రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణ నేతల వ్యాఖ్యలు

మూడు రాజధానుల అభివృద్ధిలో భాగంగానే కరకట్ట విస్తరణ పనులు

మంత్రి బొత్స సత్యనారాయణ

అమరావతి:  రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణ నేతలు మాట్లాడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. తెలంగాణ  మంత్రుల్లా అసభ్య పదజాలం వాడాల్సిన అవసరం మాకు లేదన్నారు. నీటి పంపకాల అంశంపై మా ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని చెప్పారు. మా ప్రభుత్వం చేతుల ముడుచుకుని కూర్చొలేదని తెలిపారు.  ఫెడరల్‌ వ్యవస్థలో ఎవరి అధికారాలు వారికి ఉంటాయని స్పష్టం చేశారు. చట్టపరిధి దాటితే వ్యవస్థలు జోక్యం చేసుకుంటాయని చెప్పారు. కేఆర్‌ఎంబీకి పూర్తిగా సహకరిస్తామని వెల్లడించారు. 
మూడు రాజధానుల అభివృద్ధిలో భాగంగానే కరకట్ట విస్తరణ పనులు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. త్వరలోనే సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు పనులు కూడా ప్రారంభిస్తామన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top