త్వరలోనే ఐటీ ఇండస్ట్రీ పాలసీ విడుదల

మంత్రి గౌతమ్‌రెడ్డితో దక్షిణ కొరియా ప్రతినిధుల బృందం భేటీ 
 

అమరావతి: ఎలక్ట్రిక్‌ వాహన రంగానికి ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక పాలసీ తెస్తామని మంత్రి గౌతంరెడ్డి  తెలిపారు. త్వరలోనే ఐటీ ఇండస్ట్రీకి సంబంధించిన పాలసీలను విడుదల చేస్తామని పేర్కొన్నారు. మంత్రి గౌతమ్‌రెడ్డితో దక్షిణ కొరియా ప్రతినిధుల బృందం భేటీ అయ్యింది. ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలపై ఈ బృందం చర్చించింది. రోబోయే ఐదేళ్లలో మౌలిక వసతుల కల్పన రంగాన్ని ప్రభుత్వం ఏవిధంగా అభివృద్ధి చేయాలనుకుంటుందో దక్షిణ కొరియా ప్రతినిధుల బృందానికి మంత్రి  గౌతంరెడ్డి వివరించారు.  విశాఖ కేంద్రంగా ఎగుమతుల కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు.నదులపైన అత్యాధునిక హంగులతో ప్రాజెక్టుల ఏర్పాటుకు దక్షిణ కొరియా ప్రతినిధుల బృందం ఆసక్తి చూపుతున్నట్లు మంత్రి వివరించారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top