థర్డ్‌ క్లాస్‌ నుంచి సబ్జెక్ట్‌ టీచర్లతో బోధన

మంత్రి బొత్స సత్యనారాయణ

ఎండల కారణంగా వారం పాటు ఒంటిపూట బడులు పొడిగింపు

ప్రతి ఎలిమెంటరీ స్కూల్‌కు స్మార్ట్‌ టీవీ

 విజయవాడ: థర్డ్‌ క్లాస్‌ నుంచి సబ్జెక్ట్‌ టీచర్లతో బోధన ఉంటుందని మంత్రి బోత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.ఎండల కారణంగా వారం పాటు ఒంటిపూట బడులు పొడిగించామని చెప్పారు.6వ తరగతి నుంచి పైస్థాయి వరకు ఇంటరాక్ట్‌ ప్యానల్స్‌ ఏర్పాటు చేస్తున్నామని, విద్యా బోధనపై టీచర్లకు ఆన్‌లైన్, ఆఫ్‌ లైన్‌లో శిక్షణ ఇస్తామని చెప్పారు. సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడారు.
ఎండల కారణంగా వారం పాటు ఒంటిపూట బడులు పొడిగించామని మంత్రి తెలిపారు. నాడు–నేడు పనులు జరుగుతున్న స్కూళ్లకు వాచ్‌మెన్‌ పోస్టులు ఇచ్చాం. కంప్యూటర్‌ పోస్టుల ఫైల్‌ కూడా మూవ్‌ అవుతోంది. ప్రభుత్వం తాలుకా ఆలోచన ఏదైతే ఉందో థర్డ్‌ క్లాస్‌ నుంచి సబ్జెట్‌ ఇవ్వాలని ఉందో దాన్ని మాత్రం నూటికి నూరు శాతం అమలు చే స్తామని చెప్పారు. ప్రతి సబ్జెట్‌కు టీచర్‌ ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. నాణ్యమైన విద్యాను టీచర్లు బోధించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. డిజిటల్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి టీచర్లను మోటివేట్‌ చేస్తున్నాం. ఇంటరాక్ట్‌ ఫ్యానల్‌ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. టీచర్లకు ట్రైనింగ్‌ ఇచ్చేందుకు రాష్ట్రంలో 175 ఇంజినీరింగ్‌ కాలేజీలను కూడా ఎంపిక చేశామన్నారు. ఇద్దరు, ముగ్గురు ప్రొఫెసర్లను మాస్టర్‌ ట్రైనింగ్‌ కూడా ఇప్పించామన్నారు. వారి ద్వారా టీచర్లకు ఆఫ్‌ లైన్, ఆన్‌లైన్‌లో ట్రైనింగ్‌ ఇస్తామన్నారు.  డిసెంబర్‌ 21వ తేదీ నాటికి ఆరో తరగతి పైనున్న అన్ని క్లాస్‌లకు ఇంటరాక్ట్‌ ఫ్యానల్స్‌ పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. సుమారు 60 వేల క్లాస్‌ రూమ్స్‌లో ఇంటరాక్ట్‌ ప్యానల్స్‌ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్న స్కూళ్లకు ఒక్కో స్కూల్‌కు ఒక్కో స్మార్ట్‌ టీవీలను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 10 టీవీలు ఏర్పాటు చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. మిగతా స్కూళ్లలో కూడా ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలు కూడా క్షేత్ర స్థాయిలో ఉపాధ్యాయులతో సమావేశమై ఈ ఏడాది కూడా మంచి ఫలితాలు సాధించేలా కృషి చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. 
 

Back to Top