ఏపీఈఏపీ సెట్‌ ఫలితాలు విడుదల

ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ

ఇంజినీరింగ్‌లో 76.32 శాతం ఉత్తీర్ణత

అగ్రికల్చర్‌లో 89.65 శాతం ఉత్తీర్ణత

విజయవాడ:  మే నెలలో నిర్వహించిన ఏపీఈఏపీ సెట్‌ ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో అనంతపురం జెఎన్‌టీయూ యూనివర్సిటీ అధికారులతో కలిసి మంత్రి ఫలితాలు వెల్లడించారు. ఇంజినీరింగ్‌లో 76.32 శాతం ఉత్తీర్ణత, అగ్రికల్చర్‌లో 89.65 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి వివరించారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..గత ఏడాది లాగే ఈ ఏడాది కూడా ఏపీ ఎంసెట్‌ పరీక్షలు జెఎన్‌టీయూ యూనివర్సిటీ అనంతపురం వాళ్లే నిర్వహించారు. దిగ్విజయంగా, సక్సెస్‌ఫుల్‌గా పరీక్షలు నిర్వహించారు. వారికి ప్రభుత్వం తరఫున అభినందనలు తెలిపారు. 

ఏపీఈఏపీ సెట్‌కు మార్చిలో నోటిఫికేషన్‌ ఇచ్చాం. ఈ పరీక్షలకు 3,39,739 మంది పరీక్షలకు హాజరయ్యారు.ఇందులో ఇంజినీరింగ్‌కు 2.38 లక్షల మంది దరఖాస్తు చేశారు, అగ్రికల్చర్‌కు 1,00,559 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఇంజినీరింగ్‌కు మే 17 నుంచి 19 వరకు పరీక్షలు నిర్వహించారు. అగ్రికల్చర్‌కు మే 28, 29వ తేదీల్లో పరీక్షలు జోన్లుగా విభజించి 136 సెంటర్లలో పరీక్షలు నిర్వహించాం.
ఇంజినీరింగ్‌కు సంబంధించి విద్యార్థులు 2,24,724 మంది పరీక్షలకు హాజరయ్యారు. అగ్రికల్చర్‌లో 90,574 మంది పరీక్షలు రాశారు. 94 శాతం మంది పరీక్షలు రాశారు. 

 

Back to Top