సీపీఎస్‌పై సరైన నిర్ణయం తీసుకుంటాం

సీఎం ఇంటిని ముట్ట‌డిస్తామ‌న‌డం స‌రికాదు

విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

విజ‌య‌న‌గ‌రం: ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సీపీఎస్‌ విధానంపై సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. సీపీఎస్‌పై కమిటీ వేశామని, ఆ కమిటీ అన్ని విషయాలను పరిశీలిస్తుందని, దీనిపై స‌మావేశం కూడా జ‌ర‌గ‌నుంద‌ని చెప్పారు. మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మీడియాతో మాట్లాడుతూ.. యూటీఎఫ్ సభ్యులు ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామనడం సరికాదన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడటం ప్రభుత్వం బాధ్యత అని తెలిపారు. ఉపాధ్యాయుల సెలవుపై టీడీపీ, బీజేపీ అనవసర రాద్ధాంతం ఎందుకు చేస్తున్నాయని ప్ర‌శ్నించారు. 

Back to Top