తుని: చంద్రబాబు నాయుడు అనే దరిద్రుడికి ఒక వెహికిల్ కేటాయించి దాంట్లో నలుగురు మానసిక వైద్యులను ఆయన వెంట పంపించాలని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను విజ్ఞప్తి చేశారు. పిచ్చి ముదిరి నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడని, ప్రజలను పక్కదోవపట్టించేలా పచ్చి బూతులు మాట్లాడుతున్నాడని ఫైరయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తుంటే కరువు రక్కసికి తాత వచ్చి జిల్లాలో తిరుగుతున్నాడని ప్రజలంతా భావిస్తున్నారన్నారు. తునిలో మంత్రి దాడిశెట్టి రాజా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. రాష్ట్రంలో లోకేష్ అనే ఒక ఊరపంది పదిమంది కూడా లేని పాదయాత్ర పేరుతో తిరుగుతుందన్నారు. సీఎం వైయస్ జగన్ డీఎన్‌ఏల గురించి ఆ ఊరపంది మాట్లాడుతుందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి డీఎన్‌ఏ ఏంటో రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు తెలుసన్నారు. ‘ముందు నీ డీఎన్‌ఏ ఏంటో ఒకసారి చెక్ చేసుకో లోకేష్.. నీది రాయలసీమ డీఎన్‌ఏ కాదు.. తెలంగాణ డీఎన్‌ఏ అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుస’న్నారు. చంద్రబాబు పరిపాలనలో కరువు రక్కసి రాష్ట్రాన్ని పట్టి పీడించిందని గుర్తుచేశారు. టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని సగం మండలాలు కరువు మండలాలుగా ప్రతి ఏటా ప్రకటించారన్నారు. కరువు రక్కసికి తాత చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. గతంలో తూ.గో జిల్లా ప్రజలు చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పి 4 సీట్లు మాత్రమే ఇచ్చారన్నారు. వైయస్ జగన్ చేస్తున్న పరిపాలన చూసి ఫ్రస్టేషన్‌లో చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడన్నారు. ‘తమ్ముళ్లు మీ సెల్ ఫోన్‌లో వెలిగే లైట్లు కనిపెట్టింది నేనే’ అని గొప్పలు చెప్పుకుంటున్నాడన్నారు. నీ డీఎన్‌ఏ రాయలసీమది కాదు: – దారీ తెన్ను లేకుండా రాష్ట్రంలో ఒక ఊర పంది తిరుగుతోంది – జగన్ గారి డిఎన్‌ఏ అడగడం కాదు లోకేశ్.. అసలు నీ డిఎన్‌ఏ ఏంటో చెప్పు..? – లోకేశ్ నీది...తెలంగాణా డిఎన్‌ఏ..రాయలసీమది కానే కాదు. – నీ డిఎన్‌ఏ ఏంటో ఒక సారి చెక్ చేసుకో లోకేశ్. – మేం మాట్లాడితే మీరు అన్నీ మూసుకుని కూర్చోవాల్సిందే. ఆయన వెంట ఆ వాహనం ఉండాలి: – ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. చంద్రబాబు ఎక్కడ తిరిగితే అక్కడ ఒక వెహికిల్ ఏర్పాటు చేసి, నలుగురు మెంటల్ డాక్టర్లను కూడా ఏర్పాటు చేయాలి. – రాష్ట్రంలో ఇళ్లు కూడా లేని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు. – రకరకాల బూతులు, అసహ్యకరమైన మాటలు మాట్లాడుతున్నాడు. – చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చిన రోజు నేను కూడా అసెంబ్లీలో ఉన్నాను – ఆయన బార్య గురించి ఎవరూ ఒక మాట కూడా అనలేదు..అయినా వెక్కి వెక్కి ఏడ్చాడు. కరవుకు కేరాఫ్ చంద్రబాబు: – చంద్రబాబు పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని కరవు రక్కసి పట్టి పీడించింది. – రాష్ట్రంలో సగం మండలాలు కరువు మండలాలుగానే ఉండేవి. – కరువు రక్కసికి తాతైన చంద్రబాబు ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో మళ్లీ తిరుగుతున్నాడు. – గతంలో ఈ జిల్లా ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పి నాలుగు సీట్లు మాత్రమే ఇచ్చారు. అది తట్టుకోలేక పిచ్చి ప్రేలాపణలు: – ప్రజల్లో జగన్ గారి పరిపాలనకు వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక ప్రస్టేషన్‌తో చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు. – ఏ నాయకుడైనా రోడ్డు మీదకొచ్చి మీకిది చేశాం. మాకు ఓట్లేయండి అని అడుగుతారు. – చెప్పుకోడానికి ఏమీ లేక ప్రజల్ని పక్కదోవ పట్టించడానికి చంద్రబాబు మాట్లాడుతున్నాడు. – చంద్రబాబూ.. మీరు ఒక్కసారి తమ్ముళ్లూ ఈ ప్రభుత్వంలో సంక్షేమం మీకు అందిందా? లేదా? అని అడగండి. వాస్తవాలు వారే చెబుతారు. ఇంకోసారి అలా మాట్లాడితే..: – ముఖ్యమంత్రి గారిని ఓరేయ్ అంటున్నాడు.. మేం నిన్ను ఒరేయ్ అని మాట్లాడలేమా..? – మీ మీటింగులకు జనం రాకపోతే మాపై ప్రస్టేషనా..? – మా ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యుల జోలికి వస్తే మీ నాలుక చీరేస్తాం – ఈ రాష్ట్రాన్ని గతంలోలా దోచుకోడానికి ప్రజలు ఒప్పుకోరు అని తండ్రీకొడుకులకు కూడా తెలిసిపోయింది – ఈ రాష్ట్ర ప్రజలు తిరస్కరిస్తారని తెలిసే ఈ రాష్ట్రంలో ఆయన ఇళ్లు కట్టుకోవడం లేదు – అభివృద్ధి, సంక్షేమంతో సీఎంగారి పాలనను ప్రజలు ఆనందంగా ఆస్వాదిస్తున్నారు. – ఇంకొక్కసారి ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి ప్రజలు మీకు అవకాశం ఇవ్వరు. – మీ నాయకుడు అచ్చెన్న పార్టీ లేదు...బొక్కా లేదంటాడు. – చంద్రబాబు సైకిల్ పోవాలి అంటాడు..ఆయన కొడుకేమో టీడీపీని బంగాళాఖాతంలో కలపాలంటాడు. – ప్రజల మనసుల్లో మీ పార్టీ లేదు అనే నిజాన్ని జీర్ణించుకోలేక ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని దురదృష్టం అంటున్నారు: – జగన్‌గారు సీఎంగా రాష్ట్ర ప్రజలు తమ అదృష్టంగా భావిస్తున్నారు. – అదే మీరు (చంద్రబాబునాయుడు) ప్రతిపక్ష నేతగా ఉండటాన్ని ప్రజలు ఒక దురదృష్టంగా భావిస్తున్నారు. – 14 ఏళ్ల ముఖ్యమంత్రిని అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు.. తన పరిపాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశాడో మాత్రం చెప్పలేడు. – సెల్ ఫోన్, కంప్యూటర్ కనిపెట్టానని సొల్లు చెప్తున్నాడు తప్ప.. ప్రజలకు చేసిన మేలు మాత్రం చెప్పలేడని మంత్రి శ్రీ దాడి«శెట్టి రాజా గుర్తు చేశారు