ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన అధికారిక పర్యటనే

 మంత్రి బొత్స సత్యనారాయణ
 

అమ‌రావ‌తి: ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ నెల 17న‌ ఢిల్లీ పర్యటన అధికారిక పర్యటనే అని  మంత్రి బొత్స సత్యనారాయణ స్ప‌ష్టం చేశారు. మండ‌లిలో టీడీపీ స‌భ్యులు స‌భా కార్యాక‌లాపాల‌కు అడ్డుత‌గ‌ల‌డంతో మంత్రి అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఇప్పటికిప్పుడు ఢిల్లీ పర్యటనపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి అనటం దారుణమ‌న్నారు. సమాధానం చెప్పకపోతే మేము బాయ్‌కాట్‌ చేస్తామని చెప్పడం సమంజసం కాద‌ని చెప్పారు. ముందుగానే ప్రిపేర్ అయి వచ్చి బాయ్‌కట్‌ చేస్తామని చెప్తున్నారని పేర్కొన్నారు.

Back to Top