వాటిక‌న్ సిటీకి..అమ‌రావ‌తికి సంబంధం ఏంటి బాబూ?

మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌
 

విజ‌య‌వాడ‌: వాటిక‌న్ సిటీకి..అమ‌రావ‌తికి సంబంధం ఏంటని ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబును మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబు అమ‌రేశ్వ‌రుని భూములు కూడా దోచుకున్నార‌ని మంత్రి పేర్కొన్నారు.మ‌తాల మ‌ధ్య చిచ్చుపెట్టేందుకు చంద్ర‌బాబు నీచ రాజ‌కీయాలు చేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. చంద్ర‌బాబు ప‌విత్ర‌మైన హిందువైతే విజ‌య‌వాడ‌లో ఆల‌యాల‌ను ఎందుకు కూల్చార‌ని నిల‌దీశారు. ఆల‌యాలను కూల్చిన‌ప్పుడు చంద్ర‌బాబుకు హిందువులు గుర్తు రాలేదా అని ప్ర‌శ్నించారు.రామ‌తీర్థం ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే ప్ర‌భుత్వం స్పందించింద‌న్నారు.ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే ఆల‌య చైర్మ‌న్ అశోక్ గ‌జ‌ప‌తిరాజే వెళ్ల‌లేద‌ని త‌ప్పుప‌ట్టారు. రామ‌తీర్థం ఘ‌ట‌న‌పై విచార‌ణ‌లో అస‌లు రంగు బ‌య‌ట‌ప‌డుతుంద‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ హెచ్చ‌రించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top