వచ్చే ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ మళ్లీ విజయభేరి 

మంత్రి జోగి రమేష్‌

విజయవాడ: వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మళ్లీ విజయభేరి మోగించబోతుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ అన్నారు. విజయవాడ బెంజ్‌ సర్కిల్‌కు సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర చేరుకుంది. మంత్రులకు వైఎస్సార్‌సీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాజిక న్యాయభేరి దెబ్బకి చంద్రబాబు కర్ణభేరి పగిలిపోయిందన్నారు. బడుగు, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేసింది సీఎం జగన్‌ మాత్రమేనన్నారు. సంక్షేమ పథకాల అమల తీరును చూసి చంద్రబాబుకు కడుపు మంట అని దుయ్యబట్టారు. సామాజిక న్యాయం ఒక్క ఏపీలోనే కొనసాగుతోందన్నారు.
 
‘‘1.40 లక్షల కోట్లని  సీఎం వైయ‌స్ జగన్ బటన్ నొక్కి నేరుగా ప్రజల అకౌంట్లలోకి సంక్షేమ పథకాల ద్వారా అందించారు. చంద్రబాబు వస్తే అన్ని పథకాలను రద్దు చేస్తాడట’’ అంటూ మంత్రి నిప్పులు చెరిగారు. రాబోయే 25 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొనసాగుతారు. ఎవరితో పొత్తు పెట్టుకున్నా సీఎం వైయ‌స్ జగన్‌ను ఓడించలేవంటూ’’ చంద్రబాబును మంత్రి జోగి రమేష్‌ దుయ్యబట్టారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top