క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ‘ఆడుదాం ఆంధ్రా’

రాష్ట్రస్థాయి విజేతలకు సీఎం చేతుల మీదుగా బహుమతుల ప్రదానం

వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

నెల్లూరు: రాష్ట్రంలోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. క్రీడాకారుల ప్రతిభను గుర్తించి వారిలో ఉత్తేజాన్ని కలిగించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. ఆసక్తి గలవారంతా రిజిస్ట్రర్‌ చేసుకోవాలని కోరారు. మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడుతూ.. ఆడుదాం ఆంధ్రా రాష్ట్రస్థాయి విజేతలకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా బహుమతుల ప్రదానోత్సవం జరుగుతుందన్నారు. టీడీపీ నేత సోమిరెడ్డి తెల్లరాయి అక్రమ రవాణాపై హడావిడి చేస్తున్నాడని, మైనింగ్‌  యజమానులు కలిసిన తరువాత దాని గురించి సోమిరెడ్డి ఏమీ మాట్లాడటం లేదన్నారు. 

తాజా వీడియోలు

Back to Top