విశాఖ రాజధానికి వ్యతిరేకంగా మీ ఆటలు ఇక సాగవ్..

ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునే పార్టీలన్నీ మాకు శత్రువులే

టీడీపీ, జనసేన పార్టీలు మనకు అవసరమా..?

జనసేన రాజకీయ పార్టీనే కాదు.. రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలేవీ లేవు

మంత్రులపై దాడిని ఖండించకపోగా చంద్రబాబు మద్దతా..?

ఉత్తరాంధ్రపై చంద్రబాబు, పవన్, ఎల్లో మీడియాకు ఎందుకీ ద్వేషం, కక్ష..?

ఉత్తరాంధ్రకు ద్రోహం చేసే నేత‌ల చొక్కాలు పట్టుకొని నిల‌దీయండి

విశాఖ గర్జనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు

విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

విశాఖ‌ప‌ట్నం: ఉత్తరాంధ్ర ప్రజలకు రాజధాని ప్రాంత కోరిక లేదనే గొంతుకలు, మాయమాటలు చెప్పేవారికి, విశాఖ రాజధానిని అడ్డుకునేవారికి నిన్న జ‌రిగిన గర్జన కార్యక్రమం ఒక కనువిప్పు అని విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. ఉత్త‌రాంధ్ర ప్రాంతానికి వ్య‌తిరేకంగా మాట్లాడేవారి మనసులు మార్చుకోవాలని విశాఖ ప్రజలు గ‌ట్టి తీర్పు, వార్నింగ్ ఇచ్చార‌న్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన దగ్గర నుంచి, అలాగే జేఏసీ ఏర్పాటు అయినప్పటి నుంచి రాష్ట్రంలో కొందరు క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారని మండిప‌డ్డారు. విశాఖ‌లో వికేంద్రీక‌ర‌ణ జేఏసీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. ఉత్త‌రాంధ్ర‌పై చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ఎల్లో మీడియాకు ఎందుకు అంత ద్వేషం అని ప్ర‌శ్నించారు. 

మంత్రి బొత్స సత్యనారాయణ ఇంకా ఏమన్నారంటే..
ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు ముఖ్యంగా విశాఖపట్నం ప్రజల ఆలోచన, ఆవేదన, కోరిక విశాఖ గర్జన  కార్యక్రమం ద్వారా బహిర్గతమైంది. జోరున వర్షం కురుస్తున్నా కూడా సుమారు అయిదు కిలోమీటర్ల మేర ప్రజలు పెద్దఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. అన్ని సంఘాలు, వ్యవస్థలు, సంస్థలతో పాటు మా ప్రభుత్వ విధానం, వైయస్సార్‌ సీపీ విధానమైన వికేంద్రీకరణకు మద్దతుగా పార్టీ పెద్దలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని ఉత్తరాంధ్ర తాలూకా ఆకాంక్షను తెలియచేశారు. విశాఖ గర్జన ద్వారా ఉత్తరాంధ్ర‌ ప్రజల తమ ఆకాంక్షను చాటారు. విశాఖ పరిపాలనా రాజధాని కావాలనే ఆకాంక్షను వ్యక్తపరిచిన ప్రతి  ఒక్కరికీ మనస్ఫూర్తిగా జేఏసీతో పాటు మా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం.

మాపై ఎందుకీ కక్ష, ద్వేషం..?
టీడీపీ, జనసేనతో పాటు, వారికి వత్తాసు పలుకుతున్న పలు రాజకీయ పార్టీలు, వాటికి వంత పాడుతున్న కొన్ని పత్రికలు, చానల్స్‌ చేస్తున్న ప్రకటనలు ఎలా ఉన్నాయో అందరం చూస్తున్నాం. దురదృష్టం ఏంటంటే ఇవాళ కూడా కొన్ని పత్రికలు, చానల్స్‌లో వచ్చిన వార్తలు చూస్తే వారికి ఇంకా మనసు మారలేదని, కనువిప్పు కలగలేదని స్పష్టం అవుతోంది. విశాఖ మీద ఎందుకీ కక్ష? ఉత్తరాంధ్రపై ఎందుకీ ద్వేషం? ఉత్తరాంధ్ర ప్రాంతం బాగుపడితే సహించలేకపోతున్నారా?.  ప్రభుత్వం తాలుకా ఆర్థిక వనరులకు అనుగుణంగా కొద్దిపాటి పెట్టబడితో ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి విశాఖపట్నం దోహదపడుతుందని తెలిసి కూడా విషం కక్కడం బాధాకరం. వాటికి వంత పాడుతున్న కొన్ని పత్రికలు, చానల్స్‌చేస్తున్న వైనాన్ని చూశాం. దురదృష్టం ఏంటంటే ఇవాళ కూడా కొన్ని పత్రికలు, చానల్స్‌లో వచ్చిన వార్తలు చూస్తే వారికి ఇంకా మనసు మారలేదని, కనువిప్పు కలగలేదని స్పష్టం అవుతోంది. విశాఖ మీద ఎందుకీ కక్ష? ఉత్తరాంధ్రపై ఎందుకీ ద్వేషం? ఉత్తరాంధ్ర ప్రాంతం బాగుపడితే సహించలేకపోతున్నారా? .  ప్రభుత్వం తాలుకా ఆర్థిక వనరులకు అనుగుణంగా కొద్దిపాటి పెట్టబడితో ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి విశాఖపట్నం దోహదపడుతుందని తెలిసి కూడా విషం కక్కడం బాధాకరం.

టీడీపీ, జనసేనలు మనకు అవసరమా..?
ఓవైపు గర్జన కార్యక్రమం జరుగుతుంటే.. మరోవైపు పరిపాలనా రాజధాని ఇక్కడ వద్దంటూ టీడీపీ రౌండ్‌ టేబుల్‌ సమావేశం విశాఖలో పెట్టింది. అలాంటి పార్టీ మనకు అవసరమా అనే విషయాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు ఆలోచన చేయాలి.  తెలుగుదేశం పార్టీ తీర్పు ఇదేనా? ఏ ముఖం పెట్టుకుని విశాఖలో రాజధాని వద్దని చెబుతారు?. ఉత్తరాంధ్రను ఏం చేద్దామనుకుంటున్నారని, మీ ప్రాంతానికి వచ్చినప్పుడు చొక్కా పట్టుకుని అడగండి. అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు. అధికారం కోల్పోయాక కూడా అభివృద్ధి జరుగుతున్నప్పుడు ఎందుకు అడ్డుపడుతున్నారని నిలదీయండి.  విశాఖను పరిపాలనా రాజధాని చేయడం ఒక ఆవశ్యకత. అమ్మ పెట్టా పెట్టదు... అడుక్కుతిననివ్వదనే సామెతలాగా  ఉత్తరాంధ్ర ప్రాంత టీడీపీ నాయకులు తయారయ్యారు. ఇది ధర్మం కాదు.

జనసేన రాజకీయ పార్టీనే కాదు..
టీడీపీకి వత్తాసు పలుకుతున్న పవన్‌ కల్యాణ్‌ పార్టీకి ఒక సంస్కృతి కానీ, విధానం కానీ ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నా? అసలు జనసేన ఒక రాజకీయ పార్టీయేనా? రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయా? సిద్ధాంతాలు కానీ, నీకుగానీ, నీ పార్టీకిగానీ ఉన్నాయా అని అడుగుతున్నాను.  ఏదైనా సంఘటన జరిగితే పూర్వపరాలు తెలుసుకుని, మంచి అయితే మద్దతు ఇవ్వాలి, తప్పు అయితే అది తప్పు అని చెప్పాల్సిన బాధ్యత నాయకుడి లక్షణం. అది ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తికి అయినా ఉండాల్సిన వ్యక్తిత్వం. పవన్‌ కల్యాణ్‌కు ఇవేమీ లేవు. ఎంతసేపూ ఇష్టారాజ్యంగా బుదరచల్లే కార్యక్రమం చేయడం తప్ప. 
- విశాఖను పరిపాలనా రాజధాని చేస్తే నీకు వచ్చే నష్టం, ఇబ్బందేంటని పవన్ ను సూటిగా ప్రశ్నిస్తున్నా?.  ఈ ప్రాంతం నుంచి పోటీ చేసిన నువ్వు గాజువాక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పావు కదా పవన్‌?. రాజకీయాల్లో అధికారంలోకి రావడానికి మీ తాలుకా కార్యచరణలు, ప్రణాళికలు, ముందుచూపు ఏవిధంగా ఉందో ప్రకటించాల్సిన అవసరం ఉంది. విశాఖ రాజధానికి వ్యతిరేకంగా మీ ఆటలు సాగవ్.

మంత్రులపై దాడిని ఖండించకపోగా బాబు మద్దతా..?
నిన్న విమానాశ్రయంలో జరిగిన దాడి ఘటన.. ప్రజాస్వామ్య విరుద్దం అని చంద్రబాబు ఖండించకుండా, దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవడం తప్పని అంటావా?. నీపై దాడి జరిగితే నాకు భద్రత లేదంటూ ఏకంగా కేంద్రానికే రిపోర్టు చేస్తున్నావు కదా? మంత్రులు కూడా నీ లాంటి వ్యక్తులు కాదా? నీలాగా రాజ్యాంగబద్ధంగా ప్రజల్లోకి వచ్చినవాళ్లు కాదా?.  చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏంటో చెప్పాలి.  ఒక్కోసారి అనుకోని సంఘటనలు జరుగుతాయి. పరిస్థితులు మారతాయి. జనసేన పార్టీకి దశ, దిశ లేదు. అది రాజకీయ పార్టీ కాదు.. కేవలం ఒక సెలబ్రెటీకి సంబంధించిన సంస్థ కాబట్టి చిల్లరగాళ్లు ఉంటారు. జరిగినదానిపై సమీక్ష చేసుకుని, మీ తాలూక భాష​ ద్వారానో, మీ అత్యుత్సాహం ద్వారానో తెలుసుకోవాలి. విశాఖ రాజధాని కావాలని లక్షలమంది రోడ్ల మీదకు వచ్చి తమ ఆకాంక్ష తెలుపుతుంటే మీరు ఏ ముఖం పెట్టుకుని మాట్లాడతారు?
- దాడి ఘటనలో పోలీసుల వైఫల్యం కూడా ఉంది. పోలీసుల నిర్లక్ష్యం కూడా కనిపిస్తోంది. దాన్ని మేము కాదనడం లేదు. 

అన్నిటికీ అమరావతి దూరమే..
అయిదు లక్షల కోట్లు తీసుకువెళ్లి 29 గ్రామాల్లో ఖర్చు పెట్టాలట. రాష్ట్ర సంపద అంతా తీసుకువెళ్లి అక్కడే పొయ్యాలట. దానికోసం మేమంతా భజనా చేయాలట. రాజధాని ప్రాంతానికి అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉండాలి. మరి అమరావతిలోని ఆ 29 గ్రామాలకు ఏ కనెక్టవిటీ ఉందని సూటిగా అడుగుతున్నాం.  ఎయిర్‌పోర్టు, సీ పోర్టు, రైల్వే స్టేషన్‌, హైవే కనెక్టివీ అన్నింటికీ అమరావతి దూరమే. అదే విశాఖలో కొద్దిపాటి పెట్టుబడి పెడితే అద్భుత నగరంగా తయారు అవుతుంది.

  • విశాఖ రాష్ట్రానికి ఆదాయ వనరు. రాబోయే ప్రభుత్వాలకు ఇక్కడ నుంచి వచ్చే సంపద ద్వారా పేదరికం నిర్మూలించడానికి ఉపయోగపడుతుంది. ప్రపంచమే అబ్బురపడేలా విశాఖపట్నం తయారవుతుంది. తెలుగుదేశం పార్టీ ముసుగులో చేస్తున్న పాదయాత్ర రైతుల పాదయాత్ర కాదు. టీడీపీ పాదయాత్ర అది. యాత్రకు బయల్దేరినప్పుడే చెప్పారు.. నారా హమారా.. చంద్రబాబు హమారా అని, కాదని చెప్పమనండి.
  • యాత్రలు చేస్తున్నవారు, ఎవరి గురించి ఏం త్యాగం చేశారో చెప్పండి? త్యాగం అనే పదం చాలా చులకన అయిపోయింది. మీ భూముల విలువలు పెంచుకోవడానికి, మీ ఆస్తులు పెంచుకునేందుకు రాష్ట్రం మొత్తం ఖజానాను దోచుకోవడానికి చేస్తున్న కార్యక్రమం. వాళ్లకేనా చట్టం, రాజ్యాంగం? మాకు లేదా చట్టం, రాజ్యాంగం. మాకు హక్కు లేదా?
  • ఉత్తరాంధ్ర ప్రజలు ఇంకా థర్డ్‌ క్లాస్‌ సిటిజన్‌గానే బతకాలా?
  • ఏ ముఖం పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజల ముందుకు వస్తారని అడుగుతున్నాం.
  • ఉత్తరాంధ్ర ప్రజలు మంచివాళ్లం కాబట్టి, చట్టాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి.. మిమ్మల్ని ఇంకా గౌరవ మర్యాదలతో చూస్తున్నారు.

ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు బుద్ధి తెచ్చుకోవాలి
టీడీపీకి కొంచెమైనా సిగ్గుండాలి. ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏం చేశాడు?. రాజకీయాల్లో ఉన్నంతమాత్రాన ఎప్పుడూ రాజకీయాలే కాదు. వాటికి కూడా సమయం, సందర్భం, అర్ధం ఉంటుంది.  ఓవైపు విశాఖ గర్జన కార్యక్రమం జరుగుతుంటే మరోవైపు పరిపాలనా రాజధాని ఇక్కడ వద్దంటూ టీడీపీ రౌండ్‌ టేబుల్‌ పెట్టింది. అలాంటి పార్టీ మనకు అవసరమా అనే విషయాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు ఆలోచన చేయాలి.  వికేంద్రీకరణలో భాగంగా మా నాయకుడిని ఒప్పంచి విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలని కోరుకున్నాం. 29 గ్రామాల్లో రాజధాని పెట్టినప్పుడు విశాఖలో రాజధాని కావాలని ఈ ప్రాంత టీడీపీ నాయకులు ఎందుకు అడగలేదు?.  విశాఖ ప్రజలంతా విశాఖయే రాజధాని కావాలని కోరుకున్నారు. నిన్న గర్జనలో ఇక్కడ ప్రాంత ప్రజల కోరిక, ఆవేదన, ఆక్రోశం, ఆకాంక్షను తెలియచెప్పారు. ఇప్పటికైనా మిగతా రాజకీయ పార్టీలు ఆలోచన చేయాలని కోరుతున్నాం. ఇదే స్పూర్తితో, ఆకాంక్షతో త్వరితగతిన ముఖ్యమంత్రి విశాఖలో పరిపాలన చేయాలని కోరుతున్నాం. 

Back to Top