అసెంబ్లీ, పార్లమెంట్‌ ఉన్నదే చట్టాలు చేయడానికి..

మంత్రి బొత్స సత్యనారాయణ 
 

అమరావతి:  అసెంబ్లీ, పార్లమెంట్‌ ఉన్నదే చట్టాలు చేయడానికి అని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.  రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఇదన్నారు. మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నామని పేర్కొన్నారు. సీఆర్‌డీఏ చట్టం అమలులోనే ఉందని చెప్పారు. మా ప్రభుత్వ విధానం మూడు రాజధానులు అని వెల్లడించారు. మేం స‌మాజ అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నామ‌ని, టీడీపీ త‌మ సామాజిక వ‌ర్గం అభివృద్ధి కోసం ఆలోచిస్తుంద‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ పేర్కొన్నారు.

తాజా వీడియోలు

Back to Top