దేశంలో అతిపెద్ద సముద్రతీరం ఉన్న రాష్ట్రం ఏపీ

మంత్రి గుడివాడ అమర్నాథ్‌

14 రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి ఎంవోయూలు జరుగుతాయి

పోర్టుల అభివృద్ధికి సంబంధించి పనులు వేగంగా జరుగుతున్నాయి

విశాఖ: దేశంలో అతిపెద్ద సముద్రతీరం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ తెలిపారు. పోర్టుల అభివృద్ధికి సంబంధించి పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. మార్చి 3,4వ తేదీల్లో విశాఖలో జరుగనున్న గ్లోబల్‌ మీట్‌ సమ్మిట్‌లో 14 రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి ఎంవోయూలు జరుగుతాయని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 14 సెక్టార్లను ఎంపిక చేస్తుకున్నామని తెలిపారు. విశాఖలో మంత్రి అమర్నాథ్‌ మీడియాతో మాట్లాడారు.

ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచానికి చెప్పేందుకు గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు నిర్వహిస్తున్నాం. దేశంలోనే అతిపెద్ద సముద్రతీరం కలిగిన రెండో రాష్ట్రంగా ఏపీ ఉంది.  మార్చి 3,4వ తేదీల్లో జరిగే గ్లోబల్‌ సమ్మిట్‌లో 14 ఢిపెరెంట్‌ సెక్టర్లలో మనం షోకేష్‌ చేయాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశించారు. ఎయిరో స్పెసెస్, ఐటీ, అగ్రికల్చర్‌ ఫుడ్‌  ప్రసెసింగ్, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎక్యుప్‌మెంట్, ఫార్మాసిటిల్, టూరిజమ్, హాస్పిటాలిటీస్, ఎంఎస్‌ఎం, ఇన్‌ఫ్రాక్చర్స్, ఇలా డిఫెరెంట్‌ మేజర్‌ సెక్టార్స్‌ను ఎంపిక చేసుకున్నాం. వీటిలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైనవి ఈ సదస్సులో ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 3వ తేదీ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఇనాగరేషన్‌ సెషన్‌ ఏర్పాటు చేశాం. అలాగే ప్రధానంగా ఒక ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశాం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నడుపుతున్న పరిశ్రమలు ఈ ప్రదర్శనలో వారి ఉత్పత్తులను చూపిస్తారు. పెట్టుబడులకు సంబంధించిన ఎంవోయూలు జరుగుతున్నాయి. దేశంలోని వివిధ పారిశ్రామిక వేత్తలు, ఇతర దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు. బ్రాండ్‌ అంబాసిడర్స్‌ రాబోతున్నారు. నిన్ననే యూరోపియన్‌ ఛాంబర్స్‌ వారు రెస్పాండ్‌ అయ్యారు. నూతనంగా రాష్ట్రంలో తీసుకురాబోతున్న పారిశ్రామిక విధానం 2020–2023కు సంబంధించి 2023 నుంచి 2028 వరకు రానున్న పాలసీలను కూడా అమలులోకి తీసుకురాబోతున్నాం. రేపు పెట్టుబడులకు సంబంధించి ఎంవోయూలు చేపట్టే వారు రానున్న ఆరు నెలల్లో ప్రత్యేక ప్రోత్సహకాలు ఉంటాయి. ఇండస్ట్రీయల్‌ పార్కుల అభివృద్ధికి సంబంధించి, విశాఖ–చెన్నై కారిడార్, విశాఖ– బెంగుళూరు కారిడార్లకు సంబంధించి ఈ సదస్సులో షోకేష్‌ చేయబోతున్నాం. 
జగనన్న బడుగు వికాసానికి సంబంధించి పాలసీలు, మెగా ఇండస్ట్రీయల్‌ హబ్, రిటైల్‌ పార్క్‌కు సంబంధించిన పాలసీలు, నూతనంగా దేశంలోని 17 నుంచి 19 రాష్ట్రాలు పోటీ పడితే బల్క్‌ డ్రగ్‌ పార్కును ఏపీలోని కాకినాడలో ఏర్పాటు చేశాం. కేంద్ర సహకారంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తోంది. 
విశాఖ–కాకినాడకు సంబంధించి పీసీపీఆర్‌ రీజన్‌ ఉంది. ఈ సెక్టార్‌కు సంబంధించి పెట్రో కెమికల్‌ సెక్టార్‌ ఉంది. దీనిపై దృష్టి పెడుతున్నాం. హిందుస్థాన్, ఓఎన్‌జీసీ, ఐవోసీఎల్, డెక్కన్‌ వంటి సంస్థలను ఆహ్వానిస్తున్నాం. ఏపీ మారిటైమ్‌ బోర్డు ద్వారా 4 పోర్టుల అభివృద్ధి, 9 ఫిషింగ్‌ హార్బర్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. పీపీపీ మాడల్‌లో కాకినాడలో ఇప్పటికే పోర్టు నిర్మాణం జరుగుతుంది. కోస్టల్‌ లైన్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు పనులు చేపడుతున్నాం. పోర్టులు ప్రతి ప్రాంతంలో పరిశ్రమలు ఉంటే బాగుంటుందని భావించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సీఎంవైయస్‌ జగన్‌ ఆదేశించారు. 5 వేల ఎకరాల్లో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆలోచన. ఇప్పటికే జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ ప్రారంభోత్సానికి సిద్ధంగా ఉంది. మిగిలినవి కూడా త్వరలోనే పూర్తిచేసేలా అడుగులు వేస్తున్నాం.
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌లో ఏపీ మొదటి స్థానంలో ఉంది. పపయ, ఫైనాఫిల్, టమాట ఉత్పత్తులు ఉన్నాయి. ఈ సెక్టార్‌ను కూడా మేజర్‌గా ప్రమోట్‌ చేయాలని సీఎం చెప్పారు. హ్యాండ్‌లూమ్‌ సెక్టార్, టెక్స్‌టైల్‌ సెక్టార్‌పై కూడా ఫోకస్‌ చేస్తున్నామని మంత్రి అమర్నాథ్‌ వివరించారు.

 

Back to Top