అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి బడుగు, బలహీన వర్గాల ఆత్మ బంధువని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. గురువారం ఆయన సభలో మాట్లాడుతూ..ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నరలోనే రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి. ఎన్నికల ముందు వైయస్ జగన్ పాదయాత్ర చేస్తూ బీసీల సమస్యలు నేరుగా తెలుసుకొని..బీసీల్లో ఉన్న అనేక మంది పెద్దలతో బీసీ అధ్యాయన కమిటీ ఏర్పాటు చేశారు. ఏలూరులో బీసీ గర్జన గర్జన సభ నిర్వహించారు. బీసీలంటే భారత దేశ కల్చర్ అని వైయస్ జగన్ అభివర్ణించారు. బీసీల హృదయాల్లో వైయస్ జగన్ చిరస్థాయిగా నిలిచారు. బీసీల గురించి దేశ చరిత్రలో ఎంతో మంది మాట్లాడారు. పాదయాత్రలో బీసీల సమస్యలు గుర్తించారు. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు..బ్యాక్ బోన్ అని వైయస్ జగన్ గుర్తించి, అదేస్థాయిలో ప్రాధాన్యత కల్పించారు. కుమ్మరి, కమ్మరి, నాయీబ్రహ్మణుడు, నేతన్న, వడ్రంగి బీసీలే. పండుగలకు బలుసాకు తెచ్చేది బీసీలే. దేశ సంస్కృతిని సజీవంగా ఉంచిన బీసీలను గుర్తించిన నాయకుడు వైయస్ జగన్. ఆరు గజాల చీరను అగ్గిపెట్టేలో అమర్చే నేతన్నను సీఎం వైయస్ జగన్ గుర్తించి, వారికి అండగా నిలిచారని చెప్పారు. పోరాడుదాం..గెలుద్దామన్న నినాదం వైయస్ జగన్‌ది. ప్రజల పట్ల ఆయనకు ఉన్న అంకితభావం గొప్పది. ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారంటే వైయస్ జగన్‌కు ఉన్న మంచి మనస్సే. తండ్రి ఆశయాలకు వైయస్ జగన్ వారసుడిగా నిలిచారు. ఎన్టీఆర్ నమ్మి చంద్రబాబుకు పిల్లనిస్తే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. బాబు సీఎంగా ఉన్న సమయంలో అన్ని అబద్ధాలు చెప్పి ప్రజలకు సంక్షేమం అందించకుండా ఆయన కుమారుడి క్షేమాన్ని చూసుకున్నారు. నేరుగా ప్రభుత్వం ప్రజలకు నగదు బదిలీ చేసి ఆదుకుంటోంది. మా ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి టీడీపీకి మాట్లాడే అర్హత లేదు. వైయస్ జగన్ ప్రభుత్వాన్ని సంస్కరణల ప్రభుత్వం అంటారు. ఏ పథకం తీసుకున్న 50 శాతం మహిళలకు కేటాయించారు. బలహీనవర్గాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి సామాజిక భద్రత, గౌరవం తీసుకువచ్చారు. 29 మంది మహిళలకు కార్పొరేషన్ చైర్‌పర్సన్లుగా స్థానం కల్పించారు. 139 కులాలకు రాష్ట్రస్థాయి పదవులు ఇచ్చి భద్రత కల్పించారు. మంత్రివర్గ కూర్పులో 60 శాతం బడుగు, బలహీన వర్గాలకు వైయస్ జగన్ ప్రాధాన్యత కల్పించారు. బీసీల ఉన్నతి కోసం వైయస్ జగన్ చేస్తున్న ఆలోచన గొప్పది. 2014లో చంద్రబాబు ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. మన సీఎం వైయస్ జగన్ బలహీన వర్గాల ఆత్మబంధువు. ప్రతి క్షణం సీఎం మన కష్టాలను కళ్లతో చూసి..మనసుతో పరిష్కరిస్తారు. చంద్రబాబు 14 ఏళ్లు పాలించి ప్రజలను పట్టించుకోలేదు. కేవలం పత్రికల ద్వారా అధికారం పొందాలని చూశారు. వైయస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర ఒక తపస్సులా 14 మాసాలు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అందుకే మేం పాలకులం కాదు..సేవలకులని చెప్పిన మొదటి నాయకుడు వైయస్ జగన్. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం గ్రామ సచివాలయ వ్యవస్థను తెచ్చారు. చంద్రబాబు అన్ని వ్యవస్థలను చెడగొట్టారు. ప్రతిపక్షం అంటే పాలకపక్షం చేసే మంచి పనులకు సలహాలు ఇవ్వాలి. గతంలో చంద్రబాబు మహిళల రుణాలు మాఫీ చేస్తామని మాట ఇచ్చి..ఎన్నికల ముందు పసుపు-కుంకుమ అంటూ తాయిళాలు ఇచ్చారు. కానీ వైయస్ జగన్ అలా కాదు..మహిళలను వ్యాపారవేత్తలుగా చూడాలని వైయస్ఆర్ ఆసరా, చేయూత పథకాల ద్వారా ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నారు. చంద్రబాబు పాలనలో 57 మాసాలు పింఛన్లు గుర్తుకు రాలేదు. ఎన్నికల సమయంలో పింఛన్లు పెంచుతామని ప్రకటించారు.