అమరావతి: సంక్షేమమే మా ప్రభుత్వ పాలసీ అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. సామాన్యుడికి అన్ని రకాలుగా సహకరించాలనేదే ప్రభుత్వ పాలసీ అని చెప్పారు. వెల్ఫేర్ వద్దు అని ప్రతిపక్షాలు చెప్పగలవా? గ్రోత్‌లో టాప్-5 రాష్ట్రాల్లో ఏపీ ఉందన్నారు. లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. విద్య, వైద్య రంగంలో కీలక సంస్కరణలు తీసుకువచ్చాం. 13 వేల గ్రామ పంచాయతీల్లో వైయస్ఆర్ క్లినిక్‌లు ఏర్పాటు చేశామని మంత్రి వివరించారు. శాసన మండలిలో గురువారం మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పారు.
మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ..
ఆ రోజు ప్రతిపక్షాలు మాట్లాడుతూ..ఎక్కువగా ఈ ప్రభుత్వం వెల్ఫేర్ మీద ఖర్చు చేస్తున్నారు. రెండోది మీ ఆదాయ వనరులు సరిగా లేవన్నారు. అప్పు ఎక్కువ చేస్తున్నారని ఆ రోజు ఆరోపించారు. ఈ రోజు వాస్తవాలు తెలియజేస్తున్నా..ఆ రోజు..ఈ రోజు ఒక్కటే చెబుతున్నా..మా ప్రభుత్వ పాలసీనే వెల్‌ఫేర్..పేదవారు, సామాన్య ప్రజలకు అన్ని రకాలుగా సహకరించాలని మా ప్రభుత్వ పాలసీ. ఎవరైతే సంక్షేమం వద్దని ముందుకు వచ్చి చెప్పండి..పోనీ సంక్షేమం వల్ల మనం వెనుకబడ్డామని ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అది కూడా వాస్తవం కాదు. దుర్భరమైన పరిస్థితుల్లో ఫైనాన్స్‌ను ప్రజల్లోకి తీసుకెళ్తుందో అది ఇంప్రూవ్‌మెంట్ చూపిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు గ్రోత్ చూపిస్తున్నాం. దేశంలోనే టాప్ రాష్ట్రాల్లో ఏపీ ఉంది.
మా ప్రభుత్వం ఏర్పాటైన తరువాత కొన్ని ముఖ్యమైన పద్ధతుల్లో పాలన సాగిస్తోంది.
ఉత్పాదకత, పరిపాలనలో ఉన్న భాగస్వాములు, విధానాలు, పరిపాలనకు సంబంధించిన పద్దతులు మార్చడమే మా ప్రభుత్వ ఆలోచనా విధానం.
ఖర్చు, డీబీటీ చాలా పారదర్శకంగా చేపడుతున్నాం. అది కూడా పరిపాలనలో ఒక ముఖ్య భాగం. ఈ ప్రభుత్వ పరిపాలన విధానంలో మహిళలకు ప్రాధాన్యమైన పాత్ర, సమానమైన అవకాశాలు కల్పిస్తున్నాం. కమ్యూనిటీ భాగస్వామ్యం సమానంగా చేపట్టడం కూడా ప్రభుత్వ విధానాల్లో ముఖ్యమైనది.
సుస్థిరత, సుస్థీరత లక్ష్యాలు కూడా మా పాలసీలో ఒక భాగం. రాష్ట్రానికి సంబంధించిన నిధులు, కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఒక కలయిక.
ఆరోగ్యం పట్ల మా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో వైయస్‌ఆర్ విలేజీ క్లినిక్స్ 13 వేల గ్రామ పంచాయతీల్లో నిర్మిస్తున్నాం. ఫ్యామిలీ ఫీజిషియన్ కాన్సెప్ట్..ఇది చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే ఉంది. అలాంటిది మన రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. 108, 104లను బలోపేతం చేశాం. ఆరోగ్యశ్రీ కార్యక్రమం చాలా ఫోకస్డ్‌గా చేపడుతున్నాం. హెల్త్‌కు సంబంధించి మౌలిక వసతులు విఫరీతంగా కల్పిస్తున్నాం. మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటి, మల్టిస్పెషాలిటీలు ఇలా అన్నింటిలో కూడా మౌలిక వసతులు కల్పించాం.
విద్య:
విద్యకు సంబంధించి ఫౌండేషన్ సిస్టమ్ తీసుకువచ్చాం. గొప్ప స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. క్లాస్‌రూమ్, డిజిటల్ క్లాస్ రూమ్స్, టాయిలెట్స్, విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, స్కాలర్‌షిప్స్, విద్యా కిట్లు, ఇలా సుక్షమైన ఆలోచనలు సీఎం వైయస్ జగన్ చేస్తున్నారు. ఉన్నవాడు, లేనివాడు అన్న తేడా స్కూల్‌లో ఉండకూడదు..అందరు సమానంగా ఉండాలన్నదే సీఎం వైయస్ జగన్ కాన్సెప్ట్‌తో యూనిఫాం, షూ, సాక్స్‌లు అందజేస్తున్నాం.
వ్యవసాయం:
విత్తనం నుంచి విక్రయం వరకు ప్రభుత్వం చేయి పట్టుకొని అన్నదాతను నడిపిస్తోంది. రైతులకు ఎంత చేసినా తక్కువే. ఇది కూడా సంక్షేమమే. ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఆక్వా కల్చర్, ఎగుమతుల్లో ఏపీ నంబర్ స్థానంలో ఉంది.
సామాజిక భద్రత:
రాష్ట్రంలో పొదుపు మహిళలకు ఆసరా, సున్నా వడ్డీ రుణాలు, వైయస్‌ఆర్ చేయూత, కాపు నేస్తం, నాయిబ్రహ్మణులకు, రజకులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ప్రభుత్వానికి సంబంధించి ఫోకస్‌ను చెప్పాం.
ఎమ్మెల్సీ రవీంద్రబాబు తన అనుభవంతో రాష్ట్ర ప్రభుత్వ విధానాలను మెచ్చుకున్నారు. హ్యూమన్ డెవలప్‌మెంట్ ఈస్ బుగ్గెస్ట్ డెవలప్‌మెంట్. క్యాపిటల్ ఎక్స్‌ఫెండేచర్ గురించి రవీంద్రబాబు చాలా చక్కగా చెప్పారు.
విఠాపు బాలసుబ్రహ్మణ్యం చెప్పిన దాంట్లో ఫర్ రీచింగ్ ఎఫెక్ట్ గురించి చక్కగా చెప్పారు. పాలిటెక్నిక్ కాలేజీల గురించి సుక్ష్మంగా చెప్పారు. ఇంజినీరింగ్ కోర్స్ డిఫరెంట్‌గా ఉంటుంది. పాలిటెక్నిక్ స్టూడెంట్ ఇంజినీర్ కంటే తక్కువ కాదని వారిలో నైపుణ్యం పెంచేందుకు స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు పెడుతున్నాం. వారి ప్రతిభకు తగ్గట్టుగా ఉపాధి పొందేలా చర్యలు తీసుకుంటున్నాం.
ప్రైవేట్ విద్యా సంస్థలు రావడం మంచిదే. అయితే అక్కడ సరైన వసతులు లేకుండా ఉంటే నష్టపోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ విద్యా సంస్థలను గత ప్రభుత్వాలు పట్టించుకోకుండా నాశనం చేశాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీలు భర్తీ చేయకుండా, మౌలిక వసతులు కల్పించకపోవడంతోనే గతంలో ఈ బడులు వెనుకబడ్డాయి. మా ప్రభుత్వం వచ్చాక ఇందుకు భిన్నంగా పని చేస్తోంది. బ్యాలెన్స్‌డా మా ప్రభుత్వం పని చేస్తోంది.
నైపుణ్యాభివృద్ధి కోసం నియోజకవర్గ స్థాయిలో ఒక స్కిల్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేస్తున్నాం. ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులకు, పరిశ్రమలకు అనుగుణంగా విద్యార్థులకు స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికీ 160 కాలేజీలు ఏర్పాటు చేశాం. అనకాలపల్లిలో ఎంఎస్‌ఎంఈ ఎక్సలెన్స్ ఏర్పాటు చేశాం.
స్కూల్ టీచర్ గతంలో ప్రతి పిల్లాడిని సొంత పిల్లాడిలా భావించేవారు. ఇంటికివచ్చిన తరువాత మెంటరింగ్ జరిగేది. చదువు రాకపోయినా కూర్చోబెట్టి చదివించేవారు. ఈ రోజు అలాంటిది లేదు. ట్యూటరింగ్, మెంటరింగ్ జరగాలి. టీచర్లు ఇది చేయాలి. పిరియాడికల్‌గా వారు మెంటరింగ్ చేయాలి.
కేరళ గ్రామ సభ బాగుంటుంది. స్థానిక సంస్థలు చేయాల్సిన బాధ్యతలు ఏంటి అన్నది స్థానికంగానే జరగాలి. ఆ సిస్టమ్‌ను బలోపేతం చేస్తే బాగుంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఏ బాధ్యతతో పని చేస్తున్నారో గమనించాలి. లోకల్ బాడీలో పని చేసిన వారికి మంచి అనుభవం ఉంటుంది.
వెంకటేశ్వరరావు మాట్లాడారు..ఈ బడ్జెట్ ఒక మ్యాజిక్ ఫిగర్ అన్నారు. ఇది మ్యాజిక్ ఫిగర్ కాదు..వాస్తవం. 279–297 ఎలా వస్తుందని ఆయన అనుమానం. మనం అనుకుంటే వస్తుంది. 279, 280 వస్తుదనుకుంటే ఒక రూపాయి ఖర్చు తగ్గించుకుంటే 279 వస్తుంది. ఒక్క రూపాయి ఖర్చు పెంచుకుంటే 280 వస్తుంది. అది వాస్తవానికి దగ్గరగా ఉందా అన్నది ఆలోచించాలి. ఉద్దేశపూర్వకంగానే ఈ ఫిగర్ పెట్టాం.
క్యాప్టిల్ ఎక్సెఫెండేచర్:
గతంలో ఉన్న క్యాపిల ఎక్స్‌ఫెండేచర్ గమనిస్తే..
2015–2016–17 శాతం,
2016–17– 15 శాతం,
2017–2018లో 14 శాతం,
2018–19లో 20 శాతం
2019–2020లో 14 శాతం
2020–21లో 17 శాతం
2021–2022లో 15 శాతం
2022–2023లో రివైజ్డ్ ఎస్టిమేషన్‌లో ఉన్నాయి
2023–2024లో 17 శాతం
20 నుంచి 25 వరకు ఉంటే ఇంకా మేలు. కొన్ని రాష్ట్ర పరిస్థితులు, కోవిడ్ సంక్షోభం, హై Ðð ల్ఫేర్ కారణంగా విద్య, వైద్యం, వ్యవసాయం, ఇళ్ల నిర్మాణంపై ఎక్కువగా ఖర్చు చేస్తున్నాం. క్యాప్టిల్ ఎక్సెండేచర్‌లో పెద్ద తేడా ఏమీ లేదు. ఒక శాతం అటు ఇటు ఉంటుంది.
అప్పు:
2014 నుంచి 2019 వరకు తీసుకుంటే ..రాష్ట్ర విభజన సమయంలో రూ.1,20,566 కోట్లు ఉండేది. అయితే ప్రభుత్వ పూచికత్తు లేకుండా అప్పు మే నెలలో చూస్తే రూ.2,68,115 కోట్లు. ప్రభుత్వ పూచికత్తు చూస్తే..రూ.3,25,322 కోట్లు..అప్పటి పెరుగుదల చూస్తే..సగటున 19.46 శాతం .
మా ప్రభుత్వం వచ్చిన తరువాత గమనిస్తే..2019 నుంచి రూ.4,98,799 కోట్లు మనది 15 శాతమే. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే అప్పు చాలా తక్కువే. అప్పు ఎందుకు పెరిగిందని ప్రతిపక్షాల బాధ. పెరలేదంటే మాత్రం మీకు పరిపాలన చేతకాలేదంటారు. ఏదో ఒకటి ప్రతిపక్షాలు డిసైడ్ చేసుకోవాలి.
2014–2015లో 8.5 శాతానికి అప్పు తీసుకున్నారు
2015–2016లో 8.28 శాతం
2016–2017లో 7.45 శాతం
2017–2018లో 7.46 శాతం
2018–2019లో 8.46 శాతం
2019–2020లో 7.45 శాతం
2020–2021లో 7.20 శాతం
2021–2022లో 6.57 శాతం
2022–2023లో 7.08 శాతం
సగటు పరిశీలిస్తే టీడీపీ కంటే మా ప్రభుత్వం 1.5 శాతం తక్కువకు అప్పు చేశాం. ఇవి ఓపెన్ ఫిగర్..ఎక్కడైన దొరుకుతుంది.
ఫిసికల్ డెఫిసిట్:
కొన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణలను పరిశీలిస్తే..2018–2019, 2019–2020 మధ్య తేడాలు గమనిద్దాం.
ఏపీలో 2018–2019లో ఫిసికల్ డెఫిసిట్ 35500 కోట్లు
2020–2021లో 55160 కోట్లు
కర్నాటకలో 38 వేల కోట్ల నుంచి రూ.67 వేల కోట్లకు పెరిగింది
మహారాష్ట్రలో 23 వేల కోట్ల నుంచి రూ.71,500 కోట్లు పెరిగింది.
తమిళనాడులో రూ.47 వేల కోట్ల నుంచి రూ.90 వేల కోట్లకు పెరిగింది.
తెలంగాణలో రూ.27 వేల కోట్ల నుంచి రూ.49 వేల కోట్లకు పెరిగింది. ఇదంతా కూడా కోవిడ్ సమయంలో జరిగింది. దీని వల్ల కర్నాటక రాష్ట్రం చిన్నదైందా? తమిళనాడు చిన్న రాష్ట్రం అయ్యిందా? దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆ సమయంలో అప్పు చేయాల్సి వచ్చిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వివరించారు.