వికేంద్రీకరణే మా విధానం

మంత్రి బొత్స సత్యనారాయణ

విశాఖ: పరిపాలన వికేంద్రీకరణే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానమని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విశాఖ రాజధాని కోసం జేఏసీ చేపడుతున్న గర్జన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖకు పరిపాలన రాజధాని కావాలని, ఈ ప్రాంతం వెనుకబడి ఉందని ఇక్కడి ప్రజలు ఉద్యమిస్తున్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు, న్యాయవాదులు, ప్రోఫెసర్స్‌ ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. వారికి  మద్దతుగా ఉంటున్నాం. వికేంద్రీకరణే మా పార్టీ, ప్రభుత్వ విధానం కూడా. మా సీఎం వైయస్‌ జగన్‌ లక్ష్యం కూడా ఇదే. అందుకే మేమంతా కూడా ముందుండి నడిపిస్తున్నాం. టీడీపీ ముసుగులో పాదయాత్ర చేస్తూ రాజకీయ లబ్ధి కోసం, దోపిడీ కోసం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఉద్యమం చేస్తున్నారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఉత్తరాంధ్రలో అభివృద్ధి జరిగింది. విశాఖలో ఫార్మాసిటీ, ఎస్‌ఈజెడ్, ఎలక్ట్రసిటీ, విమ్స్‌ ఆసుపత్రి, కొండపై ఉన్న ఐటీ హబ్‌ కూడా వైయస్‌ఆర్‌ హయాంలోనే ఏర్పాటైంది. విజయనగరంలో యూనివర్సిటీ, మెడికల్‌ కాలేజీలు మా హయాంలోనే వచ్చాయి. టీడీపీ ఉత్తరాంధ్రకు ఏం చేసిందో చెప్పాలని బొత్స సత్యనారాయణ డిమాండు చేశారు. 
 

Back to Top