విశాఖే మ‌న రాజ‌ధాని అని గొంతెత్తి నిన‌దిద్దాం  

రెవెన్యూ శాఖ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు 

మూడు రాజ‌ధానుల‌కు వ్య‌తిరేకంగా ఎవ్వ‌రు మాట్లాడినా ఉత్తరాంధ్ర ద్రోహులే

ప్రజా ఆకాంక్ష‌లు నెర‌వేర్చ‌డ‌మే అభివృద్ధి

ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గెలుపే ధ్యేయంగా ప‌నిచేయాలని పార్టీ క్యాడ‌ర్‌కు పిలుపు

శ్రీ‌కాకుళం: ప్రతి పౌరుడూ విశాఖపట్నం మన రాజధాని అని గొంతెత్తి నినదించాలి.. ఆ విధంగా చేస్తేనే ఈ ప్రాంతం అస్తిత్వం కాపాడినవారం అవుతాం అని రెవెన్యూ శాఖ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అన్నారు. ఒకనాడు భూమికి ఓనర్‌గా ఉన్న‌వారు వెనుక‌బాటు కార‌ణంగా ఈ రోజు వాచ్‌మెన్ గా మిగిలిపోతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రైతుల చేస్తున్న పాదయాత్ర మనం చూసి చప్పట్లు కొట్టాలి అంటా, ఆ విధంగా చేస్తే మన ప్రాంతానికి ద్రోహం చేసినట్టే అని చెప్పారు. ఉత్త‌రాంధ్ర పట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి ఓట‌రు న‌మోదుకు సంబంధించి అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. జీవ‌న ప్ర‌మాణాల‌తోనే అభివృద్ధి సాధ్యం అని అన్నారు. ప్ర‌జా ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ఓ ప్ర‌భుత్వం ప‌నిచేయాల‌ని అదే విధంగా వైయ‌స్ఆర్ సీపీ స‌ర్కారు ప‌నిచేస్తోంద‌ని ఉద్ఘాటించారు. గ‌డ‌ప‌గడ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో భాగంగా ప‌నిచేసిన ఇన్‌ఛార్జుల సాయంతో ఓట‌రు న‌మోదు ప్ర‌క్రియ చేప‌ట్టున్నామ‌ని చెప్పారు. అదేవిధంగా పార్టీ చేప‌ట్టిన ప్ర‌తి ప‌నినీ చిత్త‌శుద్ధితో కార్య‌కర్త‌లు చేప‌ట్టాల‌న్నారు. 

మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ఇంకా ఏం మాట్లాడారంటే.. 

`విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం కేంద్రం 23 సంస్థ‌ల‌ను ఇచ్చింది. కానీ మ‌న‌కు ద‌క్కిందేంటి? ఇప్ప‌టిదాకా ఒక్క కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌ను కూడా ఏర్పాటు చేయలేదు. విడిపోయాక న‌ష్ట‌పోయినందుకు ప‌రిహార రూపంలో ఇచ్చిన సంస్థ‌ల‌ను మ‌న‌కు క‌నీసం ఓ రెండు సంస్థ‌ల‌నూ కేటాయించ‌లేదు. అది క‌దా దౌర్భాగ్యం. మ‌న వెనుక‌బాటును సంస్క‌రించే విధంగా కేంద్రం త‌ర‌ఫున సంస్థ‌లు ఏర్పాటు చేయాల్సిన బాధ్య‌త‌ను గ‌త టీడీపీ స‌ర్కారు విస్మ‌రించింది. అంతేకాదు మ‌న వెనుక‌బాటు కార‌ణంగానే వ‌ల‌స‌లు కూడా పెరుగుతున్నాయి. గ‌తంలో గ్రామీణ ఆంధ్రావ‌నిలో యువ‌త ఎక్క‌డ స్వ‌స్థ‌లాల్లో లేరు. ఉపాధి లేక వెళ్లిపోయారు. ఇవ‌న్నీ ప‌రిగ‌ణించ‌కుండా గ‌తంలో చంద్ర‌బాబు పాల‌న సాగింది. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రాంమోహన్ నాయుడు న‌న్ను ఉద్దేశించి ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా అచ్చెన్నాయుడు కూడా ఈ ప్రాంతానికి చేసింది లేదు. మీకు ఓటేసినందుకు ప్ర‌జ‌లు ద‌ద్ద‌మ్మ‌లా క‌నిపిస్తున్నారా ? ఒక్క సంస్థ‌ను కూడా  మీరు తెప్పించ‌లేక‌పోయారు. మీరు చంద్ర‌బాబు పంచ‌న చేరి ఆయ‌న చెప్పిన విధంగా రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారానికి తెలుగుదేశం నాయ‌కులంతా ప్ర‌య‌త్నిస్తున్నారా అని ప్ర‌శ్నించారు. 

మ‌నం ఇంత‌కాలం వివిధ సంద‌ర్భాల్లో రాజ‌ధాని పేరిట జ‌రిగిన ఏర్పాటులో చాలా కోల్పోయాం. కానీ ఇప్పుడు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ మ‌న‌కు న్యాయం చేయాల‌ని భావిస్తున్నారు. ఇందుకు వ్య‌తిరేకంగా ఎవ్వ‌రు మాట్లాడినా ఉత్తరాంధ్ర ద్రోహులే.. వారిని మ‌నం వ్య‌తిరేకించాలి. మూడు రాజ‌ధానుల‌కు మ‌ద్ద‌తుగానే ఉంటాను. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ ప్ర‌క్రియ కార‌ణంగా ఏ ప్రాంతం న‌ష్ట‌పోయేది లేదు. ఆ విధంగా విశాఖ కేంద్రంగా ప‌రిపాల‌న రాజ‌ధాని ఏర్పాటు కానుంది. అదేవిధంగా క‌ర్నూల్‌లో న్యాయ రాజ‌ధాని ఏర్పాటు కానుంది. అదేవిధంగా అమ‌రావ‌తిలో శాస‌న రాజ‌ధాని ఉండ‌నుంది. ఇందులో సందేహాలకు తావులేదు. ఇప్పుడు చంద్ర‌బాబు చెప్పిన విధంగా పెట్టుబ‌డులు అమ‌రావ‌తిలో పెట్టాల్సిన అవ‌స‌రం లేదు. రేపు ఆ ప్రాంతం అభివృద్ధి చెందాక ఆరోజు హైద్రాబాద్ మాదిరిగానే మ‌న‌ల్ని పంపేస్తే అప్పుడు మ‌నం ఏం కావాలి. అప్పుడు మ‌ళ్లీ మ‌నం మ‌రింత వెనుక‌బాటుకు గురి కావ‌డం త‌థ్యం. 

ఈ జిల్లాకు చెందిన ప్ర‌తి పౌరుడూ విశాఖే మా రాజ‌ధాని అని నినదించాలి. ఆ విధంగా క్యాపిట‌ల్ వ‌స్తే అనేక సంస్థ‌లు వ‌స్తాయి. అదేవిధంగా ఈ ప్రాంత ప్ర‌జ‌ల ఆస్తుల విలువ పెర‌గ‌నుంది. త‌ద్వారా ఇక్క‌డి పేద‌రికం అన్న‌ది కూడా దూరం అవుతుంది. భూమి విలువ పెర‌గ‌నుంది. అభివృద్ధిలో వ్యత్యాసాలు అన్నవి స‌మ‌సి పోయేలా మూడు రాజ‌ధానుల ఏర్పాటుదోహదం కానుంది. మీ ఆస్తులు చూసి మేం అభివృద్ధి అని భావించాలా చంద్ర‌బాబూ !ఇది స‌బ‌బు కాదు. ఎడ్యుకేటెడ్ ఎవ్వ‌రైనా ఆలోచించాలి. అర్థం చేసుకోవాలి` అని మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు చెప్పారు.

Back to Top