మేక‌పాటి విక్ర‌మ్‌రెడ్డిని అత్య‌ధిక మెజార్టీతో గెలిపించాలి

ఏ.ఎస్‌.పేట మండ‌లంలో మంత్రి జోగి ర‌మేష్ ప్ర‌చారం

నెల్లూరు: ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిని అత్య‌ధిక మెజార్టీతో గెలిపించాల‌ని మంత్రి జోగి ర‌మేష్ ఓట‌ర్ల‌ను కోరారు. ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ఏ.ఎస్‌.పేట మండ‌లంలో పార్టీ అభ్య‌ర్థి విక్ర‌మ్‌రెడ్డి త‌ర‌ఫున‌ మంత్రి జోగి ర‌మేష్ ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఏ.ఎస్‌.పేటలో ఇంటింటికీ తిరిగి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ఓట‌ర్ల‌కు వివ‌రించారు. మూడేళ్ల పాల‌న‌లోనే మేనిఫెస్టోలోని అంశాల‌న్నీ అమ‌లు చేశార‌ని గుర్తుచేశారు. దివంగ‌త మంత్రి గౌత‌మ్‌రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో ఆత్మ‌కూరులో ఉప ఎన్నిక వ‌చ్చింద‌ని, గౌత‌మ్‌రెడ్డి సోద‌రుడు విక్ర‌మ్‌రెడ్డిని అత్య‌ధిక మెజార్టీతో గెలిపించాల‌ని కోరారు. ప్ర‌చారంలో మంత్రి జోగి ర‌మేష్ వెంట‌.. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారాకనాథ్‌ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top