అందరిని ఆదరించే గుణం వైజాగ్ సొంతం

శ్రీ‌కాకుళం  :  అందరిని ఆదరించే గుణం వైజాగ్ సొంతమ‌ని మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అన్నారు. స్థానిక పీఎన్ కాల‌నీ ప‌రిధిలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా రెవెన్యూ శాఖామాత్యులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు మాట్లాడారు. ప్ర‌జాభిప్రాయం తెలుసుకునేందుకే గ‌డప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నామ‌ని అన్నారు. విభిన్న అభిప్రాయాలు తెలుసుకుని, వాటి నుంచి త‌ప్పొప్పులు తెలుకుని మ‌రింత స‌మ‌ర్థంగా ప‌నిచేసేందుకు ఓ అవ‌కాశ‌మే ఈ గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం ముఖ్యోద్దేశం అని వివ‌రించారు. 

ఇంకా ఆయ‌న ఏం మాట్లాడారంటే.. మీతో నేను ఇంట్రాక్ట్ అవుతుంటూనే మాకు ఏది మంచి ఏది చెడు అన్నవి తెలుస్తాయి. ఇటువంటివి నిరంత‌రం జ‌రుగుతూనే ఉండాలి. ఆ విధంగా చేస్తేనే మార్పులూ చేర్పులూ అన్న‌వి సాధ్యం. ఇది బాధ్యత‌గా చేయాల్సిన కార్య‌క్ర‌మం. ఇవ‌న్నీ త‌రువాత ఎన్నిక‌లు కోసం కాదు.. ఎన్నిక అయిన ఏర్ప‌డిన ప్ర‌భుత్వం దాని ప్రాధాన్యాలు అనుస‌రించి చేయాల్సిన ప‌నులు ఇవి. వాటి కోసం వ‌చ్చామే త‌ప్ప, ఎన్నిక‌ల‌ను దృష్టి లో ఉంచుకుని నిర్దేశించిన కార్య‌క్ర‌మం అయితే ఇది కాదు. ఇప్పుడు ప్ర‌ధానం గా మార్పు  చూసే ఉంటారు. వ్య‌వ‌స్థ దానంత‌ట అది ప‌నిచేసుకునే ప‌ద్ధతి రావాలి. వెల్ డెవ‌ల‌ప్డ్ కంట్రీస్ లో ఇదే విధంగా జ‌రుగుతూ ఉంటుంది. ప్ర‌తి దానికీ ఓ నాయ‌కుడిపైనో లేదా ఓ మ‌ధ్య‌వ‌ర్తి పైనో ఆధార‌ప‌డే వ్య‌వస్థ పోవాలి. మ‌ధ్య‌వ‌ర్తుల ప్ర‌మేయం  లేకుండానే కొన్ని ప‌నులు జ‌రుగుతూ ఉండాలి. అభివృద్ధి చెందిన దేశాలకూ ప్ర‌భుత్వాల‌కూ, ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌ల‌కూ అది నిద‌ర్శ‌నం. అప్పుడే ప్ర‌జ‌లు హాయిగా నిర్భ‌యంగా అర్హ‌త‌ల మేర‌కు జీవించ‌డం జ‌రుగుతుంది. ఎప్పుడూ ఎవ‌రో ఒక‌రిని ఆశ్ర‌యించాలి.. వారిని ఆశ్ర‌యించ‌నిదే ఇవేవీ జ‌ర‌గ‌వు అన్న భావ‌న తీసేయ్యాలి. అది రానివ్వ‌కుండా చేయాలి. చేయాలి అంటే వ్య‌వ‌స్థ‌లో మార్పు చేయాలి. ఈ క్ర‌మంలో మొట్ట‌మొద‌టి సారిగా ప్ర‌భుత్వం మ‌ధ్య‌వ‌ర్తుల ప్ర‌మేయం లేకుండా ప‌థ‌కాల అమ‌లు లేదా వ‌ర్తింపు అన్న‌ది చేస్తున్న‌ది. అందుకు తార్కాణ‌మే కులం, మ‌తం, వ‌ర్గం, ప్రాంతం, పార్టీ అన్న‌వి చూడ‌కుండా అమలు చేస్తున్న ప‌థ‌కాలు. 

ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో మ‌న ప్ర‌భుత్వం చేసిన ప‌ని వ‌ల్ల ఓ మెట్టు ఎక్కించాం. ఇంత‌కుముందు ఆ విధంగా జ‌రిగేది కాదు. మ‌ధ్య‌వ‌ర్తుల ప్ర‌మేయంతోనే ప‌థ‌కాల వ‌ర్తింపు అన్న‌ది జ‌రిగేది. ఆ రోజు జ‌న్మ‌భూమి క‌మిటీలు చేసిందే ఇది. ఇప్పుడు క‌రప్ష‌న్ యాక్టివిటీ అన్న‌ది పోయింది. ఆ విధంగా అవినీతి ర‌హిత పాల‌న అందించ‌గ‌లుగుతున్నాం. రాజీవ్ గాంధీ లాంటి ప్ర‌ధాని చెప్పారు.. వెల్ఫేర్ స్కీంలు అన్న‌వి ల‌బ్ధిదారుల‌కు చేరేందుకు 90 శాతం అన్న‌ది సంబంధిత అర్హుల‌కు చేర‌కుండానే మ‌ధ్య‌వర్తుల కార‌ణంగానే ఆగిపోతున్నాయి. కానీ ఇప్పుడు ఆ విధంగా జ‌రిగేందుకు ఆస్కారం లేకుండా ఉంది. వ్య‌వ‌స్థ‌ను మార్పు చేస్తే ల‌క్షా అర‌వై ఐదు వేల కోట్ల రూపాయ‌లు వివిధ ప‌థ‌కాల రూపంలో అందించ‌గ‌లిగాం. ఇంత మొత్తం డైరెక్టుగా అర్హుల‌యిన ల‌బ్ధిదారుల‌కు అందించ‌గలిగాం. గ‌తంలో ఎన్నడూ ఈ విధంగా జరిగిన దాఖ‌లాలే లేవు. సిఫార‌సుల‌కు తావు లేకుండా ప‌థ‌కాల వ‌ర్తింపు అన్న‌ది ఇవాళ సాధ్యం. కార‌ణం ఏంటంటే ఇవాళ మేం తీసుకువ‌చ్చిన మార్పు కాదా ?
అదేవిధంగా విద్యారంగంలో మంచి మార్పులు చేశాం. బీద‌ల‌కు విద్య అందే విధంగా చేశాం. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ అక్ష‌రాస్య‌త‌లో దేశంలో 22 వ స్థానంలో ఏపీ ఉంది. ఇది త‌గ‌ద‌ని భావించి ఇప్పుడు అన్నింటా రిఫార్మ్స్ తీసుకుని వ‌చ్చాం. సంస్క‌ర‌ణ‌లు చేసే వారిపై వ్య‌తిరేక‌త ఉంటుంది. చాలా వ‌ర‌కూ సంస్క‌ర‌ణ‌లు అర్థం చేసుకోక‌పోవ‌డం వ‌ల్ల ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఉంది. కానీ నిజానికి చేస్తున్న వారిని నిందిస్తున్నారు. గ‌తంలోనూ ఇదే విధంగా ఉంది. కానీ అభివృద్ధి లేదు అని అంటారు. బుడ‌గ‌ట్ల పాలేం లో ఫిషింగ్ హార్బ‌ర్ , అలానే మూలపేట‌లో భావ‌న‌పాడు సీ పోర్ట్ ను 3 వేల కోట్ల రూపాయ‌ల‌తో నిర్మించ‌నున్నాం. 

వంశ‌ధార ప్రాజెక్టుకు ఒడిశా త‌గాదా కార‌ణంగా ఒక లిఫ్ట్ ఇరిగేష‌న్ ను మంజూరు చేయించాం. అలానే ఉద్దానం ప్రాంతంలో నెల‌కొన్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఊర‌ట ఇచ్చేవిధంగా, అదేవిధంగా అక్క‌డి జ‌లాల కార‌ణంగా వ‌స్తున్న వ్యాధిని నియంత్రించే విధంగా స‌ర్ఫేస్ వాట‌ర్ ను స‌ప్లై చేసేందుకు దాదాపు ఎనిమిది వంద‌ల కోట్ల రూపాయ‌ల‌తో  వంశ‌ధార నీటిని పైప్ లైన్ ద్వారా అందించేందుకు ఏర్పాటు చేశాం. ప‌లాస‌లో కిడ్నీ రోగుల కోసం యాభై కోట్ల‌తో ఆస్ప‌త్రి నిర్మాణం జ‌రుగుతోంది. ఎప్ప‌టి నుంచో ప్ర‌తిపాద‌న ద‌శ‌లో ఉన్న జిల్లాల పున‌ర్విభ‌జ‌న‌ను పూర్తి చేశాం. మ‌న ఆస్ప‌త్రి రిమ్స్ ను బాగు చేశాం. నిధులు ఇచ్చాం. ఏ ప్ర‌యివేటు ఆస్ప‌త్రి కి తీసిపోని విధంగా 900 ప‌డక‌ల‌తో తీర్చిదిద్దాం. అదేవిధంగా పెద్ద మార్కెట్ ను ఎన్నడూ లేని విధంగా డెవ‌ల‌ప్ చేశాం. 

ఇప్పుడున్న రోడ్లు అన్ని గత లో వేసినవే,మూడేళ్ల‌లో పాడ‌య్యాయి. వాటిని బాగు చేసేందుకు మేం సిద్ధం. ఇక రాజ‌ధాని విష‌యానికే వ‌స్తే.. 1969లో ఓ ఉద్య‌మం వ‌చ్చింది. త‌రువాత 2000 లో మ‌రోసారి తెలంగాణ ఉద్యమం వచ్చింది.ప్ర‌త్యేక ఉద్య‌మాలు ఊపందుతుకున్నాయి.  కారణం ఏదేమ‌యిన‌ప్ప‌టికీ హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. అక్కడ ఉన్న వారి స్వార్థం వల్లనే వచ్చింది. 75 సంవత్సరాలు అంతా ఒకే చోట పెట్టాము. శివరామకృష్ణన్ కమిటీ పెద్ద రాజధాని అవసరం లేదని చెప్పారు, అమరావతి ప్రాంతంలో వద్దనే చెప్పారు, చంద్రబాబు తన స్వార్థంతో అక్కడ పెట్టారు.

ఈ నేప‌థ్యాన విశాఖే రాజ‌ధాని అన్న నినాదం వినిపించేందుకు, ఉద్య‌మించేందుకు అవసరం అయితే నా గొంతు వినిపించేందుకు రాజీనామా చేయాలని అనుకున్నాను, వైజాగ్ సెంట‌ర్ లో లేదని కొంతమంది అంటున్నారు. అది త‌ప్పు త‌మిళ‌నాడు , మ‌హారాష్ట్ర  రాజ‌ధానులు చెన్నై,ముంబ‌యి ఎక్కడ ఉందో గమనించాలి. రాజధాని వస్తే ప్రైవేటు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. విశాఖ అన్నిటికి ఉపయోగపడుతుందని సీఎం జగన్ నమ్ముతున్నారు.అందరిని ఆదరించే గుణం వైజాగ్ సొంతం.న్యాయ రాజధానిగా కర్నూల్ ఉంటుంది.లెజిస్లేటివ్ కి అమరావతి ఉంటుంది. దేశంలో సుమారు 8 రాష్ట్రాల్లో ఈ విధంగా రాజధానులు ఉన్నాయి. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ అప్ప‌టిలాంటి త‌ర‌హాలో హైద్రాబాద్ ను అభివృద్ధి చేయవ‌ద్ద‌నే అని కేంద్రం నియ‌మించిన క‌మిటీ సిఫార‌సు చేసింది. హ్యూజ్ క్యాపిట‌ల్ వ‌ద్దే వ‌ద్ద‌ని అని చెప్పింది. కానీ ఇప్పుడు మారుతున్న ప‌రిణామాల నేప‌థ్యంలో మ‌న‌కు ఓ అవ‌కాశం వ‌స్తుంది. ఏదేమ‌యిన‌ప్పటికీ విశాఖే రాజ‌ధాని అని పేర్కొన్నారు..

యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, కార్పొరేషన్ చైర్మన్లు మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, కమిషనర్ చల్లా ఓబులేశు, ఎమ్మార్వో వెంకటరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ మెంటాడ పద్మావతీ, పైడి రాజారావు,  ముకళ్ల తాత బాబు, సాధు వైకుంఠం రావు, అంధవరపు సంతోష్, మెంటాడ స్వరూప్, గురుగుబెల్లి లోకనాథం, కొనర్క్ శ్రీనివాసరావు, డాక్టర్. పైడి మహేశ్వరరావు, అంధవరపు ప్రసాద్, మండవిల్లి రవి, పొన్నాడ రిషి, డాక్టర్ దానేటి శ్రీధర్, చల్లా శ్రీనివాసరావు,   కరమ్ చంద్, అంధవరపు రమేష్, ప్రకాష్, టి.బాలకృష్ణ,  ఎండ రమేష్, రాం మోహన్, అందవరపు రమేష్, సత్యనారాయణ,  జ్యోతి, మైలపల్లి మహాలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top