తాడేపల్లి: ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఒకటో తేదీ నుంచి 3 వేల పెన్షన్ అమలు చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సీఎం వైయస్ జగన్ మాటిస్తే అమలు చేసి తీరుతారమని అన్నారు. మూడో తేదీన పెన్షన్ ల పంపిణీ కార్యక్రమంలో సీఎం వైయస్ జగన్ పాల్గొంటారని చెప్పారు. వచ్చేనెల 4 ముఖ్యమైన కార్యక్రమాలు జరగనున్నాయని.. వైయస్ఆర్ ఆసరా చేయూత లబ్ధిదారులకు సీఎం వైయస్ జగన్ నగదు జమ చేయనున్నారని అన్నారు. 404 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం వైయస్ జగన్ ఆవిష్కరిస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. పేదల కోసం సీఎం వైయస్ జగన్ ప్రతిక్షణం కష్ట పడుతున్నారని తెలిపారు. అంతేకాకుండా.. మూడు వేలు పెన్షన్ అమలు చేస్తున్నామని అన్నారు. ఆసరా, చేయూత కార్యక్రమాల ద్వారా వెనుకబడిన వర్గాలకు మేలు చేస్తున్నామని మంత్రి మేరుగ చెప్పారు. జనవరి 19న విజయవాడలో చారిత్రాత్మక అంబేడ్కర్ విగ్రహాన్ని, మ్యూజియంను సీఎం ఆవిష్కరిస్తారన్నారు. మొక్క దగ్గర నుండి, ఇటుక రాయి వరకు ప్రతి అంశాన్ని సీఎం దగ్గర ఉండి ఈ విగ్రహాన్ని నిర్మించారని తెలిపారు. విగ్రహావిష్కరణ రోజు వేల సంఖ్యలో జనాలు ఈ కార్యక్రమానికి హాజరవుతారని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు.