గ్రామస్తుల అవసరాలు తెలుసుకొని సహాయక చర్యలు

మంత్రి బొత్స సత్యనారాయణ
 

విశాఖ: గ్యాస్ లీకేజీ ప్రభావిత గ్రామాల్లో ప్రజల అవసరాలు తెలుసుకొని సహాయక చర్యలు చేపడుతున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం రాత్రి ప్రభావిత గ్రామంలో మంత్రి రాత్రి బస చేశారు. ఉదయం ఇంటింటా పర్యటించి ప్రజలతో మమేకమయ్యారు. సాధారణ స్థితికి గ్యాస్‌ ప్రభావిత గ్రామాలు చేరుకున్నాయని చెప్పారు. ప్రజల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకునేందుకు వైద్య బృందం ఏర్పాటు చేశామన్నారు. వాలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే చేస్తున్నామని చెప్పారు.  ప్రతి ఒక్కొక్కరికి ప్రభుత్వం పరిహారం అందజేస్తుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి పరిహారం అందజేస్తామన్నారు.
 

Back to Top