సభలో గందరగోళం సృష్టించడమే టీడీపీ పని

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

 అమరావతి: శాసన సభలో గందరగోళం సృష్టించేందుకు టీడీపీ సభ్యులు పనిగా పెట్టుకున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తప్పుపట్టారు. ప్రభుత్వానికి మంచిపేరు రావడం చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు టీడీపీ సభ్యులకు ఓపిక లేదన్నారు. జంగారెడ్డిగూడెంలో ఏం జరిగిందో వాస్తవాలు చెప్పేందుకు డిప్యూటీ సీఎం ఆళ్లనాని సిద్ధంగా ఉన్నారు. ఈ వేదికద్వారా తప్పుడు సమాచారం ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ గందరగోళం చేస్తోంది. వినేందుకు కూడా టీడీపీకి ఓపిక లేదు. మొన్న గవర్నర్‌ ప్రంగాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా పేపర్లు చించి సభా సమయాన్ని అడ్డుకుంటున్నారు. వాళ్లు ప్రశ్నోత్తరాలు వద్దంటున్నారు. హౌసింగ్, అగ్రికల్చర్, ఫ్యామిలీ వెల్‌ఫేర్‌పై ప్రశ్నోత్తరాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయని వాటిని అడ్డుకునేందుకు టీడీపీ నేతలు ఆందోళన చేపడుతున్నారు. ఎమ్మెల్యేలందరూ కూడా వాళ్ల ప్రాంతానికి మంచి చేసేందుకు సభకు వచ్చారు. ఇలాంటి గందరగోళం లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పీకర్‌ను కోరారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top