుంటూరు:  రైతే అసలైన శాస్త్రవేత్త అని నమ్మిన వ్యక్తి సీఎం వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి అని మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి తెలిపారు. ఏ సీజన్‌లో పంట నష్టం ఆ సీజన్‌లోనే అందిస్తున్న ఏకైన సీఎం వైయ‌స్ జగన్ కొనియాడారు. దేశంలోనే వందశాతం రైతు బీమా ప్రీమియం భరించిన ఏకైన రాష్ట్రం ఏపీ. చంద్రబాబు హయంలో అన్నీ కరువు కాటకాలే అని ఎద్దేవా చేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఏమన్నారంటే... ఆయ‌న‌ మాటల్లోనే

 

అందరికీ నమస్కారం, ప్రతి ఒక్కరికీ తెలిసినటువంటి విషయం, 2019 అక్టోబర్‌ 15న ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి ప్రతి ఏడాది క్రమం తప్పకుండా సీఎంగారు రూ. 13,500 ఆర్ధిక సాయం రైతాంగానికి అందిస్తున్నారు. 2019 నుంచి ఇప్పటివరకు రైతు భరోసా కింద రైతాంగానికి రూ. 27,062 కోట్లు విడుదల చేశారు మన సీఎంగారు. పంటనష్టం జరిగితే అదే సీజన్‌లో పంటనష్టాన్ని ఇవ్వాలని పెట్టుబడి రాయితీ కింద రూ. 1,912 కోట్లు నిధులు రైతాంగానికి ఇవ్వడం జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా నూటికి నూరు శాతం రైతులకు సంబంధించిన బీమా ప్రీమియం భరించిన దేశంలో ఏకైక సీఎం మన జగన్‌ గారు. సున్నా వడ్డీ రుణాలు ఇస్తున్నాం, రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుంచి విక్రయం వరకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. రైతే అసలైన శాస్త్రవేత్త అని నమ్మి వ్యవసాయ సలహా మండలిలు ఏర్పాటుచేసి లక్ష మంది రైతులతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. దురదృష్టం ఏంటంటే ఇవన్నీ కూడా కొన్ని పత్రికలకు కానీ, టీడీపీ నాయకులకు కానీ పట్టడం లేదు, దీనిని బట్టి ఏమర్ధమవుతుందంటే నాకు ఒక సామెత గుర్తుకొస్తుంది, గాడిదలకు ఏం తెలుసు, గంధపు చెక్కల వాసన అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉంటే కరువు విలయతాండవం ఆడాల్సిందే, తాగునీరు, సాగునీరుకు విలవిలలాడాల్సిందే, అందుకే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఒక రైతు దగ్గరకు వెళితే రైతును అడిగితే అన్నీ వస్తున్నాయి అని చెప్పి, చివరిగా మీ ఓటు ఎవరికి వేస్తావని సరదాగా అడిగితే ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న జగన్‌ గారికి కాకుండా మోసం చేసే చంద్రబాబుకు ఎందుకు వేస్తానని, తన బాషలో పాలిచ్చే పాడిగేదెను వదులుకుని మేత మేసే దున్నపోతును ఇంట్లో కట్టేసుకునే మూర్ఖుడు ఈ రాష్ట్రంలో ఎవడూ ఉండరన్నారు. రైతాంగానికి అన్ని విధాలా అండగా ఉంటున్న సీఎంగారికి రైతాంగం కూడా సంపూర్ణమైన ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాను. చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి, చేసినటువంటి ప్రతి వాగ్ధానాన్ని నిలుపుకుంటున్న సీఎంగారు ఈ రాష్ట్రానికి నిండు నూరేళ్ళు శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండేలా రైతులు ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 

పి. మేరిమ్మ, లబ్ధిదారు, రేవేంద్రపాడు, దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా

అందరికీ నమస్కారం, నేను ఒక పేద ఎస్సీ మహిళా కౌలు రైతును, నాకు సెంటు భూమి కూడా లేదు, ఆరు ఎకరాల పొలం కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నాను, అన్నా అందులో పసుపు, వరి, మొక్కజొన్న సాగుచేస్తున్నాను, మీరు పాదయాత్రలో చెప్పినట్లు నేను విన్నాను, నేను ఉన్నాను అన్న విధంగా మాట ఇచ్చిన విధంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు, గ్రామాల్లో గుడి, బడి ఉన్నాయి కానీ రైతుకు ఏ విలువ లేదు, మీరు మాత్రం ఆర్బీకే ఏర్పాటుచేశారు, కౌలు రైతులకు కూడా కార్డులు మంజూరు చేసి హక్కుని కల్పించారు. మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. కరోనా సమయంలో చాలా కష్టాలు పడుతున్న సమయంలో పసుపుకి రేట్‌ లేదు, రూ. 5,500 బయట ఉంటే మీరు మాత్రం రూ. 6,850 ప్రకటించారు, మాకు ఆర్బీకే సెంటర్‌ నుంచి ఫోన్‌ చేసి ప్రభుత్వం ప్రకటించిన రేట్‌కే మీరు అమ్ముకోండి అని చెప్పారు, ఆ రేట్‌కు అమ్ముకోవడంతో మాకు లాభం వచ్చింది. 2022 లో మేం పసుపు వేశాం, అది వర్షాలకు దెబ్బతింది, దానికి ఇన్సూరెన్స్‌ పరిహారం రూ. 80 వేలు జమ అయ్యాయి. చాలా సంతోషం, ఎవరూ చేయని విధంగా, ఎన్నడూ చూడని విధంగా మీరు నాలాంటి పేద రైతుకు అండగా నిలిచారు, ధన్యవాదాలు. కరోనా టైంలో మమ్మల్ని చాలా ఆదుకున్నారు. నాకు రైతు భరోసా వస్తుంది, యజమానితో సమానంగా కౌలు రైతుకు కూడా మీరు హక్కు కల్పించారు. నేను ఇప్పటికి రెండుసార్లు తీసుకున్నాను, ఇది మూడోసారి నాకు రూ. 13,500 రావడం, చాలా సంతోషంగా ఉంది. నేను టైలరింగ్‌ కూడా చేస్తాను, చేయూత సాయం వస్తుంది, డ్వాక్రా సంఘంలో సభ్యురాలిగా ఉన్నందుకు నాకు రెండేళ్ళుగా రూ. 12,500 జమ అయ్యాయి, రైతును వెన్నుతట్టి నేను ఉన్నాను అనే భరోసానిచ్చారు. నాకు రూ. 1,80,000 వచ్చాయి, మాది ఉమ్మడి కుటుంబం, మా తోడుకోడళ్ళకు చేయూత సాయం వస్తుంది, పిల్లలకు ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ వస్తుంది, అమ్మ ఒడి వస్తుంది, మా ఇంట్లోనే ఇళ్ళ స్ధలాలు వచ్చాయి, మీరు మాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు, మీరు పాదయాత్ర చేస్తే ప్రజలు బ్రహ్మరథం పట్టారు, కానీ మీరు వెళ్ళిన తర్వాత కొంతమంది వాటిని తుడిచేశారు, మరి ఇప్పుడు కొంతమంది పాదయాత్రలు చేస్తున్నారు, వాళ్ళు మాట్లాడే మాటలు విన్నాం, మరి వాళ్ళ నోటిని దేనితో కడగాలని అని ప్రశ్నిస్తున్నా, మీరు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను, సెలవు.


 

Back to Top