మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం

మంత్రి బొత్స సత్యనారాయణ

మాయ, మోసం, దగాలో టీడీపీ పుంజుకుంటోంది

రెండో దశ ఎన్నికల్లో  వైయ‌స్ఆర్‌సీపీకి 2639 స్థానాలు

 విశాఖపట్నం: ఎస్‌ఈసీ ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. మాయ, మోసం, దగాలో టీడీపీ పుంజుకుంటోందని ఆయన విమర్శించారు.

మొదటిదశలో 3,244, రెండో దశలో 3,328 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయని తెలిపారు. రెండో దశ ఎన్నికల్లో  వైయ‌స్ఆర్‌సీపీ 2639, టీడీపీ 536, బీజేపీ 6,జనసేన 36, ఇతరులు 108 స్థానాలు గెలిచారని తెలిపారు. ఏకగ్రీవాలతో కలిసి వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు 2,639 మంది గెలిచారని ఆయన వెల్లడించారు. చంద్రబాబులా అంకెలగారడీ చెప్పడం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

టీడీపీ దాడులు హేయమైన చర్య: మంత్రి బాలినేని
ప్రకాశం: పంచాయతీ ఎన్నికల్లో సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభంజనం స్పష్టమైందని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. వైయ‌స్‌ జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్లే వైయ‌స్సార్‌ సీపీ మద్దతుదారులను ప్రజలు గెలిపించారని తెలిపారు. టీడీపీ ఆధిపత్యం గ్రామాల్లో కూడా వైయ‌స్సార్‌ సీపీ మద్దతుదారులు విజయం సాధించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా వైయ‌స్ఆర్‌సీపీదే గెలుపు అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అద్దంకి నియోజకవర్గంలో ఓటమిని తట్టుకోలేకే వైయ‌స్సార్‌ సీపీ  నేతలపై దాడికి పాల్పడ్డారని, టీడీపీ దాడులు హేయమైన చర్య అని మంత్రి బాలినేని మండిపడ్డారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top